ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ 2025 : ఎట్టకేలకు వెబ్ ఆప్షన్ తేదీలు వచ్చేశాయ్ - సీట్ల కేటాయింపు ఎప్పుడంటే..?
ఏపీ లాసెట్ - 2025 కౌన్సెలింగ్ కు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. చాలా రోజుల కిందటే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి అయినప్పటికీ సీట్ల కేటాయింపు జరగలేదు. అయితే తాజాగా వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈనెల 25వ తేదీన సీట్లను కేటాయిస్తారు.
ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది. నిజానికి ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… ఇప్పటికే సీట్ల కేటాయింపు పూర్తి కావాల్సి ఉంది. కానీ కొన్ని కాలేజీలకు బీసీఐ అనుమతులు లేకపోవటంతో కౌన్సెలింగ్ ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది. తాజాగా ఆయా కాలేజీలకు అనుమతులు రావటంతో… కౌన్సెలింగ్ ప్రక్రియ ముందుకెళ్లనుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి తేదీలను ప్రకటించింది.

ఈనెల 25న సీట్ల కేటాయింపు..
ఇప్పటికే లాసెట్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు పూర్తి అయ్యాయి. అయితే ఈనెల 21వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. ఈనెల 22 వరకు ఈ అవకాశం ఉంటుంది. ఈనెల 23వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు. ఇక ఈనెల 25వ తేదీన సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు 27 నుంచి 29 లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. అక్టోబర్ 27వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
ఈ ఏడాది జరిగిన ఏపీ లాసెట్ కు మొత్తం 27,253 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 20,826 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మూడేళ్లు, ఐదేళ్ల లా, పీజీ ఎంట్రెన్స్ పరీక్షలన్నీ కలిపి 95 శాతానికిపైగా ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాలను https://cets.apsche.ap.gov.in/ లేదా మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
ఏపీ లాసెట్ 2025 ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి
- అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/LAWCET/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే లాసెట్ ఫలితాలపై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ను నమోదు చేయాలి.
- సబ్మిట్ చేస్తే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
- అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా కీలకం. జాగ్రత్తగా ఉంచుకోవాలి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

