పరీక్ష లేకుండా ఏపీలో నేషనల్ హెల్త్ మిషన్‌ జాబ్స్.. మరికొన్ని రోజులే అప్లికేషన్‌కు ఛాన్స్

నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ ఆరోగ్య మిషన్ కింద పలు పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే అప్లై చేయాలి.

Published on: Feb 15, 2026, 20:26:32 IST
By , Chittoor
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ ఆరోగ్య మిషన్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ మేరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 20వ తేదీలోపు సంబంధిత కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలి. డేటా మేనేజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మైక్రోబయాలజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్లు, ల్యాబ్ అసిస్టెంట్ వంటి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును భట్టి అర్హతలు ఉంటాయి.

ఏపీలో నేషనల్ హెల్త్ మిషన్‌ జాబ్స్
ఏపీలో నేషనల్ హెల్త్ మిషన్‌ జాబ్స్

జీతం విషయానికి వస్తే.. డేటా మేనేజర్లు పోస్టుకు రూ.36,225, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు రూ.18,450, మైక్రోబయాలజిస్ట్ పోస్టుకు రూ.45,282, ల్యాబ్ టెక్నీషియన్లకు రూ.23,393, ల్యాబ్ అసిస్టెంట్ రూ.15,000 వేతనం చెల్లిస్తారు. ప్రస్తుతం ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ నేషనల్ హెల్త్ మిషన్‌ కింద చిత్తూరు జిల్లాలో జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం నుండి కాంట్రాక్ట్ ప్రాతిపదికన విడుదలైంది.

ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో జాతీయ ఆరోగ్య మిషన్‌లో ఖాళీగా ఉన్న డేటా మేనేజర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మైక్రో బయాలజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 , ల్యాబ్ అటెండెంట్ పోస్టులు భర్తీ చేస్తారు.

ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు DM&HO, Chittoor పేరు మీద చెల్లుబాటు అయ్యేలా ఏదైనా జాతీయ బ్యాంకులో డీడీ తీసి అప్లికేషన్‌కు జతపరచాలి. చిత్తూరు జిల్లా వైద్యారోగ్య శాఖ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు.. తమ దరఖాస్తులను ఫిబ్రవరి 20వ తేదీలోపు అప్లై చేయాలి. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను రాత పరిక్షలేకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్, మెరిట్ ఆధారంగా సెలక్ట్ చేస్తారు.

జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి, చిత్తూరు కార్యాలయానికి అభ్యర్థి వెళ్లి అప్లికేషన్ స్వయంగా అందజేయాలి. అప్లికేషన్‌కు జతచేయాల్సిన డాక్యుమెంట్స్ : నింపిన దరఖాస్తు ఫారానికి తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటో అతికించాలి. ఎస్ఎస్‌సీ (లేదా) సమానమైన సర్టిఫికెట్ మార్కుల మెమో కాపీ జతపరచాలి. అర్హత పొందిన అన్ని సంవత్సరాల మార్కుల మెమోల ధృవీకరించిన కాపీలు జత చేయాలి. తాత్కాలిక / శాశ్వత అర్హత సర్టిఫికేట్ ధృవీకరించబడిన కాపీలు జతపరచాలి.

తాజా కుల ధృవీకరణ పత్రం, అభ్యర్థి చదివిన తరగతి-IV నుండి X వరకు అధ్యయన ధృవీకరణ పత్రాల ధృవీకరించిన కాపీలు జత చేయాలి. శారీరకంగా వికలాంగుల సర్టిఫికేట్, మాజీ సైనికులు (వర్తిస్తే) కూడా ఉంటే అందజేయాలి. అనుభవ ధృవీకరణ పత్రం, ఆధార్ కాపీతోపాటుగా ఏదైనా జాతీయ బ్యాంకు నుండి తీసుకున్న 500 రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ ను జత పరచాలి.

ఈ లింక్ క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ చదవండి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More