గుండె నిండా గుడి గంటలు జూన్ 4 ఎపిసోడ్: పోలీస్ స్టేషన్‌లో మనోజ్ ఓవరాక్షన్.. ఇరగదీసిన కానిస్టేబుల్స్, బాలుకి క్లీన్‌చిట్
Gunde Ninda Gudi Gantalu June 4th Episode: 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ (జూన్ 4) ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్‌తో సాగింది. రోహిణి అసలు బండారం బయటపడేలా బాలుకు డౌట్ రావడం, పోలీస్ స్టేషన్‌లో మనోజ్ చేసిన ఓవరాక్షన్‌కు కానిస్టేబుల్స్ చెంపలు వాయించడం.. ఈరోజు ఎపిసోడ్‌లో మెయిన్ హైలైట్స్.
Gunde Ninda Gudi Gantalu June 4th Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఫ్యామిలీ డ్రామా 'గుండె నిండా గుడి గంటలు' రోజురోజుకూ సరికొత్త మలుపులు తిరుగుతూ టాప్ రేటింగ్‌తో దూసుకుపోతోంది. నిన్నటి ఎపిసోడ్ ఉత్కంఠకు కొనసాగింపుగా.. గురువారం (జూన్ 4) కథనంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా బాలు, మీనాలకు ఎదురైన కష్టాలు, మరోవైపు రోహిణి అబద్ధాలు, మనోజ్ ఓవరాక్షన్ చుట్టూ నేటి ఎపిసోడ్ నడిచింది.

రోహిణి తండ్రి ఫోటో.. బాలుకు గట్టి డౌట్
గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్ మొదట్లోనే రోహిణి తండ్రి ఫోటో బాలు కంట పడుతుంది. ఆ ఫోటోను చూడగానే బాలుకు ఎక్కడో చిన్న అనుమానం మొదలవుతుంది. రోహిణి చెప్తున్నట్లుగా ఆమె తండ్రి కోట్లు సంపాదించిన వ్యక్తిలా ఆ ముఖం కనిపించకపోవడంతో బాలు తనదైన స్టైల్లో సెటైర్లు వేశాడు.
"ఇది కోట్లు సంపాదించిన ముఖమేనా? అసలు మలేషియా ముఖమేనా?" అంటూ బాలు డైరెక్ట్‌గా నిలదీయడంతో రోహిణికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. తన అబద్ధాల కోట ఎక్కడ కూలిపోతుందోనని లోలోపల వణికిపోయింది. ఇదే టైమ్‌లో ఆస్పత్రిలో ఉన్న బామ్మ ప్రాణాలను కాపాడుకోవడం కోసం బాలు రక్తం కావాలంటూ ఆరాటపడ్డాడు. శృతి చెప్పిన సోషల్ మీడియా ఐడియాతో ఆ దిశగా ప్రయత్నిస్తాడు.
ప్రభావతికి మీనా క్లాస్.. బాలు కోసం ఆరాటం
మరోవైపు ట్రాఫిక్ పోలీసు కాలర్ పట్టుకున్నాడంటూ బాలును పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లడానికి వస్తారు. సత్యం ఆందోళన పడటంతో అసలు ఏం జరిగిందో బాలు, మీనా వివరిస్తారు. అతడు చేసినదాంట్లో తప్పేమీ లేదని, వదిలేయాలని సత్యం కోరతాడు. అటు శృతి కూడా అండగా నిలబడుతుంది. ఒకవేళ కేసు అయితే తాను చూసుకుంటానని అంటుంది. మీనా కూడా బాలు వెంట వెళ్లడానికి రెడీ అవుతుంది.
అప్పుడే కొడుకును పోలీసులు తీసుకెళ్తున్నారనే బాధ కూడా లేకుండా ప్రభావతి వ్యవహరించిన తీరు మీనాకు విపరీతమైన కోపం తెప్పించింది. బాలు అరెస్ట్ గురించి కాకుండా, ఇంట్లో వంట గురించి ప్రభావతి అడగడంతో మీనాకు చిర్రెత్తుకొచ్చింది.
"నీకు అసలు అమ్మతనం లేదా? కన్నతల్లివేనా నువ్వు? కడుపుకు అన్నమే కదా తింటున్నావు.. సవతి తల్లి కూడా ఇలా చేయదు.. నువ్వు అసలు నిజంగా ఆయనను కన్న తల్లివేనా" అంటూ ప్రభావతికి గట్టిగా క్లాస్ పీకింది మీనా. అటు శృతి కూడా నాలుగు మాటలు అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. చిన్న వాళ్లతోనూ మాటలు పడుతున్నావ్.. ఏం బతుకే నీది అంటూ సత్యం కూడా ప్రభావతికి క్లాస్ పీకుతాడు.
పోలీస్ స్టేషన్ లో బాలుకి వార్నింగ్
ఆ తర్వాత బాలుని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తారు. అక్కడికి ఆ ట్రాఫిక్ పోలీసు వస్తాడు. ఇవాళ నువ్వు ఎలా తప్పించుకుంటావో చూస్తాను.. కనీసం ఆరు నెలలు జైల్లో వేస్తానని వార్నింగ్ ఇస్తాడు. నేను నిజాయితీగానే ఉంటాను.. నీ స్టేషన్ కు వచ్చి నీ ముందే నిలబడ్డాను.. ఏం చేసుకుంటావో చేసుకో అని బాలు కూడా గట్టిగానే సమాధానం ఇస్తాడు. ఎస్సై లేకపోవడంతో మళ్లీ వస్తానని ట్రాఫిక్ పోలీస్ వెళ్లిపోతాడు.
బూతు మాట.. మనోజ్ చెంపలు వాయించిన కానిస్టేబుల్స్
ఇదే టైమ్‌లో తాను వేసిన కేసు గురించి అడగడానికి మనోజ్, రోహిణి ఇద్దరూ కలిసి అదే పోలీస్ స్టేషన్‌కు వస్తారు. అక్కడ బాలు, మీనాలను చూసి మనోజ్ చులకనగా మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు. అందరి ముందు వాళ్ల పరువు తీయాలని ట్రై చేశాడు. అయితే ఎస్సై లేని టైమ్‌లో అక్కడున్న ఒక కానిస్టేబుల్ తో మనోజ్ మాట్లాడతాడు. తన కేసు త్వరగా పరిష్కరించాలంటే తాను చెప్పినట్లు చేయాలని ఆ కానిస్టేబుల్ చెవిలో మనోజ్ ఒక దారుణమైన బూతు మాట చెబుతాడు.
మనోజ్ అన్న మాటకు షాకైన కానిస్టేబుల్స్ విపరీతమైన కోపంతో ఊగిపోయారు. ఏమాత్రం లేట్ చేయకుండా మనోజ్ చెంపలు పగిలిపోయేలా వరుసగా వాయించేశారు. స్టేషన్ లో అందరి ముందు మనోజ్‌కు దారుణ పరాభవం ఎదురైంది. అసలు మనోజ్ పోలీసులతో అంత మాట ఏమన్నాడో తెలిసి, పక్కనే ఉన్న భార్య రోహిణి కూడా అసహ్యించుకుంటూ మనోజ్ చెంప చెల్లుమనిపించింది.
ఎస్సై ఎంట్రీ.. బాలుకు ఊరట
ఆ తర్వాత స్టేషన్‌కు వచ్చిన ఎస్సైకి బాలు, మీనా అసలు ఏం జరిగిందో క్లియర్‌గా వివరించారు. ట్రాఫిక్ పోలీసు కాలర్ పట్టుకున్న మాట నిజమే కానీ.. అంతకుముందు అతడు ముసలావిడ తల పగిలేలా చేసిన పని గురించి కూడా చెబుతారు. అది విన్న ఎస్సై ట్రాఫిక్ పోలీసుకు క్లాస్ పీకుతాడు. వాళ్లు ఫిర్యాదు చేస్తే నిన్న సస్పెండ్ చేస్తారని అంటాడు. తప్పు తమ సిబ్బంది వైపే ఉందని గ్రహించిన ఎస్సై.. పెద్ద మనసుతో కేసును క్లోజ్ చేసి బాలును వదిలేస్తున్నట్లు చెబుతాడు. ఓ క్షమాపణ లేఖ రాసివ్వమని చెప్పి పంపిస్తాడు. దీంతో మీనా, బాలు ఊపిరి పీల్చుకున్నారు. బయటకు వచ్చేటప్పుడు తనను ఇరికించిన ఆ ట్రాఫిక్ పోలీసు.. మరోసారి బాలుకి వార్నింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. కానీ బాలు కూడా ఏమాత్రం తగ్గకుండా చూసుకుందామంటూ అతనిపై మండిపడతాడు.
ఈ ఎపిసోడ్ ఎందుకు స్పెషల్?
కార్తీక దీపం, బ్రహ్మముడి సీరియల్స్ తర్వాత స్టార్ మాలో ఆ రేంజ్ ఆడియన్స్ కనెక్టివిటీ ఉన్న సీరియల్ ఇదే. రెగ్యులర్ సీరియల్స్‌లాగా విలన్స్ చేసే పనులను వారాల తరబడి సాగదీయకుండా.. ఫ్యామిలీ ఎమోషన్స్ కు తోడు తప్పు చేసిన వాళ్లకి అప్పటికప్పుడే బుద్ధి చెప్పడం ఈ సీరియల్ సక్సెస్ సీక్రెట్. ఈరోజు ఎపిసోడ్‌లో మనోజ్ ఓవరాక్షన్‌కు వెంటనే పోలీస్ స్టేషన్‌లో దెబ్బలు పడటం ఆడియన్స్‌కు మంచి కిక్ ఇచ్చింది. అలాగే రోహిణి ట్రాక్‌ను మరీ లాగ్ చేయకుండా బాలుకు హింట్స్ ఇవ్వడం డైరెక్టర్ స్క్రీన్‌ప్లే బ్రిలియన్స్‌కు అద్దం పడుతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


