Brahmamudi May 2 Episode: బ్రహ్మముడి- లవర్‌కి రాజ్ ట్రీట్‌మెంట్- రాజు దుగ్గిరాల ఇంటి రక్తమే, నిజం బయపెట్టిన శ్రుతి!
Brahmamudi Serial May 2nd Episode: బ్రహ్మముడి సీరియల్ మే 2వ ఎపిసోడ్ అదిరిపోయింది. తన ప్రాణం పోయినట్లే అని చెప్పిన అమ్మాయికి రాజ్ సీక్రెట్‌గా ట్రీట్‌మెంట్ చేయిస్తుంటాడు. హాస్పిటల్‌లో రాజ్‌ను చూసిన శ్రుతి ఫాలో అయి ఇంటికెళ్లి చలపతి, లక్ష్మీలను నిలదీస్తుంది. రాజు దుగ్గిరాల ఇంటి రక్తమని శ్రుతి అంటుంది.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో దేవుడిని మొక్కి ఇందు వెనక్కి తిరిగేసరికి రేఖ కనిపిస్తుంది. దాంతో ఇందు షాక్ అవుతుంది. భూషణ్‌కి కాల్ చేసి ఇందు దొరికిందని చెబుతుంది రేఖ. దాంతో లక్కీకి భూషణ్ డబ్బు ఇస్తాడు. 20 లక్షలు తీసుకుని లక్కీ వెళ్తాడు. ఇందు చేయి పట్టుకుని రేఖ తీసుకెళ్లిపోతుంది. ఇందు వెళ్లడం చూసి రాజ్ బాధగా ఫీల్ అవుతాడు.

ఎమోషనల్‌గా రాజ్, ఇందు
రాజ్ అలా చూడటాన్ని లక్కీ చూస్తాడు. రాజ్ కోసం ఇందు వెనక్కి తిరుగుతుంది. అక్కడ రాజ్‌ను చూస్తుంది ఇందు. రాజ్, ఇందు ఇద్దరు ఎమోషనల్‌గా చూసుకుంటారు. రాజ్‌ను చూస్తూ ఆగి ఆగి కారు ఎక్కి వెళ్లిపోతుంది ఇందు. రాజ్ దిగాలుగా కూర్చొంటాడు. లక్కీ వచ్చి డబ్బులు అందినట్లు చెబుతాడు. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావా. అందుకే అంతలా ఫీల్ అవుతున్నావా అని లక్కీ నిలదీస్తాడు.
ప్రేమా తొక్కా.. డబ్బులు వచ్చాయా లేదా అంతే.. అని రాజ్ అంటాడు. మన వాటా పది, నా ఫిగర్ వాటా పది అని లెక్కలేస్తాడు లక్కీ. డబ్బు లెక్కేసిన రాజ్ ఇందు చూసిన చూపుల గురించి, దానికి అర్థమేంటో అర్థం కావడంలేదని చెబుతాడు. రాత్రి మిగిలిపోయిన కూరలు ఉన్నాయి, అవి తినేసేయండి అని చూసినట్లు ఉందిరా అని లక్కీ అంటాడు. సాహుకు డబ్బు ఇచ్చేయ్, ఐశ్వర్యకు నేను ఇస్తాను అని రాజ్ అంటాడు.
ఇంట్లోకి లాక్కొచ్చి ఇందును పడేస్తుంది రేఖ. ఇందును అపర్ణ, స్వాతి లేపుతారు. తనకేమైనా గాయం అయి ఉంటే అని అపర్ణ కోప్పడుతుంది. మరి నాకు అయిన గాయం గురించి ఏంటీ అని రేఖ అంటుంది. కిడ్నాపర్‌కు ఇచ్చే డబ్బు కోసం మూడు చెరువుల నీళ్లు తాగించారు అని భూషణ్ అంటాడు. ఇందు వాలకం చూస్తుంటే కిడ్నాప్ అయినట్లు లేదు పిక్‌నిక్‌కు వెళ్లినట్లు ఉందని కనిపెడతాడు శేషు.
రేఖ ఆర్డర్
మీరు అనుకున్నట్లుగా ఇందును ప్రాణాలతో తీసుకొచ్చి మాట నిలబెట్టుకున్నా. రేపు ఆస్తి పేపర్స్‌పై ఇందుతో సంతకాలు పూర్తవ్వాలి. ఈ విషయంలో తేడా వస్తే ఊరుకోను. మీకు ఏవైనా ఆలోచనలు ఉంటే మానుకోండని అపర్ణకు ఆర్డర్ వేసి వెళ్లిపోతుంది రేఖ. ఏంటమ్మా మాకు ఆ అగ్ని పరీక్ష. కిడ్నాప్ చేసింది ఎవరని సుభాష్ అడుగుతారు. వాళ్లు ఎవరో తెలియదు, డబ్బు కోసం చేసి ఉంటారని అబద్ధం చెబుతుంది ఇందు.
ఇందు వచ్చినందుకు అపర్ణ సంతోషిస్తుంది. నువ్వు లేవని తెలిసిన రోజు మా ప్రాణాలు పోతాయ్ అని అపర్ణ అనడంతో ఇందు హగ్ చేసుకుంటుంది. మరోవైపు హాస్పిటల్‌లో రాజ్ ఐసీయూలో ఉన్న పేషంట్‌ను చూస్తాడు. డాక్టర్ వచ్చి మాట్లాడుతాడు. తను కోలుకోవాలని, క్షేమంగా ఉండాలని రాజ్ చెబుతాడు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ, తనలో చలనం లేదు. బిల్స్ కట్టారా అని డాక్టర్ అంటాడు.
బిల్స్ అన్ని క్లియర్ చేశానని రాజ్ చెబుతాడు. మీరు చాలా కష్టపడుతున్నారు. కానీ, ప్రతివారం.. కనీసం తను బతికి ఉండాలంటే మెడిసిన్ ఇవ్వాల్సిందే. టైమ్‌కి డబ్బులు కట్టాలి. ఏమాత్రం ట్రీట్‌మెంట్ ఆగిన ప్రాణాలకు ప్రమాదం అని డాక్టర్ అంటాడు. డబ్బులు నేను ఎలాగైనా కడతాను. ట్రీట్‌మెంట్ మాత్రం ఆగకూడదు. తనకు ఏదైనా అయితే నా ప్రాణం పోయినట్టే అని రాజు చేతులెత్తి మొక్కుతాడు. రాజ్ ట్రీట్‌మెంట్ చేయించడం చూస్తుంటే అతనికి సీక్రెట్‌గా ఎవరికి తెలియని ఏదో గతం ఉన్నట్లు, ఆ అమ్మాయి లవర్ అని తెలుస్తోంది.
రాజ్‌ను చూసిన శ్రుతి
మరోవైపు నుంచి రాజ్ కంపెనీలో పని చేసే శ్రుతి నర్స్‌తో మాట్లాడుతూ వస్తుంది. అక్కడ రాజ్‌ను సైడ్ నుంచి చూస్తుంది. రాజ్‌ను చూసిన శ్రుతి షాక్ అవుతుంది. రాజ్ సర్‌లా ఉన్నాడేంటీ అని తనకోసం వస్తుంది. కానీ, అంతలోనే రాజ్ బైక్‌పై వెళ్తాడు. ఇంటికెళ్తాడు రాజ్. చలపతి అన్నం తింటూ బిజినెస్ గురించి అడుగుతాడు. సాహుతో అంతా క్లియర్ అయిపోయిందని రాజ్ చెబుతాడు.
అసలు వాడు నీతో బిజినెస్ చేస్తున్నాడా, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా, చూస్తే వాడు రౌడీలా ఉన్నాడు అని చలపతి అనుమానంగా అంటాడు. అదేం లేదు. వాడితో బిజినెస్ అయింది. కానీ, మొదటిసారి కాబట్టి ఏం రాలేదని రాజ్ అంటాడు. లాభం రాలేదు, నష్టం రాలేదు అంతేనా. నీ కొడుకు చేసిన పెద్ద బిజినెస్ ఇది అని చలపతి అంటాడు. బుద్ధిగా జాబ్ చేసుకో. నెల నెల జీతం వస్తుందని చలపతి సలహా ఇస్తాడు.
ఇందును పెళ్లి చేసుకోవడం గురించి లక్ష్మీ అడిగితే.. ఆ తెలివైన అమ్మాయి వీడిని ఎలా చేసుకోడానికి ఒప్పుకుంటుందని చలపతి అంటాడు. అసలు మీ సమస్య ఏంటీ. ఇంట్లో ప్రశాంతంగా ఉండనివ్వరా అని కోప్పడుతాడు రాజ్. ఇంతలో లక్కీ కాల్ చేసి అర్జంట్‌గా మాట్లాడాలని సీరియస్‌గా మాట్లాడుతాడు లక్కీ. దాంతో రాజ్ వెళ్తాడు. శ్రుతి ఆటోలో వెతుక్కుంటూ రాజ్ ఇంటికి వస్తుంది. రాజ్‌తో మాట్లాడాలని శ్రుతి అంటుంది.
రాజు గురించి చెప్పిన శ్రుతి
మా నాన్న ఇంట్లో ఉన్నారు, వెళ్లి మాట్లాడండి అని రాజ్ కంగారుగా వెళ్లిపోతాడు. దాంతో శ్రుతి ఇంట్లోకి వెళ్తుంది. రాజ్ గురించి శ్రుతి అడిగితే.. తను మా కొడుకు అని చెబుతారు. మీరు అబద్ధం చెబుతున్నారు. తను మీ కన్న కొడుకు కాదు అని శ్రుతి అంటుంది. దాంతో చలపతి, లక్ష్మీ షాక్ అవుతారు. స్వరాజ్ గ్రూప్ కంపెనీ ఎండీ, మా బాస్ రాజ్‌లాగే ఉన్నారు. నిజం చెప్పండని శ్రుతి అంటుంది.
దానికి మరింత షాక్ అయిన చలపతి, లక్ష్మీ వాడి గురించి నిజం చెబితే వాడు ఎవరో తెలిసే అవకాశం ఉందని ఆలోచిస్తారు. మీరు అన్నది నిజమే. వాడు మా కన్నకొడుకు కాదు అని శ్రీశైలంలో దొరికింది చెబుతాడు చలపతి. నా అనుమానమే నిజమైందని, ఆ ఇంటి రక్తమే. తను దుగ్గిరాల ఇంటి వారసుడని, దుగ్గిరాల ఇంటి రక్తమని శ్రుతి నిజం బయటపెడుతుంది. అలా రాజు దుగ్గిరాల ఇంటి వారసుడనే విషయం బయటకొస్తుంది.
మరోవైపు రేఖకు ఆస్తి పేపర్స్‌పై ఇందు వేలిముద్ర వేస్తుంది. అపర్ణ వద్దని ఎంత వారించినా ఇందు వేస్తుంది. ఇందు సంతకం పెట్టడంతో రేఖ సంతోషిస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


