Brahmamudi April 21 Episode: బ్రహ్మముడి- బీరువాలో ఇందు ఒడిలో రాజ్- ఇందు ఐస్‌క్రీమ్ దొంగతనం- గోలీసోడా కోసం మరదలి వంట!

Brahmamudi Serial April 21st Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 21వ ఎపిసోడ్‌లో ఇంటి ఓనర్ డల్లాస్ కాంతారావు వచ్చి షాక్ ఇస్తాడు. వంటోడిగా రాజ్ పరిచయం చేసుకుంటాడు. బీరువాలో ఇందు ఒడిలో రాజ్ పడుకుని రొమాంటిక్‌గా చూసుకుంటారు. ఇంటి ఓనర్ కోసం వంట వండమని చెబితే ఇందు గోలీసోడా కావాలని కోరుతుంది.

Published on: Apr 21, 2026, 07:25:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇందు అడిగినందుకు రాజ్ కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు. ఇంతలో ఎవరో తలుపు కొడతారు. దాంతో రాజ్, లక్కీ కంగారుపడతారు. రేఖ ఆంటీ అడ్రస్ కనుక్కుని వచ్చిందా ఏంటీ అని లక్కీ అంటే అమ్మో నేను ఇరుక్కుంటాను అని ఇందు భయపడిపోతుంది.

బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 21 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 21 ఎపిసోడ్

ఇంటి ఓనర్ రావడం చూసి

కిటికీలోనుంచి చూసిన లక్కీ ఇంటి ఓనర్ రావడం చూసి భయపడిపోతాడు. అదే విషయం రాజ్‌కు చెబుతాడు. మేము వెళ్లి బెడ్‌రూమ్‌లో దాక్కుంటామని రాజ్, ఇందు వెళ్లిపోతారు. లక్కీ డోర్ తీసి యాదగిరి ఫ్యామిలీతో యాదగిరి గుట్టకు వెళ్లాడని, మీరు వస్తున్నారని యాదగిరి చెప్పాడని, అందుకే ఇల్లు క్లీన్ చేస్తున్నానని చెబుతాడు లక్కీ. మాస్టర్ బెడ్‌రూమ్ కాదని, చిన్న బెడ్‌రూమ్‌లోకే వెళ్తాడు డల్లాస్ కాంతారావు.

అదే గదిలో ఉన్న రాజ్, ఇందు బీరువాలో చెరోవైపు దాక్కుంటారు. లక్కీ వచ్చి బాత్రూమ్ క్లీనే చేసి వస్తానంటాడు. కాసేపటికి ఇందు, రాజ్ బీరువాలో ఉన్నట్లు గుర్తిస్తాడు లక్కీ. లక్కీని తరిమేసి డోర్ లాక్ చేసుకుంటాడు ఇంటి ఓనర్ డల్లాస్ కాంతారావు. బీరువాలో ఇందుకు ఒరిగి కూర్చుంటాడు రాజ్. ఇందు కదలడంతో ఒళ్లో పడిపోతాడు రాజ్. అలా బీరువాలో ఇందు ఒడిలో రాజ్ పడుకుని రొమాంటిక్‌గా చూసుకుంటారు.

ఇంటి ఓనర్ బీరువా ఓపెన్ చేయడానికి వెళ్తుంటే.. లక్కీ వచ్చి కొత్త టవల్ కొనుక్కొచ్చానని ఇస్తాడు. బాత్రూమ్‌లోకి ఇంటి ఓనర్‌ను పంపి బయటకు రాజ్, ఇందును పంపిస్తాడు లక్కీ. స్టోర్ రూమ్‌లో ఇందును ఉంచి బయటకు వచ్చేసరికి రాజును చూస్తాడు ఇంటి ఓనర్. వీడు ఎవడు అని ఇంటి ఓనర్ అడిగితే.. వీడికి నేను అసిస్టెంట్ అని, ఫుడ్ ప్రిపేర్ చేయాలిగా అని లక్కీ చెబుతాడు. అంటే వీడు వంటోడా అని డల్లాస్ కాంతారావు అంటాడు.

నాన్‌వెజ్ ఐటమ్స్ చెప్పి

భలే కనిపెట్టారని లక్కీ రాజ్ అంటాడు. తినేందుకు ఫుడ్ ఐటమ్స్ చెబుతాడు ఇంటి ఓనర్. అన్ని నాన్‌వెజ్ ఐటమ్స్ చెప్పి గంటలో ప్రిపేర్ చేయమంటాడు. తర్వాత సిట్టింగ్ మందు ఏర్పాటు చేయమని లక్కీకి చెప్పి వెళ్లిపోతాడు ఇంటి ఓనర్. వంట చేయమని ఇందును బతిమిలాడుకుంటారు రాజ్, లక్కీ. రాజ్ బిహేవియర్ చూసి ఇందు ఇగో చూపిస్తుంది. పోనిలే అని వంట చేస్తే అందులో విషం కలిపారని అంటారా అని ఇందు రివేంజ్ తీసుకుంటుంది.

లక్కీ అడగడంతో రాజ్ బతిమిలాడుకుంటాడు. మా మనిషి అనుకునే అడుగుతున్నాం అని మెల్లిగా అడుగుతాడు రాజ్. మీ వంట చేస్తే మా అమ్మ గుర్తుకు వచ్చిందంటే నమ్ముతారా. ఈ ఒక్కసారి మమ్మల్ని బతికించండి. ప్లీజ్ దయచేసి ఒప్పుకోండి అని ఇంటి ఓనర్ చెప్పిన మెనూ చెబుతూ బతిమిలాడుతాడు రాజ్. మరి ఇన్ని ఐటమ్స్ వండితే నాకేం ఇస్తారని ఇందు అడుగుతుంది. సరేనని లక్కీ, రాజ్ అంటారు.

నాకు గోలీ సోడా కావాలి అని రాజ్ మరదలు ఇందు కోరుతుంది. సరేనని రాజ్ అంటాడు. దాంతో ప్రామిస్ చేయమని ఇందు అడిగితే.. రాజ్ చేస్తాడు. దాంతో ఇందు తెగ మురిసిపోతుంది. అలా గోలీసోడా కోసం మరదలు వంట చేసేందుకు ఒప్పుకుంటుంది. ఇంటి ఓనర్‌కు మందు సిట్టింగ్ పెట్టి పెగ్ కలుపుతాడు లక్కీ. ఒక్కో పెగ్‌కు ఒక్కో ఐటమ్ రావాలని ఇంటి ఓనర్ చెబుతాడు. ఇంటి ఓనర్ తాగుతూ ఉంటాడు. తర్వాత వాటర్ అయిపోవడంతో వంటింట్లోకి ఇంటి ఓనర్ వెళ్తాడు. కిచెన్‌లోకి వెళ్లిన ఇంటి ఓనర్ ఇందును చూసి ఎవరు నువ్వు అడుగుతాడు.

ఇందు కోరికలు తీర్చిన రాజ్

మద్యం మత్తులో ఇంటి ఓనర్ ఉన్నట్లు గుర్తించిన లక్కీ తనే అని చెబుతాడు. గొంతు నీది వినిపిస్తుంది, కానీ, అమ్మాయిలా కనిపిస్తున్నావని ఇంటి ఓనర్ అంటాడు. ఏదోటి చెప్పి లక్కీ కవర్ చేస్తాడు. తర్వాత రాత్రిపూట గోలీ సోడా తాగించేందుకు ఇందును బైక్‌పై రాజ్ తీసుకెళ్తాడు. మధ్యలో ఐస్‌క్రీమ్ బండి కనిపించడంతో ఇందు ఆపమంటుంది. తనకు చిన్నప్పటి నుంచి దొంగనతం చేయాలని ఉండేదని, ఇప్పుడు ఐస్‌క్రీమ్ దొంగతనం చేసి తినాలని ఉందని ఇందు చెబుతుంది.

రాజ్ అలాగే, ఇందు ఐస్‌క్రీమ్ దొంగతనం చేసేలా చేస్తాడు. ఇందు ఐస్‌క్రీమ్ దొంగతనం చేసి తింటుంది. అలా ఇందు కోరికలను రాజ్ తీరుస్తాంటాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More