గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్:బాలు మలేషియా స్కెచ్-బెడిసికొట్టిన రోహిణి ఎమోషనల్ బ్లాక్ మెయిల్-ఒక్కటైన బాలు ప్రభావతి

Gunde Ninda Gudi Gantalu Serial June 1st Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ 1వ ఎపిసోడ్‌‌లో రోహిణి గుట్టు రట్టు చేసేందుకు మలేషియా స్కెచ్ వేస్తాడు బాలు. మలేషియా వెళ్లేందుకు బాలుతో కలిసిపోయిన ప్రభావతి ప్రేమ వర్షం కురిపిస్తుంది. మనోజ్‌ను రోహిణి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది.

Published on: Jun 1, 2026, 07:42:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో బాలు వచ్చి అందరికి పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసేందుకు ఫామ్స్ తీసుకొస్తాడు. ఫ్యామిలీతో అందరం కలిసి మలేషియా ట్రిప్ ప్లాన్ చేశాను అని బాలు చెబుతాడు. రోహిణి షాక్ అవుతుంది. ప్రభావతి తెగ సంతోషిస్తుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ 1 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ 1 ఎపిసోడ్

బాలుపై ప్రభావతి ప్రేమ వర్షం

మీరు వయసులో ఉన్నారు. మీరు వెళ్లండి. అనవసరంగా ఎందుకు వృథా ఖర్చు అని సత్యం అంటాడు. వయసులో ఉన్నవాళ్లు ఎప్పుడైన వెళ్తారు. కానీ, తల్లిదండ్రులు ఎప్పుడూ వెళ్లలేరు. ఆ బాధ్యతను పిల్లలే తీసుకోవాలి అని బాలు అంటాడు. చూసి నేర్చుకోరా దున్నపోతా.. మీ మామగారు ఉండే మలేషియాకు మిమ్మల్ని తీసుకెళ్లాలని నీకు, నీ ఆవిడకు ఎప్పుడైనా అనిపించిందా. బాలుగాడికి అనిపించింది. వాడిని చూసి నేర్చుకోరా అని బాలుకు సపోర్టింగ్‌గా మాట్లాడుతుంది ప్రభావతి.

దాంతో అంతా ఒక్కసారిగా అవాక్కవుతారు. రేయ్ బాలు ఎప్పుడురా మలేషియా వెళ్లడం అని ప్రభావతి అంటే.. ముందు సంతకం పెట్టు తెలిసినవాళ్లు పాస్‌పోర్ట్ చేసి ఇస్తారు అని బాలు అంటాడు. దాంతో బాలుపై తెగ ప్రేమ వర్షం కురిపించేస్తుంది ప్రభావతి. రా నాన్న రా కూర్చో అని చాలా ప్రేమగా మాట్లాడుతుంది ప్రభావతి.

ఖర్చు చాలా ఎక్కువ అవుతుందేమో అని సత్యం అంటే.. లేదు నాన్న కేవలం రాను పోను ఖర్చులు మాత్రమే పెట్టుకోవాలి. మలేషియాలో ఉండటం మాత్రం ఫ్రీ. ఎందుకో చెప్పుకోండి అని బాలు అంటాడు. నేను చెబుతాను.. చెబుతాను అన్న ప్రభావతి.. ఎందుకంటే అక్కడ రోహిణి వాళ్ల నాన్న ఉంటారు అని నవ్వేస్తుంది. నువ్వు నాకంటే జీనియస్ అమ్మా అని తల్లిని మెచ్చుకుంటాడు బాలు.

భయంతో రోహిణి

రోహిణి వాళ్ల నాన్న జైలులో ఉన్నా వాళ్లకు ఇల్లు, బంగ్లాలు, ఫామ్ హౌజ్‌లు, తిరిగేందుకు చాలా కార్లు ఉన్నాయని రవి, మీనా అడిగిన దానికి ప్రభావతి చెబుతుంది. అరేయ్ బాలు నన్ను జైలుకు పంపించాలి సరేనా అని ప్రభావతి అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. ఛీ.. ఛీ అది కాదండి మనం జైలుకు వెళ్లి రోహిణి నాన్నతో కష్టసుఖాలు మాట్లాడుకోవాలి అని ప్రభావతి అంటుంది. ష్ట సుఖాలా ఆస్తి పాస్తుల అని సత్యం అంటాడు.

అక్కడికి దాకా వెళ్లాకా అవి మాట్లాడమా. అల్లుడు, కూతురు కష్టాల్లో ఉన్నారంటే ఖాళీ చెక్కు మీద సంతకం పెట్టరు అని ప్రభావతి అంటుంది. అమ్మో ఈవిడ అంచనాలు మాములుగా లేవుగా అని రోహిణి భయపడుతుంది. అసలు రోహిణికి పుట్టింటికి వెళ్తున్నామనే ఆనందమే లేదని మీనా అంటే.. అది సంతోషంలో నోరు రావడం లేదని బాలు అంటాడు. ఇప్పుడెందుకు అని మనోజ్ అంటే.. ప్రభావతి తిడుతుంది.

ఎవరు ఏమన్నా మలేషియా వెళ్లాల్సిందే. నా ఫుల్ సపోర్ట్ నీకే అని ప్రభావతి అంటుంది. సంతకం పెడుతుంది. అలా ప్రభావతి వీక్‌నెస్‌ను అడ్డు పెట్టుకుని రోహిణిని గట్టిగా ఇరికించేందుకు బాలు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. మీ తమ్ముడికి ఇది అవసరమా అని రోహిణి అంటే.. మీ పుట్టింటికి రమ్మనే మొహమేనా నీది. వాడు ప్లాన్ చేస్తున్నాడు. ఖర్చు మనది కానప్పుడు వెళ్తే ఏంటని మనోజ్ అంటాడు.

ఎంతమంది నాతో ఆడుకుంటార్రా

ఓరి నా మొగుడోయ్.. ఎన్ని రకాలుగా, ఎంతమంది, ఎన్నిసార్లు నా జీవితంతో ఆడుకుంటార్రా అని ఇరిటేట్ అవుతుంది రోహిణి. ఎలాగైనా మలేషియా వెళ్లకుండా ఆపాలి అని రోహిణి అంటుంది. మరోసారి మలేషియా టూర్ గురించి బాలును నిలదీస్తుంది. దాంతో కళ్లద్దాలు ఇచ్చి ఇన్వెస్టిగేషన్ చేసినట్లు ఆలోచించు అని బాలు చెబుతాడు. పాస్‌పోర్ట్ దేనికైనా పనికి వస్తుంది. కానీ, మలేషియా అనేది మాత్రం నాటకం అని బాలు అంటాడు.

మలేషియా అనగానే పార్లరమ్మా ఏదోటి ప్లాన్ చేసి అందరిని ఆపుతుంది, అప్పుడు తప్పు చేసి దొరుకుతుంది. దాంతో రోహిణి ఏదో దాస్తుందని తెలుస్తుంది. లేదు తను కూడా మలేషియా వస్తానంటే మనం అనుమానించింది తప్పు అనుకోవాలి అని బాలు అంటుంది. లేదు. అక్కడో మనం ఇంకో తప్పు చేస్తున్నాం. ముందు వస్తానని చెప్పి చివరి నిమిషంలో రోహిణి ఏదైనా ప్లాన్ చేయవచ్చు. కొత్త డ్రామా చేయొచ్చు అని మీనా అంటుంది.

మంచి పాయింట్ పట్టావ్ మీనా అని బాలు అంటాడు. మరోవైపు ప్రభావతి ఏవో లిస్ట్ రాస్తుంది. బాలును నాన్న బాలు అని పిలుస్తుంది తల్లి. దాంతో బాలు షాక్ అయిపోతాడు. మా ఆయన ప్రాణాలతో ఎందుకు చెలగాటం ఆడుతారు అని మీనా అంటుంది. ప్రభావతి లిస్ట్ ఇచ్చి తీసుకు రమ్మంటుంది. ఇప్పుడే తీసుకొస్తే మనం మలేషియా వెళ్లిపోయేసరికి కుళ్లిపోతాయని, వెళ్లేటప్పుడు తీసుకెళ్దాం అని బాలు అంటాడు.

30 లక్షల ఫిటింగ్

అదంతా రోహిణి వింటుంది. బాలును కూర్చోబెట్టి ప్రేమగా మాట్లాడుతుంది ప్రభావతి. అక్కడ చూసేటివి ఏమున్నాయని ప్రభావతి అడిగితే.. పార్లరమ్మే చెప్పాలని బాలు అంటాడు. ఇరికించడంలో బాలును మించినోళ్లు లేరని రోహిణి అనుకుంటుంది. చూడాల్సిన ప్రదేశాలను రవి చెబుతాడు. చూడాల్సినవి, వాతావరణం, కరెన్సీ అన్ని మాట్లాడుకుంటారు. రవి, శ్రుతి వర్క్ ఉంది, రామని చెబుతారు.

రోహిణి 30 లక్షల అప్పు ఉందని, అది తీరేదాక ఎక్కడికి రానని అంటుంది. మనోజ్ కూడా డీలర్స్‌తో మీటింగ్ అంటాడు. ఎవరు వచ్చిన రాకున్నా బాలు నేను వెళ్తామని ప్రభావతి అంటుంది. అక్కడ మొన్న ఇంటికి వచ్చిన మలేషియా రవీంద్ర అంకుల్ ఉన్నారని, ఆయన చూసుకుంటారని, ఎవరొచ్చిన రాకున్నా నేను, అమ్మా, మీనా వెళ్తామని బాలు చెబుతాడు.

రోహిణి రానని చెప్పడం గురించి మీనా అంటుంది. ఇవాళ రేపే మనల్ని కూడా వెళ్లకుండా ఆపుతారు అని బాలు అంటాడు. మరోవైపు రోహిణి తెగ ఏడుస్తుంది. మనోజ్ చూసి అడుగుతాడు. బాలు వాళ్లు మలేషియా ఎందుకు వెళ్లాలి, మా నాన్ను ఇప్పుడే ఎందుకు కలవాలి అని అంటుంది రోహిణి. ఇంతకాలం రాకుండా ఇప్పుడే ఎందుకు వచ్చారని ఆయన ఆలోచిస్తారు. ఆ ప్రశ్నలన్నీ నా మీదకే వస్తాయని రోహిణి అంటుంది.

అప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి. నాకోసం నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. నాకు సపోర్ట్ చేసే వ్యక్తి లేడా అని రోహిణి అంటే.. నేనున్నాగా అని మనోజ్ అంటాడు. అది మాటల్లోనే చేతల్లో లేదు. మలేషియాలో ఖర్చు అంతా నాదే అంటున్నారు. ఆస్తి కోర్టులో ఉంది. నా చేతిలో ఒక్క రూపాయి లేదని రోహిణి ఏడుస్తుంది. నీకు ఏదైనా అవసరమైతే మీవాళ్లు హెల్ప్ చేస్తారుగా అని మనోజ్ అంటాడు.

రోహిణి ఎమోషనల్ బ్లాక్ మెయిల్

అందరు డబ్బు కోసమే మాట్లాడతరేంటీ. నేను డబ్బు కోసమే ఉన్నానా అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది రోహిణి. సరే ఇప్పుడు బాలు వాళ్లు మలేషియా వెళ్లకూడదు అంతేగా. నేను చూసుకుంటాను అని మనోజ్ హామీ ఇస్తాడు. కామాక్షి ఒక సలహా ఇచ్చిందని, మలేషియాలో చీరలకు బదులు డ్రెస్సులు వేసుకుంటానని ప్రభావతి అంటే.. సత్యం షాక్ అయిపోతాడు. నీలా చీర కట్టుకుని, సాంప్రదాయబద్ధంగా ఎవరు వెళ్తారని బాలు అంటాడు.

దాంతో ప్రభావతి మురిసిపోతుంది. తొలిసారిగా అలా తల్లికొడుకులు బాలు, ప్రభావతి ప్రేమగా మాట్లాడుకోవడం చూసి సత్యం జీర్ణం కాలేదంటాడు. వాళ్లకు కుళ్లు అని బాలు అంటాడు. ఇంతలో మనోజ్ వచ్చి మలేషియా వెళ్లడం అవసరం లేదు అని తెగేసి చెబుతాడు. దాంతో మలేషియా వెళ్లడం ఆపేందుకు రోహిణి ఏదో ఎత్తుగడ వేస్తుందని ఆయన చెప్పారని మీనా అంటుంది. ఇది నీ మాట రోహిణి మాట అని బాలు అంటాడు.

ఇద్దరం ఒక్కటే. మలేషియా వెళ్లడం వద్దని, జైలులో వాళ్ల నాన్న ఉన్నప్పుడే వెళ్లడం కరెక్ట్ కాదు. రోహిణికి వాళ్ల నాన్నకు అవమానంగా ఉంటుందని మనోజ్ అంటాడు. ఇలాంటి సమయంలో వెళ్తే ఆయనకు తోడుగా ఉన్నట్లు ఉంటుంది. కష్టాలు పంచుకున్నట్లు ఉంటుందని మీనా అంటుంది. మీనా కరెక్టుగా చెబుతుంది కదా అని ప్రభావతి అంటుంది. అంతా షాక్ అవుతారు.

బెడిసికొట్టిన రోహిణి ప్లాన్

మనల్నీ ఏ వెధవ ఆపలేరు, ఏ ఎధవ పెళ్లాం ఆపలేదు అని ప్రభావతి అంటుంది. సరే అమ్మా నువ్వు కాస్తా రెస్ట్ తీసుకో. మలేషియా వెళ్లేటప్పుడు గ్లామర్‌గా కనిపించాలిగా అని బాలు అంటే.. ప్రభావతి మురిసిపోతుంది. అలా రోహిణి వేసిన ప్లాన్ కూడా బెడిసి కొడుతుంది. మనోజ్ మాట్లాడింది, రోహిణి చెప్పిన దాని గురించి బాలు, మీనా మాట్లాడుకుంటారు.

నిజాయితీగా ఉండేవాళ్లు అంతలా భయపడరు అని బాలు అంటాడు. మలేషియా ప్లాన్ అబద్ధం అని అందరికి తెలిసిపోతే అని మీనా అంటే.. ఎవరికి తెలియదు. ఇప్పటికీ అదే మన బలం. రోహిణి ఏదో తప్పు చేసి దొరుకుతుందని బాలు అంటాడు. మరోవైపు శ్రుతి లేట్‌గా వస్తుంది. ఓ సీరియల్‌లో భర్తను భార్య విడాకులు అడుగడం గురించి చెప్పి అది కరెక్ట్ అంటుంది శ్రుతి.

భార్యాభర్తలు టైమ్ స్పెండ్ చేయకుంటే దూరం అవుతారని, మనం కూడా సరిగా టైమ్ స్పెండ్ చేయట్లేదని, మనకున్న వర్క్‌ను బట్టి మొత్తంగా రెండు గంటలు మాత్రమే కలిసి ఉంటున్నామని శ్రుతి అంటుంది. చివరిగా మనం విశ్రాంతి తీసుకునేది మనిద్దరం ఉండే చోటు కావాలని , దూరం పెరగడం వల్లే ప్రేమ తగ్గుతుందని శ్రుతి అంటుంది.

శ్రుతి పంచాయితీ

ఎవరెవరు ఎంతలా టైమ్ గడుపుతున్నారో అడుగుదామని శ్రుతి అంటుంది. బాలుతో అందరిని పిలిపిస్తుంది. రవిపై కోపంగా ఉందని తిడుతుంది శ్రుతి. ఏంటీ రవి ఏం చేశావ్. శ్రుతి ఎందుకు పంచాయితీ పెట్టిందని మీనా అడుగుతుంది. రాత్రి పడుకునే టైమ్ కాకుండా మీరిద్దరి ఎంతసేపు కలిసి ఉంటారని శ్రుతి అడిగితే.. మొత్తం 9 గంటలని మనోజ్, రోహిణి చెబుతారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More