Bank jobs : నెలకు రూ. 86వేల వరకు జీతం- ఎస్బీఐ సీబీఓ అప్లికేషన్‌కి ఇంకొన్ని రోజులే ఛాన్స్..
ఎస్బీఐ సీబీఓ రిక్రూట్మెంట్ 2026 రిజిస్ట్రేషన్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ దఫా రిక్రూట్మెంట్కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
నిరుద్యోగులు, బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ముఖ్యమైన అలర్ట్! భారీ వేతనంతో కూడిన ఎస్బీఐ సీబీఓ రిక్రూట్మెంట్ 2026 ( స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్) రిజిస్ట్రేషన్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ ఫిబ్రవరి 25 లోపు అప్లికేషన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..

ఎస్బీఐ సీబీఓ రిక్రూట్మెంట్ 2026- ముఖ్యమైన వివరాలు..
ఆర్గనైజేషన్- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు- సర్కిల్ బేస్ట్ ఆఫీసర్ (సీబీఓ)
మొత్తం వేకెన్సీలు- 2273 (2050 రెగ్యులర్ + 223 బ్యాక్లాగ్)
పే స్కేల్- నెలకు రూ. 48,480 నుంచి రూ. 85,920 వరకు
క్వాలిఫికేషన్- డిగ్రీ
ఎక్స్‌పీరియెన్స్- ఆఫీసర్‌గా (ఎస్సీబీ/ ఆర్ఆర్బీ) కనీసం రెండేళ్లు
వయస్సు పరిమితి- 21 నుంచి 30ఏళ్లు (నిబంధనల ప్రకారం సండలింపు ఉంటుంది)
అప్లికేషన్ తేదీ మొదలు- జనవరి 29, 2026
అప్లికేషన్‌కి చివరి తేదీ- ఫిబ్రవరి 25, 2026
అధికారిక వెబ్సైట్- sbi.bank.in/web/careers/current-openings
ఎస్బీఐ సీబీఓ రిక్రూట్మెంట్ 2026- వేకెన్సీలు..
ఈ దఫా ఎస్బీఐ సీబీఓ రిక్రూట్మెంట్లో గుజరాత్ గాంధీ నగర్లో అత్యధిక సీట్లు (249) ఉన్నాయి. హైదరాబాద్‌లో 80 పోస్టులు, అమరావతిలో 101 పోస్టులు, బెంగళూరులో 236 పోస్టులు, చెన్నైలో 208 పోస్టులకు నియామకం జరగనుంది.
అప్లై చేస్తున్న వారికి మాత్రం స్థానిక భాషపై కచ్చితంగా పట్టు ఉండాలి. అంతేకాదు రుణ ఎగవేతలు, క్యారెక్టర్‌పై ప్రతికూల మార్కులు ఉండకూడదు.
ఎస్బీఐ సీబీఓ రిక్రూట్మెంట్ 2026- అప్లికేషన్ ఫీజు..
ఈ ఎస్బీఐ సీబీఓ రిక్రూట్మెంట్ 2026 కోసం అప్లై చేస్తున్న వారికి ఫీజు ఈ విధంగా ఉంటుంది..
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ- రూ. 750
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ- రూ. 0
ఈ ఫీజు నాన్- రీఫండెబుల్ అని గుర్తుపెట్టుకోవాలి.
ఎస్బీఐ సీబీఓ రిక్రూట్మెంట్ 2026- ఎంపిక ప్రక్రియ..
మొదటి దశలో ఆన్లైన్ పరీక్ష ఉంటుంది (120 మార్కులు, 2 గంటలు). నెగిటివ్ మార్కింగ్ ఉండదు.
రెండో దశలో డాక్యుమెంట్ స్క్రీనింగ్ ఉంటుంది.
మూడొవ దశలో ఇంటర్వ్యూ ఉంటుంది. (50 మార్కులు)
12వ తరగతిలో స్థానిక లేని వారికి ప్రత్యేకంగా 4వ దశలో పరీక్ష ఉంటుంది.
ఎస్బీఐ సీబీఓ రిక్రూట్మెంట్ 2026- రిజిస్ట్రేషన్ ప్రక్రియ..
స్టెప్ 1- ఎస్బీఐ సీబీఓ రిక్రూట్మెంట్ 2026 కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు sbi.bank.in/web/careers/current-openings లింక్ ఓపెన్ చేయండి.
స్టెప్ 2- ఎస్బీఐ సీబీఓ లింక్ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 3- రిజిస్ట్రేషన్ చేసి ఫామ్‌ని జాగ్రత్తగా ఫిల్ చేయండి.
స్టెప్ 4- ఫొటోలు అప్లోడ్ చేయండి. సంతకం, థంబ్ ఇంప్రెషన్, చేతి రాతతో డిక్లరేషన్, డాక్యుమెంట్స్ వంటివి ఇవ్వాల్సి ఉంటుంది.
స్టెప్ 5- అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటే చెల్లించండి.
స్టెప్ 6- ఫామ్‌ని సబ్మిట్ చేసి, ప్రింటౌట్ తీసుకోండి.
చివరి నిమిషం గందరగోళం నుంచి తప్పించుకునేందుకు ముందుగానే రిజిస్ట్రర్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

E-Paper












