గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బ్రహ్మముడి నటుడితో మీనా పరిచయం- చింతామణికే మీనా కమిషన్- బాలు డ్రైవింగ్ స్కూల్ ఐడియా

Gunde Ninda Gudi Gantalu Serial May 19th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ మే 19వ ఎపిసోడ్‌ అదిరిపోయింది. రోహిణి, ప్రభావతి ఇద్దరికి మీనా ఇచ్చిపడేసింది. 40 లక్షల్లో ప్రభావతి కమిషన్ ఎంత అని, జాగ్రత్తగా మాట్లాడమని వార్నింగ్ ఇస్తుంది. బ్రహ్మముడి సీరియల్ నటుడుగా కిరణ్ పాత్ర ఎంట్రీ ఇస్తుంది.

Published on: May 19, 2026, 07:43:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో బాలుకు తనమీద అసూయ అని మనోజ్ చెప్పడంతో మీనా విరుచుకుపడుతుంది. మనోజ్, రోహిణి ఇద్దరికి ఇచ్చిపడేస్తుంది. ఆ షాపు తక్కువ ధరకు బాలునే పెట్టించిందని, మళ్లీ పార్కులో ఎక్కడ మనోజ్ పడుకోవాల్సి వస్తుందనో సత్యంని యజమానిగా కూర్చోబెట్టారని మీనా అంటుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మే 19 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ మే 19 ఎపిసోడ్

అత్తపై తిరగబడిన మీనా

మావయ్య గారి కష్టాన్ని తీసుకుని షాప్ పెట్టుకున్నారు. బాలు చిటిక వేసి ఆ కుర్చీలో కూర్చోగలడు. లేదా రవిని కూర్చొబెట్టగలడు. ఆ షాప్ మీద వచ్చిన డబ్బును ఖర్చు అయిపోయింది. ఇక మీకు ఏ సంబంధం లేదని కూడా అనగలడు. కానీ, గౌరవంగా ఇంటి యజమానిని షాప్ ఓనర్‌గా కూర్చోబెట్టాడని శ్రుతి మద్దతు ఇస్తుంది. నీకు ఏం తెలుసుని మాట్లాడుతున్నావ్ అని ప్రభావతి అంటుంది.

మీకు ఏం తెలియదని ఇంకా వెనుకేసుకొస్తున్నారు. మీరు ఇలా చేయవట్టే అలా తయారయ్యాడు. క్యారేజీలు నాతో కట్టించి పార్కులో పడుకో నాన్న అని పంపించారు. మావయ్య కష్టార్జితాన్ని తినేసినా కూడా ఇంకా ఆ కొడుకే గొప్ప, ఆ కోడలే గొప్ప అని మీనా అత్తను అంటుంది. ఏయ్ అని ప్రభావతి అంటే.. ఆ ఏంటీ.. ఏంటీ.. అని అత్త ప్రభావతిపై తిరగబడుతుంది మీనా.

మీరు చెడగొట్టి ఆయన్ను తయారు చేశారు. ఆయనకు తోడు నేరాలు చేయించే పెళ్లాం ఒకతి దొరికింది అని మీనా అంటే.. రోహిణి అరుస్తుంది. ఆ ఏంటీ. ఇవాళ మావయ్య గారు సీటులో లేకుంటే మీరు పోలీసులకు పట్టించేవాళ్లు. అప్పుడు నేరస్థులుగా ముద్రపడి బయటకు వచ్చేవాళ్లు. మావయ్య గారే లేకుంటే ఆ ముంబే ముఖేష్ మనోజ్ డీలర్‌షిప్ తీసేసి షాప్‌ను వేలం వేసేవాడు .అని మీనా అంటుంది.

అర్థమైందా వదినా. అది మీ పొజిషన్. బాలు అన్నయ్య తలుచుకుంటే మేమిద్దరమే కూర్చునేవాళ్లం. మీరు తప్పుకుని మా నలుగురికి అప్పచెప్పి ఉంటే ఈపాటికి నాలుగు బ్రాంచ్‌లు చేసేవాళ్లం అని రవి అంటాడు. విన్నావా మనోజ్. సరిగ్గా లేకా డ్రైవర్లు, వంటవాళ్లు కూడా చెలరేగిపోతున్నారు అని రోహిణి అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. ఏమన్నావమ్మా.. మళ్లీ అను. మరోసారి వినాలి. ఇంకా అంటున్నావా. దీనంతటికి కారణం ఎవరు అని సత్యం వారిస్తాడు.

తవ్వితే ఎన్ని రహస్యాలు బయటపడతాయో

ఏంటీ డ్రైవర్లు, వంటవాళ్లా. మరి మీ బ్రతుకేంటీ. దొంగ బతుకా, మోసగత్తే బతుకా. నీకో తండ్రి ఉంటాడు. కానీ, కనపడడు. నీకో ఊరు ఉంటుంది. కానీ వెళ్లవు. తవ్వితే ఎన్ని రహస్యాలు బయటపడతాయో తెలియదు. మీ ఆయన పార్కులో పడుకున్నప్పుడు మీకు తిండి పెట్టింది ఆ డ్రైవరే అని మీనా అంటుంది. అసలు రోహిణి అన్నదాంట్లో తప్పేముందని ప్రభావతి అంటే.. నోరుమూయు ప్రభా అని సత్యం వారిస్తాడు.

నువ్వో తల్లివేనా, ఆడదానివేనా. ఇంకా రోహిణినే సమర్థిస్తున్నావా. అరేయ్ బాలు వీళ్లు ఎవరితో కాదు. ఆ 30 లక్షలు ఎలాగైనా పట్టుకురా అని సత్యం అంటాడు. సరేనని బాలు అంటాడు. తర్వాత అంతా వెళ్లిపోతారు. మీనాను పిలిచి బాలును రెచ్చగొట్టి పంపిస్తున్నావా అని ప్రభావతి అంటే.. ఒక్క డౌట్. వాళ్లు ఎత్తుకెళ్లిన 40 లక్షల్లో మీ వాటా ఎంత. మీకు కమిషన్లు తీసుకోవడం అలవాటేగా. ఈ విషయం కూడా చెప్పి మా ఆయన్ను మరింత రెచ్చగొడతాను. ఇంకోసారి జాగ్రత్తగా మాట్లాడండి అని అత్త ప్రభావతికి మాస్ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది మీనా.

అది వాటే సీన్ అనేలా ఉంటుంది. తర్వాత బాలు వచ్చి మా అమ్మ తర్వాత నిన్ను అనేందుకు రోహిణి కూడా తయారైందని, శ్రుతిని మాత్రం మా అమ్మ అనలేదని వెటకారంగా మాట్లాడుతాడు. వీళ్లకు నేను కామెడీ పీస్ అయిపోయానని రోహిణి అనుకుంటుంది. వీళ్లు ముగ్గురు కలిస్తే అమ్మో అని ప్రభావతి భయపడుతుంది. 30 లక్షలు మోసం చేసినవాడి ఇంటికి ఓ టీవీ యాక్టర్ వెళ్తాడట. వాడి ఇంటికి నువ్వు పూలు అమ్మేదానిలా వెళ్లి, అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో చూసి చెప్పు అని బాలు అంటాడు.

బ్రహ్మముడి నటుడి ఎంట్రీ

ముందు అనుమానించినా తర్వాత మీనా ఒప్పుకుంటుంది. చాలా అవమానం జరిగిందని మనోజ్ ఫీల్ అవుతాడు. అందరిముందు పోయిన పరువు తిరిగి తెచ్చుకోవాలంటే ఆ 30 లక్షలు తీసుకొచ్చి మావయ్య చేతికి ఇవ్వాలి. అప్పుడు అంతా గౌరవిస్తారు అని రోహిణి అంటుంది. అసలు ఇల్లు కొనకుండా ఉండాల్సింది, 5 కోట్లది 3 కోట్లకే వస్తుందంటే అంతా అనుమానించారు. కానీ, మనమే వినలేదు. అసూయ అని మాటలు అన్నామని రోహిణి అంటుంది.

ఇప్పుడు వాళ్లను ఎలా పట్టుకోవడం. డబ్బుకోసం మీ నాన్నను అడగచ్చుగా అని మనోజ్ అంటాడు. మాట్లాడితే మా నాన్న నాన్న అంటావ్. నాలుగు రోజులు కష్టపడితే వాడు దొరుకుతాడని రోహిణి అంటుంది. మరోవైపు సీరియల్ యాక్టర్ కిరణ్ తన చెల్లి పెళ్లి ఉందని, టీవీ ఇండస్ట్రీలో పాపులర్ వాళ్లు అంతా వస్తారని, మంచి తెలుగింటి భోజనం కావాలని లిస్ట్ చెబుతాడు. కిరణ్ దగ్గరికి చింతామణి వస్తుంది.

మీ ఇంట్లో పెళ్లి ఉందని తెలిసింది. మేము ఫ్లవర్ డెకరేషన్ చేస్తాం అని మోడల్స్ చూపిస్తుంది చింతామణి. చాలా బాగున్నాయి. నేను ఖర్చు మాత్రమే పెడతాని. మిగతా వన్ని మా చెల్లి చూస్తుందని, డెకరేషన్ కూడా మా చెల్లే చూస్తుందని, మీ నెంబర్ ఇచ్చి వెళ్లండని కిరణ్ అంటాడు. సరేనని చింతామణి అంటుంది. తర్వాత సర్ మీరు బ్రహ్మముడి సీరియల్‌లో యాక్ట్ చేస్తారుగా మీతో సెల్ఫీ తీసుకుంటానని చింతామణి అసిస్టెంట్ అంటాడు.

చింతామణికి మీనా కమిషన్

బ్రహ్మముడి సీరియల్ నటుడు కిరణ్ సెల్ఫీ ఇస్తాడు. బయటకొచ్చిన తర్వాత అసిస్టెంట్‌ను కొడుతుంది చింతామణి. ఎంత గొప్పవాళ్ల దగ్గరికి వెళ్లిన సరే నన్ను తక్కువ అయ్యేలా చేయకని వార్నింగ్ ఇస్తుంది. అంతలో అక్కడికి మీనా వస్తుంది. చింతామణి చూస్తుంది. మీనా లోపలికి వెళ్తుంది. కిరణ్ ఒక్క నిమిషం అని లోపలికి వెళ్తాడు. ఇతన్ని చూస్తే సంస్కారంగా కనిపిస్తున్నాడు. అలాంటి మోసగాళ్లతో ఎలా పరిచయం, ఎలా ఆ విషయం రాబట్టాలి అని మీనా అనుకుంటుంది.

మీనాకు వాటర్ ఇస్తాడు కిరణ్. తనగురించి మీనా చెప్పుకుంటుంది. మీకు ఏ ఫంక్షన్ ఉన్న పూలు తీసుకొస్తానని మీనా చెబుతుంది. రోజు ఫ్రెష్ పూలకోసం చాలా దూరం వెళ్లాల్సి వస్తుందని, మీరే డోర్ డెలివరి చేస్తానంటే ఇంకా మంచిదని కిరణ్ అని మీనా నెంబర్ తీసుకుంటాడు. తర్వాత మీనాను ఆపి కిరణ్ చెల్లి పెళ్లి డెకరేషన్ ఆర్డర్ కోసమే వచ్చావని తెలుసు. నా జోలికి రాకు అని మీనాకు తెలియని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది చింతామణి.

అది విన్న మీనా ఏం మాట్లాడుకుండా లోపలికి వెళ్లి వస్తుంది. నేను కేవలం పూజల కోసమే పూలు ఇద్దామని వచ్చాను. కానీ, పెళ్లి ఉందని సమాచారం ఇచ్చారు. నేను వెళ్లి అడిగాను. నీకో నాకో తేలుతుంది. ఇలాగే ఇన్ఫర్మేషన్ ఇస్తే కమిషన్ ఇస్తాను అని మీనా వెళ్లిపోతుంది. దాంతో చింతామణి అవమానంగా ఫీల్ అవుతుంది. మరోవైపు రాజేష్ దగ్గరికి బాలు వెళ్తాడు. ట్రిప్స్‌కి ఎవరు రావట్లేదు. ఇలాగే ఉంటే మనకు కష్టం. ట్రిప్‌లతోపాటు ఇంకేదైనా చేయాలని బాలు అంటాడు.

బాలు డ్రైవింగ్ స్కూల్ ఐడియా

డ్రైవింగ్ స్కూల్ పెడదామని, ఉదయం, సాయంత్రం చెబితే చాలు అని బాలు అంటాడు. ఒకడు డ్రైవింగ్ స్కూల్ తీసేస్తున్నాడు. కార్లన్ని రెడీగా ఉన్నాయని రాజేష్ చెబుతాడు. ఇంతలో మీనా వస్తుంది. డ్రైవింగ్ స్కూల్ గురించి చెబితే మీనా మంచి ఐడియా అంటుంది. ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తారు. టీవీ యాక్టర్ మంచోడిలా ఉన్నాడని మీనా అంటుంది. ఈసారి ఇద్దరం కలిసి వెళ్దామని బాలు అంటాడు.

మరోవైపు విద్య స్కూటీపై వెళ్తుంటే ఇద్దరు చూసి సూపర్ ఫిగర్ అని వెంటపడతారు. అక్కడే ఉన్న బాలు ఫ్రెండ్ తమ్ముడు అది చూసి ఫాలో అవుతాడు. విద్య నుడుము తాకి పోతారు పోకిరీలు. కానీ, అప్పుడే బాలు ఫ్రెండ్ తమ్ముడు రావడంతో అతనే నడుము తాకాడనుకుని చెంపదెబ్బ కొడుతుంది విద్య. చెప్పిన వినకుండా వార్నింగ్ ఇచ్చి పంపిస్తుంది. అదంతా చూసిన పక్కవాళ్లు వచ్చి నిజం చెబుతారు.

ఆ అబ్బాయి నిన్ను కాపాడటానికి వచ్చి చెంపదెబ్బ తిని వెళ్లిపోయాడని వారు అంటారు. దాంతో విద్య చాలా ఫీల్ అవుతుంది. మరోవైపు ప్రభావతి ధీర్ఘంగా ఆలోచిస్తుంటే మనోజ్, రోహిణి వస్తారు. ఇప్పుడు నాకు ఎవరు భయపడకపోడానికి కారణం మీ ఇద్దరే అని తిడుతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More