మీ మొబైల్‌లోనే TG EAPCET 2026 అప్లై చేసుకోవచ్చు.. స్టూడెంట్ ఫ్రెండ్లీ పరీక్ష కేంద్రాలు!
తెలంగాణ ఈఏపీసెట్‌పై కీలక అప్డేట్ వచ్చింది. ఈఏపీసెట్ కోసం విద్యార్థులు మెుబైల్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ మేరకు అధికారులు వెల్లడించారు.
ఈఏపీసెట్ పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, జేఎన్‌టీయూ వర్సిటీ వీసీ కిషన్‌కుమార్, రెక్టార్ విజయ్‌కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావుతోపాటుగా పలువురు అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పలు కీలక విషయాలు వెల్లడించారు.

టీజీ ఈఏపీసెట్ అప్లికేషన్స్ సహా.. పరీక్షల్లో ఎలాంటి తప్పులు దొర్లకుండా.. పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్టుగా జెఎన్‌టీయూ రెక్టార్ విజయ్‌కుమార్ రెడ్డి చెప్పారు. 'ఈ ఏడాది మెుదటిసారిగా మెుబైల్ ద్వారా ఈఏపీసెట్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. పరీక్ష పూర్తయిన వెంటనే విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ప్రిలిమినరీ మార్కులు స్క్రీన్‌పై డిస్‌ప్లే అయ్యేలా చూస్తాం. దీంతో విద్యార్థులు ఫలితాలు వచ్చేదాకా ఎదురుచూడకుండా.. గతేడాది ర్యాంకులతో పోల్చి తమకు సుమారు ఎంత ర్యాంక్ వచ్చిందో అంచనాకు రావొచ్చు.' అని విజయ్‌కుమార్ రెడ్డి అన్నారు.
అంతేకాదు రిజిస్ట్రేషన్ టైమ్‌లో తప్పులు దొర్లితే.. విద్యార్థులకు ఎడిట్ ఆప్షన్ ఉంటుందని విజయ్‌కుమార్ రెడ్డి చెప్పారు. ఇంటర్ బోర్డు నుంచి తాము వివరాలు తీసుకున్నామన్నారు. విద్యార్థులు స్ట్రీమ్ తప్పుగా పెడితే.. హెల్ప్ డెస్క్ నుంచి సమాచారం ఇస్తామని వెల్లడించారు. స్టూడెంట్ ఫ్రెండ్లీ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఆరోగ్య సమస్యలు, జ్వరం వంటి సమస్యలు ఉన్నవారికి పరీక్షా కేంద్రాల్లో అవసరమైన వైద్య సాయం అందిస్తామని పేర్కొన్నారు
టీజీ ఈఏపీసెట్ -2026 పరీక్షలు మే 4, మే 5న అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఉంటాయి. మే 9 నుంచి మే 11 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఉదయం, మధ్యాహ్నం రెండు షిప్టుల్లో పరీక్షలు జరుగుతాయి.
ముఖ్యమైన తేదీలు
- ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం - 19 ఫిబ్రవరి 2026
- ఫైన్ లేకుండా చివరి తేదీ - 4 ఏప్రిల్ 2026.
- రూ. 250 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ - 10-04-2026
- రూ. 500 ఫైన్ తో చివరి తేదీ - 15-04-2026
- రూ. 2,500 ఆలస్య రుసుంతో చివరి తేదీ - 20-04-2026
- రూ. 5,000 ఆలస్య రుసుంతో చివరి తేదీ - 24-04-2026
- రూ. 10,000 ఆలస్య రుసుంతో చివరి తేదీ - : 02-05-2026)
- ఇంటర్ పూర్తి అయిన విద్యార్థులు టీజీ ఈఏపీసెట్ పరీక్ష రాసేందుకు అర్హులవుతారు.
- టీజీ ఈఏపీసెట్ -2026 (బైపీసీ స్ట్రీమ్) పరీక్ష తేదీలు - మే 4, మే 5న అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఉంటాయి.
- టీజీ ఈఏపీసెట్ - 2026(ఇంజినీరింగ్ స్ట్రీమ్) పరీక్ష తేదీలు - మే 9 నుంచి మే 11 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.
- అధికారిక వెబ్ సైట్ - https://eapcet.tgche.ac.in/
అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహిస్తారు. ఆ తర్వాత సీట్లను భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి అయినప్పటికీ సీట్ల మిగిలితే.. స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను విడుదల చేస్తారు. ఈ విషయంలో ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈసారి కూడా జేఎన్టీయూనే టీజీ ఈఏపీసెట్ 2026 ఎంట్రెన్స్ బాధ్యతలను చూసుకుంటోంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


