TG EAPCET 2026 : ఎంసెట్‌లో మీ ర్యాంకుకు ఏ కాలేజీలో సీటు వస్తుంది? పాత కటాఫ్స్‌తో ఇలా అంచనా వేసుకోండి!
TS EAMCET 2026 Counselling : టీజీ ఈఏపీసెట్ తేదీలు దగ్గరపడుతున్నాయి. జూన్ 19వ తేదీ నుంచి ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మెుదలు అవుతుంది. ఇలాంటి సమయంలో మీ ర్యాంకును బట్టి మీకు ఎక్కడ సీటు వస్తుందో అంచనా చూడండి.
తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TG EAPCET (గతంలో TS EAMCET) ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు విద్యార్థులు, తల్లిదండ్రులలో మొదలైన అతిపెద్ద టెన్షన్ 'నాకు వచ్చిన ర్యాంకుకు ఏ కాలేజీలో సీటు వస్తుంది? ఏ బ్రాంచ్ దొరుకుతుంది?' అని విద్యార్థులు గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తారు.

వెబ్ ఆప్షన్లు ఇచ్చే సమయంలో ఎలాంటి తప్పులు చేయకుండా, మీ ర్యాంకుకు బెస్ట్ కాలేజీని ఎంచుకోవడానికి గత ఏడాది (2025) నాటి Last Rank Statements (ఆఖరి ర్యాంకుల వివరాలు) అద్భుతంగా యూజ్ అవుతాయి. ఫేజ్-1, ఫేజ్-2, ఫైనల్ ఫేజ్ కటాఫ్ ర్యాంకులను విశ్లేషించడం ద్వారా 2026లో మీకు రాబోయే సీటును ఎలా అంచనా వేయాలో ఇక్కడ చూద్దాం.
మూడు దశలు
కౌన్సెలింగ్ ప్రక్రియ మొత్తం మూడు ప్రధాన దశల్లో జరుగుతుంది. ప్రతి దశకు సంబంధించిన లాస్ట్ ర్యాంక్ ట్రెండ్స్ మారుతుంటాయి. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభంలో టాప్ కాలేజీల్లోని కంప్యూటర్ సైన్స్ (CSE), ఐటీ వంటి డిమాండ్ ఉన్న కోర్సులు తక్కువ ర్యాంకుల్లోనే ముగిసిపోతాయి. దీని ద్వారా టాప్-10 కాలేజీల పోటీని అంచనా వేయవచ్చు.
సెకండ్ ఫేజ్ మొదటి విడతలో సీట్లు వదులుకున్న వారు జేఈఈ (JEE Main/Advanced) వైపు వెళ్లిన వారి వల్ల చాలా సీట్లు ఖాళీ అవుతాయి. ఫేజ్-1 లో సీటు రాని వారికి, లేదా బెటర్ కాలేజ్ కోరుకునే వారికి సెకండ్ ఫేజ్ కటాఫ్ ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇస్తుంది. చాలా వరకు ఒక క్లారిటీ వస్తుంది.
ఫైనల్ ఫేజ్ ఇది అత్యంత కీలకం. కౌన్సెలింగ్ ముగిసే సమయానికి ఏ కాలేజీలో, ఏ కేటగిరీ (OC, BC, SC, ST, EWS) కింద ఏ ర్యాంకు వరకు సీటు కేటాయించారో ఇందులో స్పష్టంగా తెలుస్తుంది.
2026 సీట్ల అంచనా కోసం ఏం చేయాలి?
అధికారిక వెబ్‌సైట్ నుండి డేటా తీసుకోవాలి. TG EAPCET అధికారిక పోర్టల్ నుండి 2025 ఫస్ట్, సెకండ్, ఫైనల్ ఫేజ్ 'Last Rank Statements' పీడీఎఫ్ (PDF) లను డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ స్టేట్‌మెంట్లలో బాయ్స్, రీజియన్, రిజర్వేషన్ కేటగిరీల వారీగా విడివిడిగా ర్యాంకులు ఉంటాయి. మీ కేటగిరీకి సరిపోయే ఆఖరి ర్యాంకును మాత్రమే గమనించండి.
గత ఏడాది కటాఫ్ ర్యాంకులకు, ఈ ఏడాది కటాఫ్ ర్యాంకులకు స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు గత ఏడాది ఫైనల్ ఫేజ్‌లో ఒక కాలేజీలో సీఎస్ఈ సీటు 5,000 ర్యాంకుకు క్లోజ్ అయితే.. ఈ ఏడాది మీ ర్యాంకు 4,500 నుండి 5,500 లోపు ఉంటే అక్కడ సీటు వచ్చే అవకాశం ఉందని అర్థం. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కటాఫ్‍లో మార్పులు రావొచ్చు. ఈ అంచనా ప్రకారం కచ్చితంగా సీటు వస్తుందని విద్యార్థులు, తల్లిదండ్రులు భావించకూడదు. జస్ట్ కిందటి ఏడాదితో పోల్చుకుంటే విద్యార్థులకు ఒక అవగాహన వస్తుంది.
TGEAPCET 2025 Last Rank Statement First Phase
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


