బ్రహ్మముడి మార్చి 3 ఎపిసోడ్: ఇంట్లోంచి పారిపోయిన నందు- చేరదీసిన కానిస్టేబుల్- రుద్రాణి ఫొటో పగలగొట్టిన ఇందు!
Brahmamudi Serial March 3rd Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 3వ తేది ఎపిసోడ్‌లో ఇందు, నందుకు భ్రమరాంబ కూతురు స్వాతి బొమ్మలు ఇస్తుంది. ఐశ్వర్య వచ్చి గొడవ పెట్టుకుంటుంది. చికెన్ తిన్నందుకు నందుకు వాతలు పెడుతుంది రేఖ. దాంతో ఇంట్లోంచి పారిపోతుంది నందు. పాపను కానిస్టేబుల్ దత్త చేరదీస్తాడు.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రేఖ పెళ్లి చేసుకుని కొత్త ఫ్యామిలీతో అపర్ణ ఇంట్లోకి అపర్ణ పిల్లలకు రేఖ వదిన అన్నం కూడా ఉంచదు. ఆస్తి ఎవరి పేరు మీద లేదు. నెల నెల వచ్చే డబ్బులతోనే ఇల్లు గడవాలి. చిన్న పిల్ల రేఖ మాత్రం ఎన్నని చూసుకుంటుంది. కుమారి ఇంట్లో ఏది వండాలో నేను మాత్రమే డిసైడ్ చేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది రేఖ వదిన.

అచ్చం మీ అమ్మలాగే
తర్వాత ఉన్న కొంచెం అన్నాన్ని ఇందు, నందుకు పెడుతుంది అపర్ణ. నానమ్మ నువ్వు కూడా తిను అని అపర్ణకు ఇందు అన్నం తినిపిస్తుంది. నువ్వు అచ్చం మీ అమ్మలాగే అని మెచ్చుకుంటుంది అపర్ణ. తర్వాత ఇందు, నందులకు తన బొమ్మలతో ఆడుకోవట్లేదని ఇస్తుంది శేషు కూతురు స్వాతి. వాటితో ఇందు, నందు ఆడుకుంటారు.
ఇంతలో ఐశ్వర్య వచ్చి అవి నావని లాక్కుంటుంది. ఇందు, నందులను పనివాళ్లను, ఈ కోటకు తానే మహరాణి అని మాటలు అంటుంది. నందు తనతో గొడవ పడతారు. ఇంతలో భ్రమరాంబ వచ్చి నందును తోసేస్తుంది. దాంతో అపర్ణ వచ్చి తిడుతుంది. ఇంతలో రేఖ వచ్చి ఇప్పుడు నోరు మూసుకుని ఉండాల్సింది నువ్వని, నీ మనవరాళ్లు పనివాళ్లలాగే ఉండాలని అంటుంది.
కనీసం మిమ్మల్ని బతకనిస్తున్నాను. వారికి ఎంతలో ఉండాలో హద్దులు చూపించు అని తిట్టేసి వెళ్తుంది రేఖ. మరోవైపు తమ్ముడుతో రాజు ఆడుకుంటారు. బాలు పక్కకు వెళ్లడంతో తమ్ముడు వెళ్తాడు. అప్పుడే కారు వస్తుంది. కారు గుద్దకుండా రాజు తమ్ముడిని కాపాడుతాడు. కానీ, రాజుకు దెబ్బ తగులుతుంది. అదంతా చూసిన తల్లిదండ్రులు ఎందుకురా ఇలా చేశావని అడుగుతారు.
ఏమైనా పర్వాలేదు
నాకు ఏమైనా పర్వాలేదు తమ్ముడికి ఏం కాకూడదు అని రాజు అంటాడు. దాంతో నిజంగానే వీడు నా పెద్ద కొడుకు అని మురిసిపోతుంది తల్లి. మరోవైపు నందు ఏడుస్తుంది. స్వాతి వచ్చి మరో బొమ్మ ఇస్తుంది. ఇది మా అమ్మకు తెలియదు. నాకు ఫ్రెండ్స్ ఇచ్చారు అని స్వాతి అంటుంది. ఆ బొమ్మ తీసుకుని నందు ఆడుకుంటుంది. మరోవైపు బిజినెస్ మ్యాన్ వస్తున్నాడని స్పెషల్‌గా వండిస్తుంది రేఖ.
డైనింగ్ టేబుల్‌పై ఉన్న చికెన్ తీసుకుని తినబోతుంది నందు. అది చూసిన రేఖ ఇంకోసారి నువ్వు ఇలాంటిది చేయకూడదు అంటే శిక్షించాలి అని నందు చేయిపై పెనంతో వాత పెడుతుంది. అది చూసి అపర్ణ తిడుతుంది. ఇంకోసారి ఇలా చేయకూడదని చెప్పు అని వెళ్లిపోతుంది రేఖ. తర్వాత రాత్రి నన్ను క్షమించు అక్కా. నేను బాగా చదువుకుని పెద్దయ్యాక వచ్చి రేఖ అంటీని బాగా కొట్టి మిమ్మల్ని తీసుకెళ్తాను అని అక్కకు ముద్దు పెట్టి ఇంట్లోంచి పారిపోతుంది నందు.
మరుసటి రోజు ఉదయానికి నందు కనిపించకపోవడంతో అపర్ణ కంగారుపడుతుంది. మరోవైపు ఒకరి బ్యాగ్‌లో బన్ ఉంటే నందు తీసుకుంటుంది. అది చూసి దొంగతనం చేస్తావా అని తిడుతుంది ఆవిడ. ఇంతలో ఓ తాగుబోతు వచ్చి ఏదో ఆకలికి తీసుకుంది అని చెబుతాడు. నేను హెడ్ కానిస్టేబుల్ వీన్ దత్త అని అంటాడు. దాంతో ఆవిడ పారిపోతుంది.
వాత పెట్టినందుకే
ఆ బన్ తీసి నందుకు తినిపిస్తాడు. ఇంతకీ ఎవరు నువ్వు అని అడిగిన తాగుబోతు.. ఇది తినేసి మీ ఇంట్లోవాళ్ల దగ్గరికి వెళ్లిపో అని వెళ్లిపోతాడు. తన వెంటే నందు వెళ్తుంది. మరోవైపు పాప కనిపించట్లేదు అని అపర్ణ అంటే.. వాత పెట్టినందుకు వెళ్లిపోయింటుంది. మంచి పని అయిందని రేఖ అంటుంది.
తర్వాత తనకోసం చేసిన పాయసం కొంచెం నీకోసం ఉంచానని ఇందుకు ఇస్తుంది స్వాతి. నందు వెళ్లిపోయిందిగా తినాలని లేదు అని ఇందు అంటుంది. ఆ చెల్లి ఇంటికి వచ్చేంతవరకు ఈ చెల్లి నీకు తోడుగా ఉంటుంది అని స్వాతి అంటుంది. మరోవైపు ఉదయం నందు కానిస్టేబుల్ దత్త ఇంటి ముందు పడుకుని ఉంటుంది.
అది చూసి పాప ఇక్కడ ఎందుకు పడుకున్నావ్, మీ వాళ్ల దగ్గరికి వెళ్లమని అంటాడు కానిస్టేబుల్ దత్త. నేను ఎక్కడి నుంచి వచ్చానో చెప్పను. నేను బాగా చదువుకుని పోలీస్ అవుతా. ఆ రేఖ ఆంటీ బాక్సు బద్దలు కొడతా. మీరు ఉండమంటే ఇక్కడే ఉంటా. లేకపోతే వెళ్లిపోతా. కానీ, నేను ఉండేది ఎక్కడో చెప్పను అని నందు మొండిగా మాట్లాడుతుంది.
పోలీస్ కావాలంటే ఏం చేయాలో చెప్పు
మరి మీ అమ్మ నాన్న అని అడిగితే.. వాళ్లు చనిపోయారు. అంత జాలిగా చూడకు. పోలీస్ కావాలంటే ఏం చేయాలో చెప్పు అని నందు అంటుంది. దాంతో కానిస్టేబుల్ దత్త నందును చేరదీస్తాడు. మరోవైపు రాజు తండ్రి లెక్కలు వేసుకుంటే.. లెక్కలు వేసుకునే బదులు ఎక్కువ సంపాదించొచ్చు కదా. అందుకోసం నేను అద్భుతం చేస్తా అని రాజు అంటాడు. మరోవైపు ఉదయం అపర్ణ లేస్తే నేను ముగ్గు వేస్తా నానమ్మా. నువ్వు పడుకో అని వెళ్తుంది ఇందు.
ఇది అచ్చం వాళ్ల అమ్మలాగే ఉంది. ఎదుటివారికి కష్టం వస్తే ఊరుకోదు అని అపర్ణ అనుకుంటుంది. అలా ముగ్గులేస్తూ ఇందు పెద్దది అవుతుంది. రుద్రాణి ఫొటోను ఇందు తుడుస్తుంటే అది కిందపడుతుంది. రుద్రాణి ఫొటోను ఇందు పగలగొట్టిందని రేఖ వచ్చి కొట్టబోతుంది. అపర్ణ వచ్చి అడ్డుకుంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

E-Paper












