AP PGECET 2026 : ఏపీ పీజీఈసెట్ నోటిఫికేషన్ విడుదల - దరఖాస్తులు ప్రారంభం, ఇదిగో లింక్
ఏపీ పీజీఈసెట్ 2026 ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 28, 29, 30 తేదీల్లో నిర్వహిస్తారు. https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.
పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ పీజీఈసెట్)-2026 నోటిఫికేషన్ వచ్చేసింది. ఇందులో భాగంగా 2026-27 విద్యా సంవత్సరానికి గానూఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మ్.డి(పీబీ) కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ ఏడాది ఆంధ్రా యూనివర్శిటీ ఈ ప్రవేశ పరీక్ష బాధ్యతలను చూస్తోంది.

ఏపీ పీజీఈసెట్ - 2026 ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు లేట్ ఫీజు లేకుండా మార్చి 6 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పరీక్షలను ఏప్రిల్ 28, 29, 30 తేదీల్లో నిర్వహిస్తారు. ఏప్రిల్ 15 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి వస్తాయి.
AP PGECET 2026 - ముఖ్యమైన తేదీలు
- ఎంట్రెన్స్ పరీక్ష - పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్, ఏపీ
- ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ - 6 మార్చి 2026.
- రూ. 1000 ఆలస్య రుసుంతో దరఖాస్తుకు చివరి తేదీ - 11-03-2026.
- రూ. 2000 ఆలస్య రుసుంతో దరఖాస్తుకు చివరి తేదీ - 16-03-2026.
- రూ. 4000 ఆలస్య రుసుంతో దరఖాస్తుకు చివరి తేదీ - 19-03-2026.
- రూ. 10,000 ఆలస్య రుసుంతో దరఖాస్తుకు చివరి తేదీ - 23-03-2026.
- అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ - 24-03-2026 నుంచి 25-03-2026.
- హాల్ టికెట్ డౌన్లోడ్ - 15-04-2026
- రార పరీక్ష తేదీలు - ఏప్రిల్ 28,29,30
- ప్రాథమిక కీలు విడుదల - 06-05-2026.
- ప్రాథమిక కీలపై అభ్యంతరాలు స్వీకరణ - 08-05-2026.
- ఫలితాల ప్రకటన - 14-05-2026.
- అధికారిక వెబ్ సైట్ - https://cets.apsche.ap.gov.in/
ఎంట్రెన్స్ టెస్టులో అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టి సీట్లను భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్ పూర్తి అయిన తర్వాత కూడా సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను ప్రకటిస్తారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

