గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలుకి దొరికిన ఫోన్.. రోహిణితో విద్య తెగదెంపులు.. బాలు, మీనా మాస్టర్ ప్లాన్
Gunde Ninda Gudi Gantalu June 5th Episode: 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ (జూన్ 5) అదిరిపోయే ట్విస్టులతో సాగింది. పోయిందనుకున్న ఫోన్ చేతికి రావడంతో బాలు ఫుల్ హ్యాపీ అవ్వడమే కాకుండా, దీని వెనుక ఉన్న రోహిణి గుట్టు రట్టు చేయడానికి వేసిన ప్లాన్ హైలైట్‌గా నిలిచింది.
Gunde Ninda Gudi Gantalu June 5th Episode: స్టార్ మా ఆడియన్స్‌ను టీవీలకు కట్టిపడేస్తున్న ఫ్యామిలీ డ్రామా 'గుండె నిండా గుడి గంటలు' రోజురోజుకూ ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. బాలు, మీనాల మధ్య ఉన్న ఎమోషన్స్, ఇంట్లో నడిచే పాలిటిక్స్ చుట్టూ తిరిగే ఈ కథనం.. శుక్రవారం (జూన్ 5) ఎపిసోడ్‌లో అంచనాలకు మించి సాగింది. తండ్రి సత్యం మనోజ్ చెంప పగలగొట్టడం, బాలు పోయిన ఫోన్ తిరిగి రావడం, దాని వెనుక రోహిణి ఉందన్న అనుమానంతో ఓ మాస్టర్ ప్లాన్ వేసే సీన్లతో సాగిపోయింది.

బాలుకి ఫోన్ ఇచ్చిన తాత
గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (జూన్ 5) ఎపిసోడ్ మొదట్లోనే ఎవరూ ఊహించని విధంగా అవ్వ, తాతలను వెతుక్కుంటూ వాళ్ల మనవడు హాస్పిటల్ కు వస్తాడు. సోషల్ మీడియాతో రక్తం కావాలని అడగడంతో అది చూసి వాళ్ల సొంత వాళ్లు మళ్లీ వస్తారు.
ఇంట్లో గొడవల వల్ల వాళ్లే ఇల్లు వదిలి వెళ్లారని ఆ వ్యక్తి అంటాడు. వాళ్లు తిరిగి వెళ్తున్న సమయంలో బాలుకి ఆ ముసలాయన ఓ ఫోన్ ఇస్తాడు. ఓ అమ్మాయి తమ దగ్గర ఈ ఫోన్ పారేసుకుందని, ఆమెను కనిపెట్టి తిరిగి ఇవ్వాలని చెబుతాడు.
మనోజ్ చెంప పగలగొట్టిన సత్యం
మరోవైపు ఇంట్లో మనోజ్ చెంప పగలగొడతాడు సత్యం. బాలు, మీనా ఇంటికి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ లో జరిగిన విషయం చెబుతారు. తనను ఏమీ అనలేదని, మనోజ్ నే అందరూ వాయించారని చెబుతున్న సమయంలోనే అతడు ఇంట్లోకి వస్తాడు. ఎందుకు కొట్టారని అడిగితే.. మనోజ్ పోలీసులతో ఏమన్నాడో సత్యం చెవిలో చెబుతాడు బాలు.
దీంతో సత్యం ఆవేశం కట్టలు తెంచుకొని అతడు కూడా మనోజ్ ను కొడతాడు. అసలు ఏమన్నాడో చెప్పండని ప్రభావతి అడుగుతున్నా ఎవరూ చెప్పరు. అది నువ్వు వినకపోవడమే మంచిదని సత్యం అంటాడు. నువ్వు వింటే నువ్వూ చెప్పుతో వాడిని కొడతావని బాలు అని వెళ్లిపోతాడు.
బాలు చేతికి ఫోన్.. రోహిణికి మైండ్ గేమ్ స్టార్ట్!
ఇంటికి వచ్చిన తర్వాత తాత ఇచ్చిన ఫోన్ చూస్తే అది తనదే అని తేలుతుంది. అదే విషయం వెళ్లి సంతోషంగా సత్యానికి బాలు, మీనా చెబుతుంటే రోహిణి వింటుంది. ఈ ఫోన్ ను చెరువులో పడేయాలని విద్యకు చెప్పాను కదా.. మళ్లీ ఎలా దొరికింది.. అంటే అది అబద్ధం చెప్పిందా అని రోహిణిలో కంగారు మొదలవుతుంది.
చాలా రోజుల నుంచి కనిపించకుండా పోయి టెన్షన్ పెట్టిన తన ఫోన్ హఠాత్తుగా చేతికి రావడంతో బాలు సంతోషం అంతా ఇంతా కాదు. తన ప్రాణమైన ఫోన్‌ను చూసుకుని బాలు తెగ మురిసిపోయాడు. అయితే కేవలం ఫోన్ దొరికింది కదా అని సైలెంట్ కాలేదు. అసలు ఈ ఫోన్ ఇన్నాళ్లూ ఎక్కడికి పోయింది? ఆ తాత చెప్పిన ఆ అమ్మాయి ఎవరు అన్న ఆలోచనలో పడతాడు.
ఈ మొత్తం వ్యవహారంలో రోహిణి మీదే బాలుకు డౌట్ వచ్చి ఇదే విషయం మీనాకు చెబుతాడు. రోహిణి, విద్య ఫొటోలు ఆ తాతకు చూపిస్తే వాళ్లో కాదో చెప్పేస్తాడు కదా అని బాలు అంటాడు. రోహిణి ఫొటో ఎలాగోలా దొరుకుతుంది. విద్య ఇంటికి వెళ్లి ఎలాగైనా ఆమె ఫొటో తీసుకో అని మీనాకు చెబుతాడు.
విద్యతో రోహిణి తెగదెంపులు
విద్య ఇంటికి వెళ్లి ఆమెను రోహిణి నిలదీస్తుంది. బాలు ఫోన్ చెరువులో పారేయలేదా అని అడుగుతుంది. ఆమెను మరోసారి డామినేట్ చేయడానికి రోహిణి ట్రై చేయగా.. ఈసారి విద్య కూడా అస్సలు తగ్గలేదు.
అసలు నువ్వు నన్ను స్నేహితురాలిగా కాకుండా నీ అవసరానికి తగినట్లు వాడుకుంటున్నావు.. నీ పనిమనిషి కాదు అని విద్య అంటుంది. ఆమె చేసిన మోసాలు, అబద్ధాల గురించి కూడా మాట్లాడుతుంది. దీంతో రోహిణి షాక్ తింటుంది. ఆమె ఎదురు తిరగడంతో ఏం చేయాలో తోచక విద్యతో తెగదెంపులు చేసుకొని వెళ్లిపోతుంది.
విద్య ఇంటికి బాలు శిష్యుడు
ఇటు విద్యను కొన్నాళ్లుగా ఫాలో అవుతున్న బాలు శిష్యుడు నేరుగా ఆమె ఇంటికే వస్తాడు. గతంలో పలుసార్లు అపార్థం చేసుకొని అతన్ని చెంపదెబ్బ కొట్టిన విద్య.. ఈసారి తన తప్పు తెలుసుకొని అతన్ని ఇంట్లోకి పిలుస్తుంది. ఈ సందర్భంలోనే తన మనసులో విద్యపై ఉన్న ఇష్టం గురించి చెబుతాడు. అతడు వెళ్లిపోయిన తర్వాత విద్య కూడా ఆలోచనలో పడుతుంది. అతనిపై ఆమెలోనూ ఇష్టం కలుగుతుంది.
విద్య ఇంటికి మీనా
అతడు వెళ్లిపోయిన కాసేపటికే విద్య ఇంటికి మీనా వస్తుంది. అంతకుముందు తన ఇంట్లో జరిగిన విషయాన్ని మీనాకు విద్య చెబుతుంది. వాడు ఇంటికి రావడం, ప్రపోజ్ చేసిన విషయాన్ని విద్య మీనాకు పూసగుచ్చినట్లు చెప్పింది. అతను నిజంగానే మంచోడా లేక టైంపాస్ కోసం లవ్ డ్రామా ఆడుతున్నాడా అని విద్య అయోమయానికి గురవుతుంది.
దానికి మీనా స్పందిస్తూ.. వాడి క్యారెక్టర్ ఎలాంటిదో టెస్ట్ చేయడానికి ఒక సూపర్ ఐడియా ఇస్తుంది. అంతేకాదు నువ్వు కూడా వాడి గురించి చెబుతున్నప్పుడు సిగ్గు పడుతున్నావు.. నీ బుగ్గలు ఎరుపెక్కుతున్నాయని చెబుతూ మీనా ఇదే అదునుగా విద్య ఫొటోలు తీస్తుంది.
ఆ ఫొటోను బాలుకి ఇవ్వగానే అతడు ఆ తాత మనవడికి వాటిని పంపిస్తాడు. ఆ ఫొటోలు తాతకు చూపించి వాళ్లు తెలుసా అని అడగమని చెబుతాడు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసినా.. ఈ ప్లాన్ ద్వారా రోహిణి బండారాన్ని బాలు బయటపెట్టబోతున్నాడా అన్న ఆసక్తి తర్వాత ఎపిసోడ్ పై కలుగుతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


