Gunde Ninda Gudi Gantalu Today Episode: రోహిణి మోసం తెలిసి నీళ్లలోకి తోసిన ప్రభావతి- మనోజ్ విల్లానే కొన్న లవర్ కల్పన!
Gunde Ninda Gudi Gantalu Serial May 5th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ మే 5వ ఎపిసోడ్‌లో రవిని మనోజ్ 70 లక్షలు అడిగితే కోప్పడుతాడు. మనోజ్ ఎలాగైనా విల్లా కొంటానని ఛాలెంజ్ చేస్తాడు. రోహిణి ఇంతకాలం చేసిన మోసం తెలిసి పీక పట్టుకుంటుంది. లాక్కెళ్లి స్విమ్మింగ్ పూల్‌లో పడేస్తుంది.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రోహిణి మాట్లాడిన తీరు చూసి తన ప్రవర్తనపై అనుమానంగా ఉందని మీనా డౌట్ పడుతుంది. నాకు అదే అనుమానం కలిగింది, కనిపెడదామని బాలు అంటాడు. మరోవైపు మనోజ్ స్వార్థం గురించి రవి, శ్రుతి మాట్లాడుకుంటారు.

బాలునే కరెక్ట్ మాట్లాడుతున్నాడు
నిజానికి బాలు కరెక్ట్ మాట్లాడుతున్నాడు. పెళ్లయిన కొత్తలో బాలు మీద కోపం వచ్చేది కానీ, తను మాట్లాడేది కరెక్ట్ అని శ్రుతి అంటుంది. ఇంతలో మనోజ్, రోహిణి వస్తారు. నిన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఒప్పుకోకు అని రవికి చెబుతుంది శ్రుతి. మనోజ్ వచ్చి తన పరిస్థితి అర్థం చేసుకోమని అంటే నా నుంచి మాత్రం 70 లక్షలు ఎలా వస్తాయని రవి అంటాడు. మీ మావయ్యను అడగమని మనోజ్ చెబుతాడు.
దానికి రవి షాక్ అవుతాడు. వాళ్లకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని వచ్చాం. ఇప్పుడు డబ్బు, ఆస్తి అంటే ఛీ కొడతారు అని శ్రుతి అంటుంది. ఎంతైనా నువ్వు ఒక్క కూతురువేగా, ఆ ఆస్తిలో నీకు హక్కు ఉందిగా, ప్లీజ్ మిమ్మల్ని బయటపడేయ్ అని రోహిణి అడుగుతుంది. వాళ్లంతట వాళ్లు ఇస్తే ఓకేగానీ నేను వెళ్లి అడగలేనని శ్రుతి అంటుంది. కావాలంటే వడ్డీకి ఇస్తామని, ఎలాగైన అడగమని మనోజ్ అంటాడు.
మీరు ఆస్తి గురించి అడిగితే మావయ్య, అత్తయ్య ఎలా బాధపడ్డారో వారు కూడా బాధపడతారుగా. అలా నేను అడగలేనని శ్రుతి అంటుంది. బాలు గాడి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. నువ్వైనా హెల్ప్ చేయరా అని మనోజ్ అంటాడు. ఏంటీ బాలు అన్నయ్య ఏం చేశాడని అంటున్నావా. అసలు నువ్వేమైనా చేశావా. ఇంతకీ నాకు ఏమైనా హెల్ప్ చేశావా. బాలు అన్నయ్య డబ్బులు పంపించేవాడు, అవసరం అయితే అడుగురా అనేవాడు. కనీసం నువ్వు ఓ చొక్కా అయిన కొనిచ్చావా అని నిలదీస్తాడు రవి.
మనోజ్ ఛాలెంజ్
నువ్వు ఎవరికి హెల్ప్ చేయవు. సిగ్గు లేకుండా వచ్చి నన్ను వాళ్లను అడగమంటున్నావా అని రవి అంటాడు. సరేరా మీరు ఎవరు నాకు హెల్ప్ చేయరని అర్థమైంది. నాకు టైమ్ వచ్చినప్పుడు చెబుతాను అని కోపంగా వెళ్లిపోతాడు మనోజ్. వీళ్లను నా అన్నదమ్ములా. వాళ్ల మొహం చూడాలంటేనే చిరాకుగా ఉందని మనోజ్ అంటాడు.
ఒకరు ఎదుగుతున్నారంటే బయటే కాదు ఇంట్లోవాళ్లు కూడా అసూయ పడుతుంటారు. వాళ్లకు మనలా ఎదగడం చేతకాదు అందుకే పడి ఏడుస్తున్నారు. స్వార్థంగా ఆలోచించేది వాళ్లు అని రోహిణి అంటుంది. నేను ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారు. నేను దీన్ని ఛాలెంజింగ్‌గా తీసుకున్నా. ఈ ఇల్లు వదిలే ప్రసక్తే లేదు. ఎలాగైనా ఇంటిని దక్కించుకుని గెలవాల్సిందే అని మనోజ్ అంటాడు.
ఏదో ఒక దారి దొరకుతుంది. మీ అమ్మనాన్నలు దూరం పెట్టిన నేను నీకు తోడుంటాను. ఇక నుంచి మనం ఎవరి గురించి ఆలోచించకూడదని రోహిణి అంటుంది. మీ నాన్నను ఒకసారి అడుగు. మీ నాన్న ఇస్తే ఏ కుక్క కాళ్లు పట్టుకోనవసరం లేదని ఇన్‌డైరెక్ట్‌గా రవి, బాలును అంటాడు మనోజ్. అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ నా మెడకే వస్తుందే అని రోహిణి భయపడుతుంది. సొంత వాళ్లే పట్టించుకోలేదు. నాన్న పార్టనర్స్ మోసం చేస్తే జైళ్లో ఉన్నారు. అడగలేను అని రోహిణి అంటుంది.
సహాయం చేసేది ముంబై ముఖేష్
ఇప్పుడు మనకు సహాయం చేసేది ముంబై ముఖేష్ ఒక్కడే. మనం బిజినెస్ పెంచుకుంటే మనపై నమ్మకం కుదురుతుందని మనోజ్ అంటాడు. అయితే ముందు సేల్స్ పెంచడం గురించి ఆలోచించాలని రోహిణి అంటుంది. ఎలాగైనా ఈసారి గెలిచి చూపిస్తాను. అందరు ముక్కు మీద వేలు వేసుకునేలా చేస్తాను అని మనోజ్ అంటాడు. మరోవైపు ఇల్లు గురించి బాలు, మీనా మాట్లాడుకుంటారు.
ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు మంచి మనుషులు, నచ్చినవాళ్లతో ఉండేది అని మీనా అంటుంది. మనోజ్ స్వార్థం గురించి మాట్లాడుకుంటారు. అత్తయ్య కూడా వద్దన్నారని మీనా ఆశ్చర్యపోతుంది. వాళ్లకు ఆ ఇంట్లో మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. మా నాన్న అయితే ఆ ఇల్లు విడిచిపెట్టి అస్సలు రాడు అని బాలు అంటాడు. తర్వాత బాలు అడిగితే మీనాకు మడ్డువ ఇల్లు అంటే చాలా ఇష్టమని చెబుతుంది.
ఇంతలో బాలుకు ట్రిప్ వస్తుంది. తర్వాత ఆరుబయట కూర్చుని బాలు, మీనా సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటారు. మరోవైపు బయటకు వెళ్దామని శ్రుతి అంటే.. ఇది కొత్త ప్లేస్, రిస్క్ చేయడం వద్దని రవి అంటాడు. దానికి శ్రుతి హర్ట్ అయితే భార్యను వెనుక నుంచి హగ్ చేసుకుంటాడు రవి. తర్వాత నాకు జనం ఎక్కువగా ఉండే ఇల్లు అంటే ఇష్టమని, గ్రేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్‌మెంట్ తీసుకుని ఉందామని శ్రుతి అంటుంది.
శ్రుతికి రవి లిప్ కిస్
తర్వాత రవి రొమాంటిక్‌గా మాట్లాడి శ్రుతిని లాక్కుని సడెన్‌గా లిప్ కిస్ పెడతాడు. మరోవైపు పడుకున్న రోహిణిని అర్ధరాత్రి ప్రభావతి లేపుతుంది. రోహిణి బెడ్ రూమ్ నుంచి బయటకు లాక్కొచ్చి మీ గురించి ఓ పచ్చినిజం తెలిసిందని కోపంగా చూస్తుంది ప్రభావతి. దాంతో రోహిణి షాక్ అయిపోతుంది. మీ నాన్న జైళ్లో ఉంది, మీ మావయ్యకు డబ్బున్నది అంతా అబద్ధమే కదా అని నిలదీస్తుంది ప్రభావతి.
నన్ను బురిడీ కొట్టించాలని చూస్తున్నావా, ఇంకా మోసం చేస్తున్నావా. ఇందాకా డబ్బులు అడిగినట్లు కవర్ చేసింది విద్యతోనే అని నాకు తెలుసు. నువ్వు పెద్ద బిగ్ షాట్‌వి అని మోసం చేశావ్ కదే. నువ్వు ఒక బండరాయివని ఇప్పుడే తెలిసిందే. అబ్బబ్బా ఎంత నాటకం ఆడావే. చెప్పు మమ్మల్ని ఎందుకింత మోసం చేశావో చెప్పు అని రోహిణి పీక పట్టుకుని పిసికేస్తుంది ప్రభావతి. దాంతో రోహిణి నిజం చెప్పేస్తుంది.
అసలు నాన్నే లేడని, అంతా అబద్ధమని, పేదింటి అమ్మాయినని, డబ్బున్న అమ్మాయిలా కలరింగ్ ఇచ్చాను అని నిజం ఒప్పుకుంటుంది రోహిణి. నమ్మకద్రోహం చేశావన్నమాట అని ప్రభావతి కోప్పడుతుంది. దాంతో అత్త కాళ్లు పట్టుకుని ఏడుస్తుంది రోహిణి. ఇంత మోసం చేసిన నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదని రోహిణి మెడ పట్టుకుని విల్లా స్విమ్మింగ్ పూల్‌లోని నీళ్లలోకి తోసేస్తుంది ప్రభావతి. నీళ్లలో రోహిణి ఊపిరాడక గిలగిల కొట్టుకుంటుంది.
గిలగిలకొట్టుకున్న రోహిణి
అయితే అదంతా కలగంటుంది రోహిణి. గిలగిల కొట్టుకుంటూనే బెడ్ మీద ఉన్న మనోజ్‌ను తంతుంది రోహిణి. మనోజ్ కింద పడతాడు. రోహిణిని చూసి లేపుతాడు. నిద్రలేచిన రోహిణి ఇదంతా నా కల అని కంగారుపడుతుంది. మంచినీళ్లు తాగుతుంది. ఏదో పీడకల అని చెబితే ఎప్పుడు నీకు ఇవే వస్తాయా అని మనోజ్ పడుకుంటాడు. అత్తయ్యకు నిజం తెలియకూడదని రోహిణి అనుకుంటుంది.
మరుసటి రోజు ఉదయం కెనడా నుంచి మనోజ్ మాజీ లవర్ కల్పన బాలు క్యాబ్‌లో వస్తుంది. రీ ఎంట్రీ ఇచ్చిన కల్పన.. బాలుకు కెనడా చాక్లెట్స్ ఇస్తుంది. మళ్లీ ఎందుకు వచ్చారని బాలు అడుగుతాడు. నేను ఓ ఇల్లు కొన్నాను. రిజిస్ట్రేషన్ వర్క్ ఉందని కల్పన చెబుతుంది. బాలు ఏం మారలేదని కల్పన చెబుతుంది. బాలు లైఫ్ గురించి చెబుతాడు. మీనా పేరు పూలగంప అని పెట్టినట్లు, తనపేరు ముళ్లకంప అని చెబుతాడు.
పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. తర్వాత ఇల్లు రిజిస్ట్రేషన్‌కు మొత్తం కట్టేశాను. కానీ, లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఒకడు (మనోజ్) 45 లక్షలు మోసం చేశాడు. అందుకే కుదర్లేదు. పోయినసారి పోలీస్ స్టేషన్‌లో పెద్ద డిస్కషన్ జరిగింది చూడు అదే అని కల్పన చెబుతుంది. కల్పన ఫ్లాట్ రాగానే బాలు కారు ఆపుతాడు. చాక్లెట్స్ ఇచ్చి కల్పన లోపలికి వెళ్తుంది. బాలు బయట వెయిట్ చేస్తుంటాడు. మనోజ్ కొన్న విల్లానే కల్పన కొన్నట్లు తెలుస్తోంది.
చుడీదార్‌లో ప్రభావతి
మరోవైపు ఎప్పుడు చీరలో ఉండే ప్రభావతి చుడీదార్‌లో సత్యంతో కలిసి రోడ్డుపై నడుస్తుంది. ఇక్కడ అన్ని భలే బాగున్నాయి కదండి అని సత్యంతో అంటుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


