AP EAPCET 2026 Updates : ఏపీ ఈఏపీసెట్ అభ్యర్థులకు అప్డేట్ - దరఖాస్తు తేదీల గడువు పొడిగింపు, కొత్త తేదీలివే

ఏపీఈఏపీసెట్ - 2026 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 17వ తేదీ వరకు గడువును పొడిగించారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు

Published on: Mar 01, 2026 8:56 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీసెట్ - 2026 నోటిఫికేషన్ విడుదల సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం…. అర్హులైన విద్యార్థులు మార్చి 7వ తేదీ వరకు ఎలాంటి ఫైన్ లేకుండా అప్లయ్ చేసుకోవచ్చని తెలిపారు.

ఏపీఈఏపీసెట్ దరఖాస్తులు
ఏపీఈఏపీసెట్ దరఖాస్తులు

దరఖాస్తుల గడువు పొడిగింపు…

అయితే తాజాగా దరఖాస్తుల స్వీకణ తేదీల్లో పలు మార్పులు చేశారు. ఫైన్ లేకుండా మార్చి 17వ తేదీ వరకు గడువుని పొడిగించినట్లు ప్రకటించారు. అంతేకాకుండా రూ. 1000 ఫైన్ తో మార్చి 12వ తేదీ వరకు గడువు ఉండగా… మార్చి 21వ తేదీ వరకు పొడిగించారు. ఇక రూ. 2 వేల ఫైన్ తో మార్చి 25, 4 వేల ఆలస్య రుసుంతో మార్చి 30వ తేదీ వరకు అవకాశం కల్పించారు.

ఇక ఏపీ ఈఏపీసెట్ అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ ఏప్రిల్ 4వ తేదీన అందుబాటులోకి వస్తుందని తాజాగా అధికారులు ప్రకటించారు. ఆన్ లైన్ దరఖాస్తులో ఏమైనా తప్పులుంటే ఏప్రిల్ 6వ తేదీ వరకు సరి చేసుకోవాలని సూచించారు. ఇక పరీక్ష తేదీలు, కీల విడుదల తేదీల్లో ఎలాంటి మార్పులు లేవని… గతంలో ప్రకటించిన తేదీల్లోనే ఉంటాయని స్పష్టం చేశారు.

AP EAPCET 2026 - ముఖ్యమైన తేదీలు

  • ఎంట్రెన్స్ పరీక్ష - ఏపీ ఈఏపీసెట్ - 2026.
  • దరఖాస్తులకు చివరి తేదీ -107-03-2026.
  • రూ. 1000 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ - 21-03-2026.
  • రూ. 2000 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ -25-03-2026
  • రూ. 4000 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ - 30-03-2026.
  • రూ. 10,000 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ - 3-04-2026 .
  • అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ - 04-04-2026 నుంచి 06-04-2026.
  • హాల్ టికెట్ డౌన్లోడ్ - 28-04-2026 .
  • ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్ష - 12-05-2026 నుంచి 15-05-2026 వరకు, మరియు18-05-2026 తేదీల్లో పూర్తవుతాయి.
  • అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలు - 19-05-2026 నుంచి 20-05-2026 .
  • అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్ స్ట్రీమ్ ప్రాథమిక కీ విడుదల - 23-05-2026 .
  • అభ్యంతరాల స్వీకరణ - 25-05-2025.
  • ప్రాథమికంగా ఫలితాలు ప్రకటించే తేదీ - 01-06-2026 .

ఏపీ ఈఏపీసెట్ - 2026 దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ పూర్తి అయిన వారితో పాటు ప్రస్తుతం ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు రాసే విద్యార్థులు కూడా అర్హులవుతారు.ఈ పరీక్షను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరఫున జేఎన్‌టీయూ కాకినాడ, నిర్వహిస్తోంది.

ఏపీ ఈఏపీసెట్ - 2026 నిర్వహించిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటించారు. ఆ తర్వాత ర్యాంకులను వెల్లడిస్తారు. విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్ల భర్తీ కోసం ఉన్నత విద్యా మండలి కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటించింది. విడతల వారీగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారానే సీట్ల ప్రక్రయను పూర్తి చేస్తారు.