AP PGECET 2026 Counselling : ఏపీ పీజీఈసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల - ఈనెల 16 నుంచి రిజిస్ట్రేషన్లు

AP PGECET 2026 Counselling : ఎం.టెక్, ఎం.ఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీఈసెట్ వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 16 నుంచి 25 వరకు ఆన్‌లైన్ ప్రక్రియ కొనసాగనుంది.

Published on: Sep 12, 2026, 16:40:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP PGECET 2026 Counselling : రాష్ట్రంలోని ఎం.టెక్, ఎం.ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీపీజీఈసెట్ కౌన్సెలింగ్ పై కీలక అప్డేట్ వచ్చేసింది. తాజా ఉన్నత విద్యామండలి… ఏపీ పీజీఈసెట్ వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఏపీ పీజీఈసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల
ఏపీ పీజీఈసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల

గేట్, జీప్యాట్ (GPAT), ఏపీ పీజీఈసెట్-2026 (AP PGECET-2026) పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియలో పాల్గొనేందుకు అర్హులని కౌన్సెలింగ్ కన్వీనర్ వి. పద్మారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 16వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ముఖ్యమైన తేదీలు…

ప్రాథమిక నోటిఫికేషన్ లో ప్రకటించిన వివరాల ప్రకారం… ఏపీ పీజీఈసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 16వ తేదీ (16-09-2026) నుంచి ప్రారంభమై… 25వ తేదీ (25-09-2026) వరకు కొనసాగుతుంది. ఈ వ్యవధిలోనే అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ల ఆన్‌లైన్ పరిశీలన (ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్), వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

  • కోర్సులు: ఎం.టెక్, ఎం.ఫార్మసీ, ఫార్మా-డి (పి.బి)
  • అర్హత: ఏపీ పీజీఈసెట్ / గేట్ / జీప్యాట్-2026 లో అర్హత సాధించిన అభ్యర్థులు
  • కౌన్సెలింగ్ తేదీలు: 16-09-2026 నుంచి 25-09-2026 వరకు
  • అధికారిక వెబ్‌సైట్: https://cap.apcfss.in

అభ్యర్థులు కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, వెబ్ ఆప్షన్ల నమోదు కోసం కమీషనరేట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అధికారిక పోర్టల్ https://cap.apcfss.in ను సందర్శించి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిస్థాయి నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారం, మార్గదర్శకాలు ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

ఈ ఏడాది AP PGECET-2026కు దరఖాస్తు చేసుకున్న మొత్తం అభ్యర్థుల సంఖ్య 12102గా ఉంది. పరీక్షకు 9990 మంది హాజరయ్యారు. 9320 అభ్యర్థులు అర్హత సాధించారు. అర్హత సాధించిన అభ్యర్థుల శాతం 93.29 శాతంగా ఉంది. జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురం 94.17 ఉత్తీర్ణత శాతంతో టాప్‌లో ఉంది. విజయనగరం 92.88 శాతంతో చివరలో ఉంది.

ర్యాంక్ కార్డు డౌన్లోడ్ ఇలా :

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in సందర్శించండి.
  • హోమ్ పేజీలో 'APPGECET-2026 Results లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్ నమోదు చేయండి.
  • వ్యూ రిజల్ట్స్ మీద క్లిక్ చేయాలి. ఫలితాలు కనిపిస్తాయి.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More