Brahmamudi March 5th Episode: రేఖపై తిరగబడిన అపర్ణ- సుభాష్‌ను తోసేసిన భూషణ్- రాజ్, కావ్యలాగే గొడవతో ఇందు, రాజు పరిచయం

Brahmamudi Serial March 5th Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 5వ తేది ఎపిసోడ్‌లో రుద్రాణి ఫొటోను ఇందు తుడుస్తుంది. ఇంతలో స్వాతి వచ్చి ఇందును తీసుకెళ్లేందుకు ట్రై చేస్తుంటే రుద్రాణి ఫొటో కింద పడి పగులుతుంది. అది తెలిసి ఇందును రేఖ కొట్టబోతుంది. అపర్ణ ఆపి రుద్రాణి ఏంటో చెబుతూ రేఖపై తిరగబడుతుంది.

Mar 5, 2026, 07:22:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో నీళ్లు పట్టుకునే చోట ఆడవాళ్లందరితో రాజ్ గొడవ పడతాడు. రాజును అంతా చితకబాదుతారు. వాళ్ల నుంచి తప్పించుకుని నీళ్లు పట్టుకుంటాడు రాజు. తర్వాత అందరిని పిలిచి ఇలాగే కొట్టుకుంటే నీళ్లు అయిపోతాయ్ అని చెబుతాడు.

బ్రహ్మముడి సీరియల్‌ మార్చి 5వ ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ మార్చి 5వ ఎపిసోడ్

మహారాణిని పెళ్లి చేసుకుంటా

అప్పటి వరకు రాజ్ అనుకుని అతని ఫ్రెండ్‌ను కొడతారు ఆడవాళ్లు. నీళ్లు పట్టుకుని ఇంటికి వెళ్తాడు రాజు. ఆడవాళ్లంతా రాజుపై కంప్లైంట్ ఇస్తున్నారని తండ్రి తిడతాడు. రాజు పెళ్లి గురించి తిడతాడు. నేను మహారాణిని పెళ్లి చేసుకుంటాను, నాకోసం కలలు కంటూ ఉంటుంది, పనివాళ్లతో పని చేయించుకుంటూ ఉంటుంది అని రాజు అంటాడు.

మరోవైపు రుద్రాణి ఫొటో క్లీన్ చేస్తుంది ఇందు. ఇంతలో స్వాతి వచ్చి తన ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలో చెప్పమని అడుగుతుంది. తర్వాత రుద్రాణి వాళ్ల గురించి నానమ్మ చెప్పింది, తిన్నింటివాసాలు లెక్కపెట్టారంటగా అని స్వాతి అంటుంది. ఇంతలో రేఖ పేరు చెప్పి స్వాతిని భయపెడుతుంది స్వాతి. ఇందును రమ్మని చేయి పట్టుకుని లాగుతుంది స్వాతి.

ఈ పెనుగులాటలో రుద్రాణి ఫొటో కిందపడుతుంది. భ్రమరాంబ వచ్చి కోప్పడుతుంది. ఆ ఫొటో తనవల్లె పడిందని ఇందు చెబుతుంది. ఇంతలో రేఖ వచ్చి పొగరు పెరిగిందని అంటుంది. రేఖకు అంతా భయపడుతుంటారు. మా అమ్మను ఈ ఫొటోలోనే చూసుకుంటున్నాని తెలుసు, అయినా పగులగొట్టావంటే నేనంటే భయం పోయిందా అని రేఖ అంటుంది.

రుద్రాణిని తిడుతూ

సరిచేస్తానని ఇందు అంటే.. కోపంతో కొట్టబోతుంది రేఖ. దాంతో రేఖపై అపర్ణ తిరగబడుతుంది. నా మనవరాలిపై చేయి పడితే ఊరుకోను చెబుతున్నాను అని వార్నింగ్ ఇస్తుంది. దాంతో రేఖ చేయి దించుతుంది. వయసొచ్చిన ఆడపిల్ల మీద చేయి చేసుకోవద్దని తెలియదా. మీ అమ్మ ఎలాంటిదో నాకు బాగా తెలుసు. అయిన వాళ్లకు వెన్నుపోటు పొడిచి అందరిని దూరం చేసింది, అలాంటిదాని ఫొటో ఇంట్లో ఉండటం పాపం అని రుద్రాణిని తిడుతూ మాట్లాడుతుంది అపర్ణ.

ఇందు కావ్య కూతురన్న విషయం గుర్తుంచుకో. కావ్య బతికి ఉన్నప్పుడు నీ అమ్మను ఏం చేసిందే మర్చిపోకు అని అపర్ణ అంటుంది. ఒక్కసారి కావ్యలో ఉన్న కోపం ఇందులో వస్తే మీ జీవితాలే తలకిందులు అవుతాయ్ అని సుభాష్ అంటాడు. ఇన్నేళ్లు గడిచిన మీలో పొగరు ఇసుమంత తగ్గలేదు. ఈరోజు నా మీదే నోరు లేచిందంటే నా మీద భయం పోయిందన్నమాట, ఇది మా అమ్మ ఫొటో పగలగొట్టడం నచ్చలేదు అని రేఖ అంటుంది.

ఈ ధైర్యం నచ్చలేదు. చంపేస్తాను.. మీలో పుట్టికొచ్చిన ధైర్యాన్ని ఈరోజే చంపేస్తాను అని రేఖ అంటుంది. దాంతో రేఖ సైగ చేయడంతో భూషణ్ సుభాష్‌ను తీసుకెళ్లి మెట్లపై నుంచి పడేస్తాడు. దాంతో సుభాష్ అరుస్తాడు. సుబ్బు అంటూ ఇందు వెళ్తుంది. ఇందు, అపర్ణ ఇద్దరు కలిసి సుభాష్‌ను లేపి వీల్ చైర్‌లో కూర్చోబెడతారు. మీరు మనుషులా రాక్షసులా అని తిడుతుంది అపర్ణ.

అపర్ణను ఆపిన ఇందు

ఇందు ఆపుతుంది. రేఖకు క్షమాపణ చెబుతుంది. అపర్ణను తన మీద ఒట్టు వేసి తన ఆవేశాన్ని ఆపుతుంది ఇందు. వాళ్ల తప్పుకు నువ్వు సారీ చెప్పావ్ కాబట్టి ఇకనుంచి శిక్ష కూడా నీకే పడుతుంది అని రేఖ చెబుతుంది. తర్వాత కాలం మారింది కాని మన పరిస్థితులు మారలేవు. రేఖ లాంటి వాళ్లను ఎదురించాలంటే సమయం కూడా కలిసి రావాలి. పాపం పండాలి, కాలం ఎదురుతిరగాలి, అప్పటివరకు ఎదురుచూడాలి అని ఇందు అంటుంది.

నువ్వు చెప్పింది నిజమే కాస్తా ఆగి ఉండాల్సింది అని అపర్ణ అంటుంది. ఇంతలో స్వాతి వచ్చి నా వల్ల తిట్లు తిన్నందుకు సారీ చెబుతుంది. తర్వాత స్వాతి నవ్విస్తుంది. తన డౌట్ క్లియర్ చేయమని ఇందును తీసుకెళ్తుంది స్వాతి. తర్వాత ఎగ్జామ్‌కు వెళ్తున్న ఇందు కారుకు రాజ్ బైక్‌తో వచ్చి గుద్దుకుంటాడు. యాక్సిడెంట్ అవుతుంది.

రాజ్, కావ్య లాగే

తన బోన్స్ బ్రేక్ అయ్యాయని, ఎమ్మారై స్కాన్ చేయాలని, డబ్బు లాగేందుకు రాజ్ ట్రై చేస్తాడు. కానీ, ఇందు రివర్స్ అవుతుంది. రాజ్, కావ్యలు ఎలా యాక్సిడెంట్‌, గొడవతో పరిచయం అయ్యారో అలాగే, ఇందు, రాజు కూడా అవుతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More