Gunde Ninda Gudi Gantalu Today Episode: తినేదగ్గర బిక్షగాడిలా రోహిణి- చింతామణికి మీనా మాస్ వార్నింగ్- గట్టిగా కొడతానంటూ!

Gunde Ninda Gudi Gantalu Serial May 14th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ మే 14వ ఎపిసోడ్‌లో రోహిణి తినేందుకు భోజనానికి వస్తే ప్రభావతి కూర్చోనివ్వదు. దాంతో కామాక్షి ఇంటికి వెళ్లిన రోహిణి తను రాసి ఇచ్చినట్లుగా ప్రభావతితో చెప్పమని స్క్రిప్ట్ ఇస్తుంది. చింతామణికి మీనా మాస్ వార్నింగ్ ఇస్తుంది.

Published on: May 14, 2026, 07:43:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో అందరూ భోజనం చేస్తుంటే మనోజ్ వచ్చి కూర్చొంటాడు. తర్వాత రోహిణి వస్తుంది. ప్రభావతి కోపంగా చూస్తుంది. శ్రుతి కూర్చోమంటుంది. కానీ, ప్రభావతి మాత్రం కోపంగా లేవమని చెబుతుంది. రోహిణికి కూడా ఆకలి వేస్తుందని మనోజ్ అంటే.. మొహం పచ్చడి చేస్తాను. నువ్వు తిను అని బెదిరిస్తుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మే 14 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ మే 14 ఎపిసోడ్

బిక్షగాడిలా రోహిణి

రోహిణి అలాగే చూస్తే.. మా ప్లేట్ వైపు చూస్తుందేంటీ.. పక్కకు వెళ్లమని చెప్పు అని మనోజ్‌తో అంటుంది ప్రభావతి. ఇంతలో అమ్మా ఆకలేస్తుంది, బిచ్చం పెట్టండమ్మా అని బిక్షగాడు అడుక్కుంటాడు. చేయి ఖాళీ లేదు, పక్కకు వెళ్లు అని ప్రభావతి అంటుంది. సేమ్ రోహిణిని అన్నట్లుగానే అంటుంది. అత్త ప్రభావతి తనను తినేదగ్గర బిక్షగాడిలా చూసిందని అవమానంతో, బాధగా తల దించుకుంటుంది రోహిణి.

తినడానికి వచ్చినవాళ్లను లేపడం పద్ధతి కాదు అత్తయ్య అని మీనా అంటే నీ పని నువ్వు చూసుకో అని ప్రభావతి అంటుంది. చిన్న పిల్లల ఆట గుర్తొస్తుంది. ఓ బొమ్మతో ఆడుకున్నంత సేపు ఆడుకుని అది విరిగోపోయేసరికి పక్కకు పాడేస్తారు. అలాగే ఉందని బాలు అంటాడు. వెటకారాలు ఆపు అని మనోజ్ అంటే.. అందరికి అర్థమయ్యేలా చెప్పాడు ఇందులో వెటకారం ఏముందని శ్రుతి, రవి అంటారు.

అంతా వీళ్ల వల్లనే, ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయిందని మనోజ్ అంటే.. మావయ్య గారి డబ్బు మింగింది మేము కాదు. నువ్వు కంచంలో తినేది నేను వండిందే అని మనోజ్‌కు గట్టి కౌంటర్ ఇస్తుంది మీనా. రోహిణిని వచ్చి మీనా తినమంటే మధ్యలో నీ బోడిపెత్తనం ఏంటని ప్రభావతి తిడుతుంది. రవి కూడా వచ్చి తినమంటాడు. వద్దు, అత్తయ్య మాటే వింటానని రోహిణి అంటుంది. ఇంకా నంగనాచిలా నాటకాలు ఆడకు. పక్కకు వెళ్లి నిలబడని ప్రభావతి వారిస్తుంది.

కామాక్షి ఇంటికి రోహిణి

మనోజ్ గాడు కూడా తప్పు చేశాడుగా. వాన్ని ఎందుకు తిననిస్తున్నావ్. వాడు చూడు బర్రెలా ఎలా తింటున్నాడో అని బాలు అంటాడు. నాకోసం ఎవరు గొడవ పడొద్దు. అత్తయ్య కోపం తగ్గేవరకు నేను బయటే తింటానని అంటుంది రోహిణి. హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకున్న రోహిణి వచ్చి నాకు అమ్మ ఉంటే అర్థం చేసుకునేదు. నాకు ఇక్కడ ఎవరు లేరని వెళ్లిపోతుంది. మనోజ్ ఫీల్ అవుతాడు. ఆగి చూసుకుంటూ రోహిణి వెళ్లిపోతుంది.

కామాక్షి ఇంటికి వెళ్తుంది రోహిణి. ప్రభావతి మాటలు తలుచుకుంటూ ఏడుస్తుంది రోహిణి. అన్నం తినమని కామాక్షి ప్లేట్ తీసుకొస్తే వద్దని, తినాలని లేదని రోహిణి చెబుతుంది. కష్టాలను వచ్చాయని మనల్ని మనం శిక్షించుకోకూడదని కామాక్షి ఓదారుస్తుంది. రోహిణిని ప్రభావతి ఎలా చూసుకుందో చెబుతుంది కామాక్షి. రోహిణి మాటలకు కామాక్షి కూడా చాలా బాధ పడుతూ ఏడుస్తుంది. నిన్ను ఇలా చూడలేక ఏడుస్తున్నానంటుంది.

తను చేసిన తప్పును సరిదిద్దుకుని చెబుతుంది రోహిణి. అత్తయ్యను అమ్మలా చూసుకున్నా. కానీ, అత్తయ్య మాట్లాడట్లేదు. అది చాలా బాధగా ఉందని, ఆ ఇంట్లో ఎవరు నమ్మట్లేదు, ఆ ఇంట్లో ఉండాలనిపించట్లేదని ఏడుస్తుంది రోహిణి. ఒక్కసారి బయటకు వెళ్తే మళ్లీ వెళ్లలేం అంటుంది కామాక్షి. అత్తయ్య కోపం తగ్గేవరకు నేను వెళ్లను అని రోహిణి అంటే.. ప్రభావతితో నేను మాట్లడతాను, నిజానికి తన కోపమంటే నాకు భయమే అని కామాక్షి అంటుంది.

స్క్రిప్ట్ రాసిచ్చిన రోహిణి

మీరేం కంగారుపడకండి. అత్తయ్యతో ఏం మాట్లాడాలో నేను రాసి ఇస్తాను. అది చెప్పండి చాలు అని పెన్ తీసి రోహిణి రాసి ఇస్తుంది. అది చూసి అయ్యో పిచ్చిదానా ఇంత బాధలో ఎంత బాగా ఆలోచిస్తున్నావని కామాక్షి అంటుంది. రోహిణి నవ్వుతుంది. మీరే నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారని చెప్పిన రోహిణి వెళ్తుంది. ఓ ఫంక్షన్ హాల్‌కు డెకరేషన్ డెమోలను బాలు, మీనా తీసుకెళ్తారు. బాలును మీనా వెళ్లమంటుంది.

బాగా మాట్లాడు, ఈ ఆర్డర్ నీకే రావాలని బాలు వెళ్లిపోతాడు. మేనేజర్‌తో మీనా మాట్లాడుతుంది. ఇంతలో చింతామణి వస్తుంది. మీనాతో గొడవకు దిగుతుంది. మీ సమస్య ఏంటీ, మీ పని చూసుకోండి. నా పనికి అడ్డురాకండి అని మీనా అంటుంది. నా ఏరియాకు వచ్చి నన్నే అడ్డు రాకంటావా అని చింతామణి అంటుంది. నాకు నచ్చిన చోటుకు వెళ్లి పని అడుగుతాను. వాళ్లకు నచ్చితే ఇస్తారు. ఇందులో మీ ఏరియా ఏంటీ అని మీనా గట్టిగానే చెబుతుంది.

నన్ను కాదని నీకు ఎవరు ఆర్డర్ ఇస్తారో చూస్తాను అని చింతామణి అంటుంది. నా డిజైన్ నచ్చితే కచ్చితంగా నాకే ఇస్తారు. నన్ను ఎవరు ఆపలేరని మీనా అంటుంది. దాంతో చింతామణి అసిస్టెంట్స్ వెళ్లి మీనా డెకరేషన్ డెమోలను కింద పడేసి విరగ్గొటేస్తారు. మీనా అరుస్తుంది. చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఇక్కడ మా ఆయన ఉండి ఉంటే ఇలా మాట్లాడేవారు కాదని మీనా అంటుంది.

మీనా మాస్ వార్నింగ్

వచ్చి ఏం చేస్తాడు. నా ఏరియాకు వచ్చి నా బిజినెస్‌లు లాక్కుని నాతోనే గొడవ పడుతున్నావా అని చింతామణి అంటుంది. మీ పని మీరు చూసుకుంటే మంచిది, లేకుంటే అని మీనా అంటే.. ఏం చేస్తావ్, కొడతావా, కొడతావా దా కొట్టు అని చింతామణి రెచ్చగొడుతుంది. మిమ్మల్ని నా పనితో కొడతాను. చాలా గట్టిగా కొడతాను. అది చూసి మీరు భయపడతారని మాస్ వార్నింగ్ ఇస్తుంది మీనా. చూపించు అని చింతామణి అంటుంది.

చూపిస్తాను. మీకన్నా ఎక్కువ ఎదిగి కనిపించి చూపిస్తాను అని మీనా వెళ్లిపోతుంది. మరోవైపు ప్రభావతితో కామాక్షి మాట్లాడుతుంది. నువ్వు రావట్లేదని నేనే నాలుగు స్టెప్పులు నేర్పిస్తున్నానని కామాక్షి చెబుతుంది. ప్రభావతి చిరాకుగా మాట్లాడితే.. ఏమైందని కామాక్షి అడుగుతుంది. నేను నమ్మినవాళ్లే నన్ను మోసం చేశారని రోహిణి చేసింది అంతా చెబుతుంది ప్రభావతి.

రోహిణి మంచి అమ్మాయే, నీ మీద చాలా ప్రేమ చూపిస్తుందని కామాక్షి అంటుంది. ఇదే కరెక్ట్ టైమ్ రోహిణి ఇచ్చిన స్క్రిప్ట్ చూసి చెప్పేయాలనుకుంటుంది కామాక్షి. రోహిణి రాసిచ్చిన స్క్రిప్ట్ చూస్తూ కామాక్షి తడుముకుంటూ చెబుతుంది. అలా తడుముకుంటూ చెబుతావేంటని ప్రభావతి అంటే.. అర్థమైనట్లుందని ఆ స్క్రిప్ట్ పక్కకు పడేసి రోహిణి గురించి మంచిగా చెబుతుంది కామాక్షి.

ఆస్తి వీక్‌నెస్ మీద

మనోజ్ గాడు ఖాళీగా ఎన్నాళ్లు ఉంటాడని అలా చేసింది. వాడు బాగు పడ్డాడని సంతోషించక, మోసం చేసిందని అంటే ఎలా. మనోజ్ అంటే రోహిణికి చాలా ఇష్టం. నువ్వు ఇలాగే బాగా చూసుకోకుంటే ఏదో ఒక రోజు నీకు రోహిణి దూరమైపోతుంది. వాళ్లకు ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసు కదా. రేపు వాళ్ల నాన్న ఆస్తి అంతా తనకు రాసిచ్చినప్పుడు నాతో సరిగా ఉండలేదని నిన్ను వదిలేసి మనోజ్‌ను తీసుకెళ్లిపోతే ఏం చేస్తావ్ అని రోహిణి అంటుంది.

దాంతో ప్రభావతి షాక్ అయిపోతుంది. అలా ప్రభావతి ఆస్తి అనే వీక్‌నెస్ మీద కొడుతుంది రోహిణి. కొడుకులు పెళ్లాయ్యాక మారుతారు. అందుకే రోహిణిని బాధపెట్టకు. భవిష్యత్తు ఆలోచించి ఎలా ఉండాలో నిర్ణయించుకో అని కామాక్షి చెబుతుంది. మరోవైపు సత్యంతో రోహిణిని అలా వదిలేయలేమని, మీరైనా మాట్లాడండని మీనా అంటుంది. అత్తయ్య కనీసం కలిసి భోజనం చేయనివ్వట్లేదని మీనా అంటుంది.

కొన్నిరోజులు పోతే అన్ని సర్దుకుంటాయని సత్యం అంటుంది. మీరు ఓసారి మాట్లాడండని సత్యంతో మీనా అంటుండగా ప్రభావతి వచ్చి ఏం చెబుతున్నావ్. మా మధ్యలో గొడవలు పెట్టాలని చూస్తున్నావా అని అంటుంది. రోహిణి గురించి చెబుతుంది మీనా. అది తినకుంటే నీ కడుపు కాలిపోతుందా. నా మీద చాడీలు చెప్పడం తప్పా నీకు ఇంకా పని ఉండదా అని ప్రభావతి అంటుంది.

నోరు పారేసుకున్న అత్త

అలా నోరు పారేసుకుంటావేంటని సత్యం అంటారు. మనోజ్, రోహిణిని ఎందుకు మాట్లాడుకోనివ్వట్లేదు. మనోజ్ గాడిని ఎందుకు నువ్వు అనట్లేదు అని సత్యం అంటాడు. రోహిణి చెప్పిందనే నాకు చెప్పేదని ప్రభావతి అంటుంతది. ఇద్దరు తప్పు చేశారు. అలా ఒక్కరినే తప్పుపడితే మహా పాపం అని సత్యం అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More