AP POLYCET 2026 Counselling : ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ఈనెల 24 నుంచి రిజిస్ట్రేషన్లు

AP POLYCET 2026 Counselling : ఏపీ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్-2026 మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 24 నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థులు జూలై 4 లోగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తి చేయాలి.

Published on: Jun 20, 2026 11:10 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP POLYCET 2026 Counselling : ఆంధ్రప్రదేశ్‌లోని పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. ఏపీ పాలిసెట్-2026 (APPOLYCET-2026) లో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రవేశాలు కల్పించేందుకు తొలి విడత కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు పాలిసెట్ అడ్మిషన్ల కన్వీనర్ వి. పద్మారావు ప్రకటన జారీ చేశారు.

ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ 2026
ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ 2026

జూన్ 24 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ

ఏపీ పాలిసెట్-2026 పరీక్షలో అర్హత సాధించి, ఇంజినీరింగ్, నాన్-ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థుల కోసం వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ విధానాన్ని నిర్వహించనున్నారు. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ 2026 జూన్ 24వ తేదీ నుండి ప్రారంభమై, జూలై 4వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ నిర్ణీత గడువులోనే విద్యార్థులు తమకు సంబంధించిన అన్ని రకాల ఆన్‌లైన్ ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది.

  • మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూల్ఆన్‌లైన్ సర్టిఫికెట్ల పరిశీలన, ఫీజు చెల్లింపు (రిజిస్ట్రేషన్): 24.06.2026 నుండి 30.06.2026 వరకు.
  • హెల్ప్ లైన్ కేంద్రాలలో సర్టిఫికెట్ల పరిశీలన: ఆన్‌లైన్‌లో వెరిఫికేషన్ పూర్తికాని వారు లేదా డేటా మార్చాల్సిన వారు 25.06.2026 నుండి 01.07.2026 వరకు హెల్ప్ లైన్ సెంటర్లను (HLC) ఆశ్రయించవచ్చు.
  • వెబ్ ఆప్షన్ల నమోదు: 29.06.2026 నుండి 03.07.2026 వరకు.
  • వెబ్ ఆప్షన్ల సవరణ: 04.07.2026 న మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది.
  • సీట్ల కేటాయింపు (అలాట్‌మెంట్): 06.07.2026 న సాయంత్రం 6 గంటల తర్వాత ఫలితాలు విడుదల చేస్తారు.
  • కాలేజీల్లో రిపోర్టింగ్: సీట్లు పొందిన వారు 07.07.2026 నుండి 10.07.2026 లోపు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతో పాటు కాలేజీలో నేరుగా రిపోర్ట్ చేయాలి.
  • తరగతుల ప్రారంభం: 07.07.2026 నుండి క్లాస్ వర్క్ ప్రారంభమవుతుంది.

వెబ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ కోసం ఓసీ (OC), బీసీ (BC) అభ్యర్థులు రూ. 700 చెల్లించాలి. ఇక ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు రూ. 250 ప్రాసెసింగ్ ఫీజుగా ఆన్‌లైన్ (UPI, నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డ్) ద్వారా చెల్లించాలి.

ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్‌ - మీవద్ద ఉండాల్సిన పత్రాలు

  • ఏపీ పాలిసెట్-2026 హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్.
  • అభ్యర్థి ఆధార్ కార్డ్
  • ఎస్‌ఎస్‌సీ (10వ తరగతి) లేదా తత్సమాన మార్కుల మెమో
  • 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
  • కుల ధృవీకరణ పత్రం (BC/SC/ST అభ్యర్థులకు).
  • ఈడబ్ల్యూఎస్ (EWS) సర్టిఫికెట్ (OC అభ్యర్థులకు, 2026-27 విద్యా సంవత్సరానికి చెల్లుబాటయ్యేది)
  • తల్లిదండ్రుల ఆదాయ ధృవీకరణ పత్రం (01.01.2023 తర్వాత జారీ చేసినది మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అంగీకరిస్తారు))
  • బదిలీ సర్టిఫికెట్ (T.C), మైనారిటీ సర్టిఫికెట్ (వర్తించే వారికి)
  • ఇతర పత్రాలు

విద్యార్థులకు కౌన్సెలింగ్ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు ఎదురైనా, మొబైల్ నంబర్ మార్చాలన్నా సమీప హెల్ప్ లైన్ కేంద్రాన్ని సంప్రదించవచ్చు. లేదా కన్వీనర్ కార్యాలయానికి సంబంధించిన chepolycet@gmail.com ఈమెయిల్ ఐడీ ద్వారా లేదా ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల లోపు 7842075469, 7842085469, 7842095469 హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More