Bank job : ఆర్బీఐలో అసిస్టెంట్​ పోస్టులకు నోటిఫికేషన్​- నెలకు రూ. 59వేల వరకు జీతం, అనేక బెనిఫిట్స్​..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దేశవ్యాప్తంగా ఉన్న తన వివిధ ప్రాంతీయ కార్యాలయాల్లో 650 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 16, 2026 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా, మార్చి 8, 2026 దరఖాస్తుకు చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Feb 17, 2026 10:00 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిరుద్యోగులు, బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కీలక అలర్ట్​! దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న 650 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 16, 2026న విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ అసిస్టెంట్​ నోటిఫికేషన్​ 2026లోని కీలక వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియాలో ఉద్యోగాలు..
రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియాలో ఉద్యోగాలు..

ఆర్బీఐ అసిస్టెంట్​ రిక్రూట్​మెంట్​ 2026- ముఖ్యమైన తేదీలు..

ఆర్బీఐ అసిస్టెంట్​ నోటిఫికేషన్ విడుదల: 16 ఫిబ్రవరి 2026

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 16 ఫిబ్రవరి 2026

దరఖాస్తుకు చివరి తేదీ: 08 మార్చి 2026

ప్రిలిమ్స్ పరీక్ష తేదీ (తాత్కాలికం): 11 ఏప్రిల్ 2026

మెయిన్స్ పరీక్ష తేదీ (తాత్కాలికం): 07 జూన్ 2026

ఆర్బీఐ అసిస్టెంట్​ రిక్రూట్​మెంట్​ 2026- అర్హత ప్రమాణాలు..

విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు కేవలం పాస్ మార్కులు ఉంటే సరిపోతుంది). అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

వయోపరిమితి: ఆర్బీఐ అసిస్టెంట్​ పోస్టుల కోసం అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి (01 ఫిబ్రవరి 2026 నాటికి). ప్రభుత్వం నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ప్రాంతీయ భాష: అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ప్రాంతీయ కార్యాలయానికి సంబంధించిన స్థానిక భాష రాయడం, చదవడం, మాట్లాడడం తెలిసి ఉండాలి.

ఆర్బీఐ అసిస్టెంట్​ రిక్రూట్​మెంట్​ 2026- ఖాళీలు ఇలా..

ఈ 650 ఆర్బీఐ అసిస్టెంట్​ పోస్టుల్లో అత్యధిక ఖాళీలు ముంబై (249)లో ఉన్నాయి. దిల్లీలో 49, బెంగళూరులో 24, హైదరాబాద్​లో 11 వేకెన్సీలు ఉన్నాయి.

ఆర్బీఐ అసిస్టెంట్​ రిక్రూట్​మెంట్​ 2026- ఎంపిక విధానం..

ఆర్బీఐ అసిస్టెంట్ రిక్రూట్​మెంట్​ 2026 ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది:

ప్రిలిమినరీ పరీక్ష: ఇది ప్రాథమిక దశ, దీనిలో సాధించిన మార్కులను తుది ఎంపికకు పరిగణించరు.

మెయిన్ పరీక్ష : ఈ పరీక్షలో వచ్చే మెరిట్ ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (ఎల్టీపీ): మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి స్థానిక భాషపై పట్టు ఉందో లేదో పరీక్షించేందుకు ఈ టెస్ట్ నిర్వహిస్తారు.

ఆర్బీఐ అసిస్టెంట్​ రిక్రూట్​మెంట్​ 2026- జీతం, ప్రయోజనాలు..

ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు రూ. 58,514 వరకు (హెచ్‌ఆర్‌ఏ కాకుండా) వేతనం లభిస్తుంది. దీనితో పాటు మెడికల్ సదుపాయాలు, ఎల్టిసీ, పెన్షన్, ఇతర బ్యాంకింగ్ అలవెన్సులు అందుతాయి.

ఆర్బీఐ అసిస్టెంట్​ రిక్రూట్​మెంట్​ 2026- దరఖాస్తు ఫీజు..

జనరల్​/ ఓబీసీ/ ఈడబ్ల్యూడీ అభ్యర్థులకు: రూ. 450 (+ 18% జీఎస్టీ)

ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూడీ/ ఎక్స్​-సర్వీస్​మెన్​: రూ. 50 (+ 18% జీఎస్టీ)

ఆసక్తి గల అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా వెంటనే ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్ rbi.org.in సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఆర్బీఐ అసిస్టెంట్​ నోటిఫికేషన్​ 2026 అప్లికేషన్​ డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఆర్బీఐ అసిస్టెంట్​ రిక్రూట్​మెంట్​ 2026 నోటిఫికేషన్​ డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.