తెలంగాణ గురుకులాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు.., విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు!
తెలంగాణలో గురుకులాల్లోని డిగ్రీ కాలేజీల్లో ఏఐ కోర్సులు ప్రవేశపెట్టాలని గురుకుల విద్యాలయ సంస్థ నిర్ణయించింది. విద్యార్థులకు పోటీ పరీక్షల కోచింగ్ కోసం 9 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను తీసుకురావాలని అనుకుంటోంది.
తెలంగాణలోని నిరుపేద, వెనకబడిన వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీ (TGSWREIS) కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మూడోవ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పలు విప్లవాత్మక సంస్కరణలకు ఆమోదం తెలిపారు.

ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానానికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, గురుకుల డిగ్రీ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ (UG) స్థాయి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) కోర్సులను ప్రవేశపెట్టాలని బోర్డు నిర్ణయించింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద విద్యార్థులు కూడా గ్లోబల్ టెక్నాలజీ రంగంలో అద్భుతమైన ఉపాధి అవకాశాలను దక్కించుకునే వీలుంటుంది. విద్యార్థుల భవిష్యత్తు ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని.. గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఏఐ కోర్సులను ప్రవేశపెట్టాలని గురుకుల విద్యాలయాల సంస్థ నిర్ణయం తీసుకున్నది.
గురుకులాల్లో విద్యాబోధన నాణ్యతను మరింత పెంచేందుకు అధ్యాపకులకు పెద్దపీట వేశారు. సొసైటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల ఫ్యాకల్టీకి యూజీసీ వేతన శ్రేణులను వర్తింపజేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అధ్యాపక సిబ్బందికి భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరడమే కాకుండా, వారిలో మరింత ఉత్సాహంతో బోధించే నైపుణ్యం పెరుగుతుంది.
ఐఐటీ, నిట్, నీట్, క్లాట్ వంటి జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీసెస్ వంటి పోటీ పరీక్షలకు ఉచితంగా అత్యుత్తమ కోచింగ్ ఇచ్చేందుకు వీలుగా రాష్ట్రంలో అదనంగా 9 కొత్త సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న సెంటర్లతోపాటు ఇవి కూడా అందుబాటులోకి వస్తే మరికొంత మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఉచిత కోచింగ్ లభిస్తుంది.
విద్యార్థుల డైట్ ఛార్జీల పెంపుదల, గురుకుల భవనాల ఆధునికీకరణ, డిజిటల్ క్లాస్‌రూమ్‌ల ఏర్పాటుపై కూడా మంత్రి సానుకూల నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ఈ విద్యా, సంక్షేమ సంస్కరణల ద్వారా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకులాలు దేశంలోనే సరికొత్త మైలురాయిని సృష్టించబోతున్నాయి. ఈ విప్లవాత్మక నిర్ణయాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
మరోవైపు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే ఎస్సీ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ఆర్థిక సాయం అందించనుంది ప్రభుత్వం, డిగ్రీ కాలేజీ నిర్వహణకు ప్రత్యేక విభాగం ఏర్పాటుతోపాటుగా న్యాక్ గుర్తింపు సాధించేందుకు స్పెషల్ కమిటీని నియమించనున్నారు. 133 గురుకులాలు అద్దె భవనాల్లో నడుస్తుండగా.. శాశ్వత భవనాలను నిర్మించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో చర్చించాలని తీర్మానం చేశారు. హైదరాబాద్‌లో ఫార్మసీ కాలేజీ ఏర్పాటుకు టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ బోర్డు ఆమోదం తెలిపింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


