Brahmamudi April 10 Episode: బ్రహ్మముడి- స్మోక్ బాంబ్‌తో ఇందు కిడ్నాప్- రేఖ సంతకం ప్లాన్ ఫెయిల్- పోలీసుల ఇన్వెస్టిగేషన్
Brahmamudi Serial April 10th Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 10వ ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంటి నుంచి ఇందుతో బలవంతంగా సంతకం పెట్టించుకుంటున్నారని మీడియాకు లీక్ అయిందని రేఖకు కాల్ చేసి చెబుతాడు ప్రెసిడెంట్. దాంతో అపర్ణ వాళ్లపై రేఖ ఫైర్ అవుతుంది. కోపం తెచ్చుకున్న సుభాష్ అదంతా తానే చేసినట్లు చెబుతాడు.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో లాయర్లతో రేఖ మీటింగ్ నిర్వహిస్తుంది. ఇందుతో సంతకం అందరి ముందు పెట్టించాలని, దాన్ని వీడియో తీసుకుని భవిష్యత్తులో ప్రూఫ్ కింద వాడుకోవచ్చని ఓ లాయర్ చెబుతాడు. రేఖను ఎదురించే ధైర్యం ఎవరు చేయరులేండి అని భ్రమరాంబ అంటుంది.

మీడియాకు లీక్ అయింది
ఇంతలో రేఖకు శ్యామ్ అనే అతను కాల్ చేసి తమ రిపోర్టర్ నుంచి ఓ ఇన్ఫర్మేషన్ వచ్చిందని. మీ ఇంట్లోనుంచి ఒకరు కాల్ చేసి ఇందుతో బలవంతంగా సంతకం పెట్టించుకుంటున్నారని, ఇందుకు మీడియా అంతా సపోర్ట్ చేయాలని కోరారు. ఈ న్యూస్ అన్ని ఛానెల్స్‌కు వెళ్లిపోయింది. నేను ప్రెసిడెంట్ కాబట్టి అందరూ నాకు కాల్ చేసి అడుగుతున్నారు. ఒక్కసారి ఈ విషయం పబ్లిక్ అయిందంటే ఎవరు ఏం చేయలేరు అని అతను చెబుతాడు.
నేను ఈ విషయాన్ని హ్యాండిల్ చేస్తాను, రిపోర్టర్స్‌ను మీరు ఆపండి, అందుకు రిటర్న్‌గా మీకు పెద్ద స్కేల్‌లో గిఫ్ట్ అందుతుందని రేఖ చెబుతుంది. ఇందుతో బలవంతంగా సంతకం పెట్టిస్తున్నామని మీడియాకు లీక్ చేశారట అని చెప్పి అపర్ణపై కోప్పడుతుంది రేఖ. మరోవైపు ఇంత సమస్య పెట్టుకుని ప్రశాంతంగా ఎలా ఉన్నావని, రాత్రి అమ్మ గురించి తెలుసుకుని మారుతావని అనుకున్నానే, కానీ, నువ్వు ఇలాగే ఉన్నావని ఇందుపై కోప్పడుతుంది అపర్ణ.
ఇంతలో వచ్చిన రేఖ అందుకేనా గూడు పుఠానీ చేస్తున్నారా. నువ్వు మీ నానమ్మ కలిసి నా మీద మీడియాకు కంప్లైంట్ చేస్తారా. నన్ను మోసం చేస్తున్నారా, సంతకం పెట్టకుంటే నీ ముసలి తాత, నానమ్మను ఏం చేస్తానో మర్చిపోయావా అని రేఖ ఫైర్ అవుతుంది. ప్రమాణపూర్తిగా చెబుతున్నా నేను ఏ మీడియాకు చెప్పలేదని ఇందు అంటుంది. ఇలా వెన్నుపోటు పొడవటానికి సిగ్గు లేదు అని భ్రమరాంబ అంటే అపర్ణ ఫైర్ అవుతుంది.
సుభాష్ ఫైర్
ఇక మాటలు అనవసరం. ఈ ముసలోళ్లకు నరకం అంటే ఏంటో చూపిస్తే సరిపోతుందని భూషణ్ అంటాడు. ఏం చేస్తావ్, మహా అయితే చంపేస్తావ్ అంతే కదా. ఇప్పటివరకు నా మనవరాలి కోసం ఆగాను. ఇక ఆగాను. ఇప్పటివరకు మీరు చేసిన పనులన్నీ బయటపెడతాను అని మొదటిసారి సుభాష్ చాలా కోపంగా వార్నింగ్ ఇస్తాడు. దాంతో రేఖ చప్పట్లు కొట్టి బాగానే ట్రై చేశావ్. మీడియా వాళ్లు రావట్లేదు. నా మాటకు రెస్పెక్ట్ ఇచ్చి ఆగిపోయారు. మా ఇంట్లోనుంచి ఎవరు కాల్ చేయరు, చేసిన వాళ్లు ప్రాణాలతో ఉండరని వాళ్లకు చెప్పారు అని రేఖ అంటుంది.
ఈరోజుతో మీ కథ ముగించగా తప్పదు అని రేఖ అంటే.. ఇందు అరుస్తుంది. వీళ్లను ప్రాణాలతో ఉంచాలంటే ఒక్క కారణం చెప్పమని రేఖ అంటే.. నేను మిమ్మల్ని ఎదురించలేదుకదా. మీకు సంతకం పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ మా తాతయ్య, నానమ్మ ప్రాణాలతో ఉంటేనే సంతకం పెడతాను అని ఇందు అంటుంది.
సరే. ముందు సంతోషంగా బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకో. ఆ తర్వాత అందరిముందు సంతకం పెడుదువు అని రేఖ అనేసి వెళ్లిపోతుంది. మరోవైపు జ్యూస్ ఎవరితో అయినా ఇది తాగించాలి, పని చేస్తుందో లేదో చెక్ చేయాలి. దానికి ఒక బకరా కావాలని బంటీ అంటాడు. ఇంతలో శేషు వచ్చి ఓ జ్యూస్ అడుగుతాడు. బకరా దొరికాడని మత్తుమందు కలిపిన జ్యూస్ శేషుకు ఇస్తాడు బంటీ. అది తాగి శేషు స్పృహ కోల్పోతాడు.
రేఖ పేరు మీదకే ఆస్తి
శేషును ఓ మూలన పడుకోబెడతారు బంటీ, బబ్లూ. బర్త్ డేకు వచ్చిన అతిథులందరికి బంటీ, బబ్లూ జ్యూస్‌లు ఇస్తారు. తర్వాత బర్తే డే వేదికపైకి ఇందు అందరితో వస్తుంది. మనిద్దరి జీవితాలు ఒకేచోట మొదలయ్యాయి, నీ వాళ్లను నువ్వు, నావాళ్లను నేను కోల్పోయాం. ప్రేమతో నువ్వు, పగతో నేను మన జీవితాలు మొదలుపెట్టాం. ఇద్దరిదీ తపన గెలవాలని, రాబోయే ఐదు నిమిషాలు నీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. ఇప్పుడు నువ్వు తప్పు చేస్తే ఆ పాపం నీ పెద్దవాళ్లకు చుట్టుకుంటుంది అని రేఖ అంటుంది.
ఈ ఆట నీది అయినా గెలుపు నాదే అవ్వాలని చెబుతుంది రేఖ. ఇందు కేక్ కట్ చేస్తుంది. అందరూ బర్త్ డే విషెస్ చెబుతారు. మరోవైపు రాజ్, లక్కీ బ్లాస్ట్ చేసేందుకు ట్రై చేస్తుంటారు. ఇందు స్పీచ్ ఇస్తుంది. నానమ్మ అపర్ణ గురించి గొప్పగా చెబుతుంది. ఆ తర్వాత తనకు అండగా నిలబడింది, ముందుండి నడిపించింది రేఖ ఆంటీ అని, ఈరోజుతో నా ఆస్తి పవర్ ఆఫ్ అటార్నీ నాకు రాబోతుంది. కానీ దానిపై నాకు ఆశ లేదు. అది రేఖ ఆంటీకే బాధ్యతలన్నీ అప్పగించాలనుకుంటున్నానని ఇందు అంటుంది.
దాంతో రేఖ అందరూ సంతోషిస్తారు. ఇంత చిన్న వయసులోనే ఆ బాధ్యతలు చూసుకోవాలని లేదు. మా ఆస్తులన్నీ మా రేఖ ఆంటీ పేరు మీదకే మార్చాలని అనుకుంటున్నాను అని ఇందు చెబుతుంది. తర్వాత లాయర్స్ ఆస్తి పేపర్స్ తీసుకొస్తారు. ఇందుతో వేలి ముద్ర వేయిస్తుంటుంది రేఖ. ఇంతలో రాజ్ స్మోక్ బాంబ్ పేలుస్తాడు. ఆ స్మోక్ బాంబ్‌కు అందరు స్పృహ కోల్పోతారు.
ఇందు కిడ్నాప్
అంత గందరగోళం ఏర్పడుతుంది. అదే సమయంలో ఇందును కిడ్నాప్ చేస్తారు రాజ్, లక్కీ. రేఖ సంతకం ప్లాన్ ఫెయిల్ అవుతుంది. అనంతరం ఇందు కిడ్నాప్ అయిందని రేఖకు చెబుతుంది ఐశ్వర్య. పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇందును ఎవరో దగ్గరివాళ్లే కిడ్నాప్ చేయించుంటారని పోలీస్ అంటాడు. ఐశ్వర్య తెగ టెన్షన్ పడిపోతుంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


