Brahmamudi April 25 Episode: బ్రహ్మముడి- వెంకీని కాపాడిన నందు, అంట్లు తోమిన రాజ్- రేఖను బెదిరించిన అపర్ణ, 2 రోజుల గడువు!
Brahmamudi Serial April 25th Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 25వ ఎపిసోడ్‌లో ఇందు గురించి చెప్పిన రాజ్ తన తల్లిదండ్రులకు పెళ్లి రోజు ఫంక్షన్ చేయిస్తాడు. రాజ్‌తో అంట్లు తోమిస్తుంది ఇందు. వెంకీ కొబ్బరి చెట్టు ఎక్కుతాడు. మరోవైపు లక్కీని ఇంటి ఓనర్ లేపితే.. తనపై అఘాయిత్యం చేయబోయారని చెబుతాడు.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇందును ఇంటికి తీసుకెళ్తాడు రాజ్. అది చూసి తల్లిదండ్రులు, వెంకీ తెగ షాక్ అవుతారు. రాత్రి వీడికోసం ఓ అమ్మాయి వచ్చింది. ఇప్పుడు వీడు ఇంటికే అమ్మాయిని తీసుకొచ్చాడని తండ్రి అంటాడు. ఈ ఎధవ నీకు ఎలా నచ్చాడమ్మా అని ఇందును అంటాడు రాజ్ తండ్రి.

ఇందుకు పరిచయం
అది కాదు నాన్న ఈ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ కాదు అని రాజ్ చెబుతాడు. ఇంట్లో అందరిని ఇందుకు రాజ్ పరిచయం చేస్తాడు. దాంతో రాత్రి రాజ్ చెప్పింది ఇందు అంటుంది. అందరి గురించి గొప్పగా చెప్పి నా గురించి తక్కువ చేసి చెబుతావా అని రాజ్‌ను అంటాడు తండ్రి. తర్వాత ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు అని తండ్రి అడిగితే.. పెళ్లి అని రాజ్ అనేసరికి తండ్రి అరుస్తాడు. పెళ్లి చేసుకున్నాడట అని గోల చేస్తాడు.
వెంకీ, తల్లి కూడా పెళ్లి చేసుకోవడం ఏంట్రా అని తిడతారు. దాంతో ఎహే అది కాదు. ఈ అమ్మాయి ఈవెంట్ ప్లానర్ అని చెబుతాడు. దాంతో ఓహో అదా సంగతి. నీలాంటి ఎదవకి ఇంత అందమైన అమ్మాయి ఎలా పడిందా అని డౌట్ వచ్చింది. కానీ, నీలాంటి వాళ్లను కూడా అమ్మాయిలు ఇష్టపడుతున్నారుగా అని ఒక చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు కాదని క్లారిటీ ఇచ్చావుగా అని తండ్రి అంటాడు.
మీ పెళ్లి రోజు ఫంక్షన్ తను జీరో బడ్జెట్‌లో చేస్తుందని రాజ్ చెబుతాడు. దానికి రాజ్ తల్లిదండ్రులు సంతోషిస్తారు. వారిని ఇందు బాగా రెడీ అయి రమ్మని చెబుతుంది. అంట్లు తోమమని ఇందు చెబితే.. వెంకీ చెట్టు ఎక్కి కొమ్మలు కోస్తానంటాడు. అలాగే వెంకీ వెళ్లిపోతాడు. ఆ అంట్లు తోమమని రాజ్‌కు ఇందు ఆర్డర్ వేస్తుంది. దాంతో రాజ్ అంట్లు తోముతాడు. మరోవైపు లక్కీని నిద్ర లేపుతాడు ఇంటి ఓనర్.
అఘాయిత్యం చేయబోయారు
రాత్రి ఎవరు కొట్టార్రా అని అడుగుతాడు ఓనర్. దాంతో తనే అని చెబుతాడు లక్కీ. దానికి లక్కీ చెంపలు వాయిస్తాడు ఇంటి ఓనర్ డల్లాస్ కాంతారావు. అసలు ఎందుకు కొట్టావురా అంటాడు. నేను చీర కట్టుకుని వంట చేస్తుంటే నా మీద అఘాయిత్యం చేయబోయారు అని గట్టిగా చెబుతాడు లక్కీ. అరేయ్ గట్టిగా అరవకురా. ఎవరైనా వింటే పరువుపోతుంది. ఈ విషయం ఎవరికి చెప్పకు అని ఇంటి ఓనర్ భయంతో అంటాడు.
సరే నీ ఫ్రెండ్ ఎక్కడ. వచ్చి టిఫిన్ చేయమను. నేను వెళ్లాలి. ఫ్లైట్‌కు టైమ్ అవుతుందని ఇంటి ఓనర్ అంటాడు. సరే అన్న లక్కీ రాజ్ కోసం వెతుకుతాడు. ఇదేంటీ రాజ్ గాడు ఆ అమ్మాయిని వాళ్లకు అప్పజెప్పి డబ్బు తీసుకున్నాడా అని డౌట్ పడుతాడు లక్కీ. రాజ్‌కు కాల్ చేసి మామా అంటూ నాకు వెన్నుపోటు పొడిచావ్ కదరా. ఆ అమ్మాయిని అప్పజెప్పి డబ్బంతా తీసుకున్నావుగా అని రాజ్‌ను లక్కీ తిడతాడు.
తను మా ఇంటికి తీసుకొచ్చాను. ఇక్కడ ఫంక్షన్ చేస్తుంది. వచ్చేముందు 2 కిలల చికెన్ తీసుకురా అని రాజ్ చెబుతాడు. దాంతో సరేనంటాడు లక్కీ. ఇంతలో ఇంటి ఓనర్ ఎదురొచ్చి నా ఫ్లైట్ టైమ్ అవుతుంది. ఇల్లు జాగ్రత్త అని చెప్పేసి వెళ్లిపోతాడు. మరోవైపు వెంకీ ఇంటికి నందు వస్తుంది. వెంకీ చెట్టు ఎక్కి ఉండటంతో.. అమ్మాయి దక్కలేదని చెట్టు ఎక్కుతావా. మోసం చేసిన అమ్మాయికి నీ వాల్యూ ఏంటో చెబుతానంటివి కదా. కొంపదీసి ఆత్మహత్య చేసుకుంటున్నావా అని ఇంట్లో అందరిని పిలుస్తుంది నందు.
వెంకీని కాపాడిన నందు
దాంతో నందును ఆపుతాడు వెంకీ. ఇంట్లో ఫంక్షన్ గురించి చెప్పిన వెంకీ తనకు చెట్టు ఎక్కడం వచ్చు కానీ దిగడం రాదంటాడు. అది నేను అడిగినప్పుడే చెప్పాలిగా అని ఇందు ఎంట్రీ ఇస్తుంది. అక్క నువ్వేంటీ ఇక్కడ అని నందు అడిగితే.. వెడ్డింగ్ ప్లానర్ అని రాజ్ చెబుతాడు. తర్వాత ఓ గుడ్డ తీసుకొచ్చి రాజ్, ఇందు పట్టుకుంటారు. అందులో వెంకీని దూకమంటారు. దానికి వెంకీ భయపడతాడు.
ఇంతలో ఓ నిచ్చెన తీసుకొచ్చి చెట్టుకు పెడుతుంది నందు. ఫ్రెండ్ అంటే నువ్వేనే, వాడు ఉన్నాడు ఎందుకు. ఇక నుంచి మా అన్నయ్య నా శత్రువు అని వెంకీ అంటాడు. ఆ నిచ్చెనతో కిందకు దిగుతాడు వెంకీ. హమ్మయ్యా బతికిపోయాను. కొంచెం ఉంటే చచ్చేవాన్ని. ఎందుకు వచ్చావో తెలియదు కానీ నన్ను కాపాడావ్ అని వెంకీ అంటాడు. మాట్లాడదామని వచ్చానని, వెళ్తానని నందు వెళ్తుంటే.. ఉండమని వెంకీ, ఇందు అంటారు.
దాంతో నందు కూడా ఉండిపోతుంది. కిచెన్‌లో ఏది ఎక్కడ ఉందో చెప్పమని రాజ్‌ను అడిగితే.. సైలెంట్‌గా ఉంటాడు. వెంకీ సెటైర్లు వేస్తాడు. అంతుంటే నువ్వు చెప్పురా అని వెంకీని అంటాడు రాజ్. అమ్మకు రోజు హెల్ప్ చేసేది నేనే అని కిచెన్‌లో ఏది ఎక్కడుందో వెంకీ చెబుతాడు. ఉన్న సరుకులుతోనే ఎంతమంది వస్తే అంతమందికి వంట చేస్తానని ఇందు చెబుతుంది.
రేఖను బెదిరించిన అపర్ణ
అన్ని కూరగాయలు కలిపి కిచిడీ చేద్దాం. చింతపండుతో చారు చేద్దాం. చికెన్‌ను వండి కప్పులో వేసిద్దాం అని ఇందు అంటుంది. తర్వాత రాజ్ తల్లిదండ్రులు కొత్త బట్టలు వేసుకుని రెడీ అయ్యి వస్తారు. దేవుడికి పూజ చేసి అందరికి హారతి ఇస్తుంది రాజ్ తల్లి.
మరోవైపు ఇన్నిరోజులు కంపెనీ నుంచి వచ్చిన డబ్బంతా మీరే నొక్కేశారుగా. ఆ డబ్బు ఇచ్చి ఇందును తీసుకురండి అని రేఖపై అరుస్తుంది అపర్ణ. రెండే రెండు రోజులు నీకు గడువు ఇస్తున్నాను. ఆలోపు నా మనవరాలిని తీసుకురండి. లేకుంటే నేను నా మనవరాలు కిడ్నాప్ అయిందని మీడియాకు చెబుతాను. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అఫిషియల్‌గా కంప్లైంట్ ఇస్తాను అని 2 రోజుల గడువు ఇచ్చి రేఖను బెదిరిస్తుంది అపర్ణ. అపర్ణ వార్నింగ్‌తో రేఖ భయపడుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


