TG EAPCET 2026 Counselling : ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ అప్డేట్ - ఇవాళ్టి నుంచి స్లాట్ బుకింగ్ ప్రారంభం, ప్రాసెస్ ఇలా
TG EAPCET 2026 Counselling : రాష్ట్రంలో ఇంజినీరింగ్ ప్రవేశాలకు ఎప్‌సెట్ (EAPCET) కౌన్సెలింగ్ ప్రక్రియ శుక్రవారం (జూన్ 19) నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థులు స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల తేదీల పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి
TG EAPCET 2026 Counselling : ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్‌డేట్ అందించింది. ఎప్‌సెట్ (EAPCET) కౌన్సెలింగ్ ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది.

టీజీఈఏపీసెట్ ప్రవేశాల ప్రక్రియలో భాగంగా విద్యార్థులు ముందుగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి. ఈ నెల 19 నుంచి 28వ తేదీ వరకు అవకాశం కల్పించారు. స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు జూన్ 22 నుంచి 29 వరకు నిర్దేశించిన హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు వ్యక్తిగతంగా హాజరుకావాలి.
ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన విద్యార్థులు.. జూన్ 25 నుంచి జులై 1 వరకు తమకు ఆసక్తి ఉన్న కళాశాలలు, కోర్సులను ఎంచుకుంటూ వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఆప్షన్ల నమోదుపై విద్యార్థులకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో జులై 4వ తేదీ లోపు 'మాక్ కౌన్సెలింగ్' ద్వారా సీట్ల కేటాయింపును ప్రయోగాత్మకంగా చూపిస్తారు.
ఇందులో సీటు కేటాయింపు విధానం అర్థమయ్యాక…. అవసరమైతే జులై 5 నుంచి 7 వరకు విద్యార్థులు తమ వెబ్ ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చు. ఒకవేళ మార్పులు చేయని పక్షంలో, మాక్ కౌన్సెలింగ్ ఆప్షన్లనే తుది ఆప్షన్లుగా పరిగణిస్తారు. జులై 10వ తేదీ లోపు మొదటి విడత సీట్ల కేటాయింపును అధికారులు అధికారికంగా ప్రకటిస్తారు.
TG EAPCET కౌన్సెలింగ్ - ముఖ్యమైన తేదీలు ఇవే:
- జూన్ 19 - 28: ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్
- జూన్ 22 - 29: హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన
- జూన్ 25 - జులై 1: కోర్సులు, కళాశాలల వెబ్ ఆప్షన్ల నమోదు
- జులై 4వ తేదీ లోపు: మాక్ కౌన్సెలింగ్ విధానంలో సీట్ల కేటాయింపు పరిశీలన
- జులై 5 - 7: వెబ్ ఆప్షన్లలో మార్పులకు అవకాశం (లేదంటే పాత ఆప్షన్లే ఫైనల్)
- జులై 10 లోపు: మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
స్లాట్ బుకింగ్ ప్రాసెస్ ఇలా….
- విద్యార్థులు ముందుగా https://tgeapcet.nic.in/default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- ముందుగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
- ఆ తర్వాత స్లాట్ బుకింగ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, ఈఏపీసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- అన్ని వివరాలు సరిచూసుకున్న తర్వాత సబ్మిట్ చేస్తే మీ స్లాట్ బుక్ అవుతుంది.
ఇక రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జూలై 17 నుంచి షురూ అవుతుంది. జూలై 18న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉండగా… జూలై 18, 19 తేదీల్లో వెబ్ ఆప్షన్స్ ఎంచుకోవాలి. ఈ ప్రాసెస్ ను https://tgeapcet.nic.in వెబ్ సైట్ లోనే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

