TG EAPCET 2026 : టీజీ ఈఏపీసెట్ అప్డేట్ - సిలబస్ విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి

టీజీ ఈఏపీసెట్ - 2026 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి దరఖాస్తులు మొదలవుతాయి. అయితే విద్యార్థుల కోసం ముందుగానే సిలబస్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. 

Published on: Feb 18, 2026, 11:00:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా 2026 -2027 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 19 నుంచి మొదలవుతాయి. అయితే తాజాగా అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. సిలబస్ వివరాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.

టీజీ ఈఏపీసెట్ అప్డేట్ - సిలబస్ విడుదల (image from istock)
టీజీ ఈఏపీసెట్ అప్డేట్ - సిలబస్ విడుదల (image from istock)

TG EAPCET 2026 - సిలబస్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

  • విద్యార్థులు ముందుగా https://eapcet.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే సమాచారం సెక్షన్ లో సిలబస్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ ఇంజినీరింగ్ స్ట్రీమ్ (Engineering Stream (E)), అగ్రికల్చర్ - ఫార్మసీ స్ట్రీమ్(Agriculture & Pharmacy Stream (A & P)) ఆప్షన్ కనిపిస్తాయి.
  • మీరు ఏ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారో ఆ స్ట్రీమ్ లింక్ పై క్లిక్ చేయాలి.
  • సిలబస్ వివరాలతో కూడిన పీడీఎఫ్ అందుబాటులో ఉంటుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా సిలబస్ కాపీని పొందవచ్చు.

దరఖాస్తుల ప్రక్రియ - ముఖ్యమైన తేదీలు

ఫిబ్రవరి 19 నుంచి టీజీ ఈఏపీసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రాసెస్ ప్రారంభమవుతుంది. ఫైన్ లేకుండా ఏప్రిల్ 4వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫైన్ తో అయితే… మే 2 వరకు ఛాన్స్ ఉంటుంది.

టీజీ EAPCET -2026 పరీక్షల నిర్వహణ తేదీలు చూస్తే.. మే 4, మే 5న అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఉంటాయి. మే 9 నుంచి మే 11 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. పరీక్షలు పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటించి… అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం ర్యాంకులను వెల్లడించారు. ఈసారి కూడా జేఎన్టీయూనే ఎంట్రెన్స్ బాధ్యతలను చూడనుంది.

  • ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం - 19 ఫిబ్రవరి 2026
  • ఫైన్ లేకుండా చివరి తేదీ - 4 ఏప్రిల్ 2026.
  • రూ. 250 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ - 10-04-2026
  • రూ. 500 ఫైన్ తో చివరి తేదీ - 15-04-2026
  • రూ. 2,500 ఆలస్య రుసుంతో చివరి తేదీ - 20-04-2026
  • రూ. 5,000 ఆలస్య రుసుంతో చివరి తేదీ - 24-04-2026
  • రూ. 10,000 ఆలస్య రుసుంతో చివరి తేదీ - : 02-05-2026)
  • ఇంటర్ పూర్తి అయిన విద్యార్థులు టీజీ EAPCET పరీక్ష రాసేందుకు అర్హులవుతారు.
  • టీజీ ఈఏపీసెట్ -2026 (బైపీసీ స్ట్రీమ్) పరీక్ష తేదీలు - మే 4, మే 5న అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఉంటాయి.
  • టీజీ ఈఏపీసెట్ - 2026(ఇంజినీరింగ్ స్ట్రీమ్) పరీక్ష తేదీలు - మే 9 నుంచి మే 11 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.
  • అధికారిక వెబ్ సైట్ - https://eapcet.tgche.ac.in/

టీజీ ఈఏపీసెట్ - 2026 పరీక్షలు పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటించి… అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం ర్యాంకులను వెల్లడించారు. అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించి… సీట్లను భర్తీ చేస్తారు.

టీజీ ఈఏపీసెట్ - ప్రశ్నలు, జవాబులు (FAQ)

  1. టీజీ ఈఏపీసెట్ ఏంటి..?

రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రెన్స్ ఎగ్జామ్. గతంలో ఈ పరీక్షను ఎంసెట్ (EAMCET) పేరుతో నిర్వహించేవారు. ఆ తర్వాత ఈ పేరును TG EAPCET(టీజీ ఈఏపీసెట్)గా మార్చారు.

2. టీజీ ఈఏపీసెట్ పరీక్ష విధానం ఎలా ఉంటుంది..?

ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో టీజీ ఈఏపీసెట్ పరీక్ష జరుగుతుంది. మొత్తం 160 ప్రశ్నలుంటాయి. 3 గంటల సమయం ఉంటుంది, నెగటివ్ మార్కింగ్ లేదు. ఇంజినీరింగ్ స్ట్రీమ్, అగ్రికల్చర్ - ఫార్మసీ స్ట్రీమ్‌లకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తారు.

3. టీజీ ఈఏపీసెట్ సీట్ల కేటాయింపు ఎలా ఉంటుంది..?

టీజీ ఈఏపీసెట్ పరీక్ష తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. ఇందులో మంచి ర్యాంకులు సాధించిన వారికి పేరొందిన కాలేజీల్లో సీట్లు దక్కే అవకాశం ఉంటుంది. ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో సాధించే స్కోరును బట్టి ర్యాంకులను ప్రకటిస్తారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More