ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది. నిజానికి ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… ఇప్పటికే సీట్ల కేటాయింపు పూర్తి కావాల్సి ఉంది. కానీ కొన్ని కాలేజీలకు బీసీఐ అనుమతులు లేకపోవటంతో కౌన్సెలింగ్ ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది. తాజాగా ఆయా కాలేజీలకు అనుమతులు రావటంతో… కౌన్సెలింగ్ ప్రక్రియ ముందుకెళ్లనుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి తేదీలను ప్రకటించింది.
ఈనెల 25న సీట్ల కేటాయింపు..

ఇప్పటికే లాసెట్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు పూర్తి అయ్యాయి. అయితే ఈనెల 21వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. ఈనెల 22 వరకు ఈ అవకాశం ఉంటుంది. ఈనెల 23వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు. ఇక ఈనెల 25వ తేదీన సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు 27 నుంచి 29 లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. అక్టోబర్ 27వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
ఈ ఏడాది జరిగిన ఏపీ లాసెట్ కు మొత్తం 27,253 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 20,826 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మూడేళ్లు, ఐదేళ్ల లా, పీజీ ఎంట్రెన్స్ పరీక్షలన్నీ కలిపి 95 శాతానికిపైగా ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాలను https://cets.apsche.ap.gov.in/ లేదా మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
ఏపీ లాసెట్ 2025 ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి
- అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/LAWCET/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే లాసెట్ ఫలితాలపై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ను నమోదు చేయాలి.
- సబ్మిట్ చేస్తే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
- అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా కీలకం. జాగ్రత్తగా ఉంచుకోవాలి.