Brahmamudi April 28 Episode: ఇందుకు గిఫ్ట్ ఇచ్చిన రాజ్- అక్క కిడ్నాప్ విషయం తెలుసన్న నందు- జీరో బడ్జెట్ ఫంక్షన్ సక్సెస్
Brahmamudi Serial April 28th Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 28వ ఎపిసోడ్‌లో నందును చూసి లక్కీ భయపడిపోతాడు. నందు వచ్చి తనకు ఇందు అక్కను కిడ్నాప్ చేసింది తెలుసని, అక్కే తనను తీసుకెళ్లకుండా ఉండిపోయిందని చెబుతుంది. ఇందుకు రాజ్ గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తాడు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇందును ఇంటికి తీసుకురావడం, నందుకు ఆ విషయం తెలిస్తే బతుకు జైలు అవుతుందని లక్కీ అంటాడు. నందుకు ఏం తెలియదురా అని రాజ్ అంటాడు. ఇందు ఫొటో పట్టుకుని నందు తిరగడం మర్చిపోయావా. మనల్ని పట్టుకోడానికే వచ్చిందిరా అని లక్కీ అంటాడు.

కిడ్నాప్ చేసింది తెలుసున్న నందు
ఇంతలో నందు వచ్చి ఇందు అక్కను మీరు కిడ్నాప్ చేసిన విషయం నాకు తెలుసు చెబుతుంది. దాంతో రాజ్, లక్కీ ఇద్దరు షాక్ అవుతారు. తాను ఇంట్లోకి వచ్చినట్లు, ఇందు బట్టలు ఆరేయడం చూసి దొరికిపోయారని నందు చెబుతుంది. మా అక్క ఇందునే నాతో రావడానికి ఇష్టపడలేదు. మీతోనే కిడ్నాప్ అయినట్లు ఉంటానని చెప్పిందని, అందుకే ఊరుకున్నాను అని నందు చెబుతుంది.
రేయ్ ఇందును మనం కిడ్నాప్ చేశామ, మనల్ని తను చేసిందా. అసలు ఇదంతా ఎక్కడికో వెళ్లేలా ఉందని లక్కీ భయపడుతుంటాడు. ఇందు ఏం ప్లాన్ చేసిన కోటి రూపాయలు వచ్చేదాకా విడిచిపెట్టేది లేదని రాజ్ అంటాడు. తర్వాత రాజ్‌ను సాంబారు కలపమంటుంది ఇందు. ఇంతలో రాజ్ కంట్లో సాంబార్ పడటంతో ఇందు వచ్చి ఊదుతుంది. రాజ్‌పై ఇందు ప్రేమ చూపిస్తుంది. అదంతా అంతా చూసి షాక్ అవుతారు.
ఇందు మన ఇంటికి కోడలిగా వస్తే ఎంత బాగుంటుందని చలపతి, లక్ష్మీ అనుకుంటారు. వీడు చేసే ఎదవ పనులకు ఈ అమ్మాయే కరెక్ట్. వాడిని మంచి దారిలో పెడుతుందని చలపతి అంటాడు. ఆ అమ్మాయి ఎందుకు చేసుకుంటుందండి అని లక్ష్మీ అంటే.. ఏమో జరుగుతుందేమో అని చలపతి అంటాడు. వారిద్దరికి బ్రహ్మముడి పడితే బాగుంటుందని లక్ష్మీ అంటుంది. లక్కీ కలగజేసుకోవడంతో రాజ్, ఇందు తేరుకుంటారు.
ఇందుకు రాజ్ గిఫ్ట్
అతిథులకు పక్కింటి వాళ్ల దగ్గర కుర్చీలు తీసుకొచ్చి వేస్తారు. ఇంట్లో ఉన్న సోఫాలు చలపతి, లక్ష్మీలను కూర్చోబెట్టమని ఇందు చెబుతారు. తర్వాత ఇందుకు డ్రెస్ గిఫ్ట్‌గా ఇస్తాడు రాజ్. అది చూసి ఇందు షాక్ అవుతుంది. రూపాయి లాభం లేకుండా నువ్వు ఇచ్చావా అని ఇందు అంటుంది. బాగా కష్టపడుతుంది కదరా అని లక్కీతో అంటాడు రాజ్. అది విన్న ఇందు ప్రేమగా ఫీల్ అవుతుంది. చాలా ప్రేమగా థ్యాంక్స్ రాజు అని చెబుతుంది.
ఇద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లుగా చూపిస్తారు. తర్వాత చాలా రకాల వంటలు రెడీ అయి ఉంటాయి. అది చూసి చలపతి ఆశ్చర్యపోతాడు. జ్యూస్ ఎలా ఇస్తామని వెంకీ అంటే.. ఇంట్లో మట్టి గ్లాస్‌లు ఉన్నాయిగా అవి తీసుకురమ్మంటుంది ఇందు. నీకు పనికిరాకుండా ఏది ఉండదుగా అక్క అని నందు అంటుంది. రాజ్ సెటైర్లు వేస్తాడు. చలపతి, లక్ష్మీ పెళ్లి రోజు ఫంక్షన్‌కు బంధువులంతా వస్తుంటారు.
చలపతి, లక్ష్మీలను సోఫాలో కూర్చొబెడుతుంది ఇందు. చాలా నాచురల్‌గా ఫంక్షన్ చేస్తున్నారు. బడ్జెట్ ఎంత అయిందని ఒకరు అడుగుతారు. జీరో బడ్జెట్ అని చలపతి అంటే.. నీ కొడుకులు భలే చేశారని మెచ్చుకుంటారు. అదంతా చేసిన నా కొడుకులు కాదు. ఈ అమ్మాయి. చికెన్ వండుకుని తినేవాళ్లం ఇంత బాగా ఫంక్షన్ చేసిందని ఇందును మెచ్చుకుంటాడు చలపతి.
నిమ్మరసాన్ని ఫ్రూట్ పంచ్ అని నమ్మించిన లక్కీ, ఇందు
లక్కీని అందరికి ఫ్రూట్ పంచా జ్యూస్ ఇవ్వమంటాడు రాజ్. లక్కీ, వెంకీ ఇద్దరు అందరికీ జ్యూస్ ఇస్తారు. ఇది ఫ్రూట్ పంచ్. వెసవికి చల్లగా ఉంటుందని వెంకీ చెబుతాడు. అది తాగిన ఒకతను ఇది నిమ్మరసం కదా. పేరు మారిస్తే నిమ్మరసం కాకుండా పోతుందా అంటాడు. దాంతో లక్కీని తను చెప్పమన్నట్లు చెప్పమంటుంది ఇందు.
ఇది పెద్ద పెద్ద హోటల్స్‌లో ఇస్తారు. నువ్వెప్పుడైనా ఈ బస్తీ దాటి వెళ్తే కదా తెలిసేదని లక్కీ అంటాడు. నెనెందుకు వెళ్లలేదు. ఇదివరకు వెళ్లినప్పుడు ఇలాంటి జ్యూసే ఇచ్చారు. ఇది ఫ్రూట్ పంచ్ అని అతను అంటాడు. అందరూ కూడా ఫ్రూట్ పంచ్ అనుకునే తాగుతారు. నువ్వు నిజంగా ఏమైనా చేయగలవు అని ఇందును మెచ్చుకుంటాడు రాజ్. నిమ్మరసం అన్న వ్యక్తి ఇంకోటి కూడా తీసుకురమ్మంటాడు.
మీ ఇంటికి కాబోయే కోడలా
తర్వాత అందరికి భోజనాలు పెడతారు. చాలా బాగున్నాయని మెచ్చుకుంటారు. జీరో బడ్జెట్ ఫంక్షన్ సక్సెస్ అయిందని ఇందు, రాజ్ అనుకుంటారు. ఆ అమ్మాయి చాలా బాగుంది. మీ ఇంటికి కాబోయే కోడలా. రాజ్‌కు ఇచ్చి పెళ్లి చేసేయండి అని ఒకతను చలపతిని అంటాడు. దాంతో చలపతి, లక్ష్మీ, ఇందు, రాజ్ అంతా షాక్ అవుతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


