TG EAPCET 2026 : టీజీ ఈఏపీసెట్ రిజిస్ట్రేషన్ ప్రారంభం.. దరఖాస్తుకు డైరెక్ట్ లింక్ ఇదే, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
తెలంగాణ ఈఏపీసెట్ 2026 దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎలా దరఖాస్తు చేయాలో ఇక్కడ చూడండి.
తెలంగాణలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ 2026 అప్లికేషన్ ప్రారంభమైంది. ఈ ఎగ్జామ్ ద్వారా 2026-2027 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు. ఫిబ్రవరి 19 నుంచి TG EAPCET 2026 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను మెుదలైంది. తెలంగాణ ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కు హాజరు కావడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్ eapcet.tgche.ac.in ద్వారా అప్లై చేయవచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి
- TG EAPCET అధికారిక వెబ్‌సైట్ eapcet.tgche.ac.in ని సందర్శించండి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న TG EAPCET 2026 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
- అభ్యర్థులు రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, ఖాతాకు లాగిన్ అవ్వండి.
- దరఖాస్తు ఫారమ్ నింపి దరఖాస్తు రుసుము చెల్లించండి.
- సబ్మిట్ పై క్లిక్ చేసి కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి.
- తదుపరి అవసరం కోసం హార్డ్ కాపీని మీ దగ్గర ఉంచుకోండి.
ఆలస్య రుసుము లేకుండా పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 4, 2026 వరకు ఉంది. ఎడిట్ విండో ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 8 వరకు ఉంటుంది.
- రూ. 250 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ - 10-04-2026
- రూ. 500 ఫైన్ తో చివరి తేదీ - 15-04-2026
- రూ. 2,500 ఆలస్య రుసుంతో చివరి తేదీ - 20-04-2026
- రూ. 5,000 ఆలస్య రుసుంతో చివరి తేదీ - 24-04-2026
- రూ. 10,000 ఆలస్య రుసుంతో చివరి తేదీ - : 02-05-2026
- ఇంటర్ పూర్తి అయిన విద్యార్థులు టీజీ ఈఏపీసెట్ పరీక్ష రాసేందుకు అర్హులవుతారు.
- టీజీ ఈఏపీసెట్ -2026 (బైపీసీ స్ట్రీమ్) పరీక్ష తేదీలు - మే 4, మే 5న అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఉంటాయి.
- టీజీ ఈఏపీసెట్ - 2026(ఇంజినీరింగ్ స్ట్రీమ్) పరీక్ష తేదీలు - మే 9 నుంచి మే 11 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.
మే 4, 5 తేదీలలో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 9 నుండి 11 వరకు ఇంజనీరింగ్ పరీక్షలను నిర్వహిస్తారు. పరీక్ష రెండు షిఫ్టులలో జరుగుతుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కాగా రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది.
ఇంజనీరింగ్ పేపర్ నమూనా
ప్రవేశ పరీక్ష 3 గంటల వ్యవధిలో ఉంటుంది. ప్రశ్నాపత్రంలో మొత్తం 160 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో గణితంలో 80 ప్రశ్నలు, భౌతిక శాస్త్రంలో 40 ప్రశ్నలు, రసాయన శాస్త్రంలో 40 ప్రశ్నలు ఉంటాయి. అన్ని ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్, ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.
అగ్రికల్చర్, ఫార్మసీ
3 గంటల వ్యవధిలో ఉంటుంది. ప్రశ్నాపత్రంలో మొత్తం 160 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో జీవశాస్త్రంలో మొత్తం 80 ప్రశ్నలు (వృక్షశాస్త్రం - 40, జంతుశాస్త్రం - 40), భౌతికశాస్త్రంలో 40 ప్రశ్నలు, రసాయన శాస్త్రంలో 40 ప్రశ్నలు ఉంటాయి. అన్ని ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్, ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.
టీజీ ఈఏపీసెట్ - 2026 పరీక్షలు పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటిస్తారు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం ర్యాంకులను వెల్లడిస్తారు. అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహిస్తారు, సీట్లను భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి అయినప్పటికీ సీట్ల మిగిలితే.. స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను విడుదల చేస్తారు. ఈ విషయంలో ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


