Gunde Ninda Gudi Gantalu Today Episode: మనోజ్ 5 కోట్ల విల్లాకు ముప్పు.. అడ్డు పడిన మీనా, శృతి, రోహిణి.. అలక వీడిన బాలు

Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 29 ఎపిసోడ్ లో మనోజ్ రూ.5 కోట్ల విల్లా ప్లాన్ ఎదురు తన్నేలా కనిపిస్తుంది. కొందామన్న వెళ్తున్న సమయంలో మీనా, రోహిణి, శృతి అడ్డు పడతారు.

Published on: Apr 29, 2026, 07:52:59 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో బాలు, మీనా మళ్లీ కలిసిపోతారు. అటు మనోజ్, రోహిణి కొత్త విల్లా కొనడానికి సిద్ధమవుతారు. కానీ వాళ్లకు అనూహ్యంగా ఇంట్లో వాళ్ల నుంచే అడ్డంకులు ఎదురువుతాయి. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

Gunde Ninda Gudi Gantalu Today Episode: మనోజ్ 5 కోట్ల విల్లాకు ముప్పు.. అడ్డు పడిన మీనా, శృతి, రోహిణి.. అలక వీడిన బాలు
Gunde Ninda Gudi Gantalu Today Episode: మనోజ్ 5 కోట్ల విల్లాకు ముప్పు.. అడ్డు పడిన మీనా, శృతి, రోహిణి.. అలక వీడిన బాలు

మీనా ఫోన్ చేసినా లిఫ్ట్ చేయని బాలు

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (ఏప్రిల్ 29) ఎపిసోడ్ బాలు కోసం మీనా కంగారు పడే సీన్ తో మొదలవుతుంది. అతనికి పదే పదే ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. చివరికి స్విచ్ఛాఫ్ చేస్తాడు. దీంతో మీనా మరింత ఆందోళన చెందుతుంది. అత్త అనుమానించినట్లు ఏదైనా జరిగిందా అని కూడా భయపడుతుంది. అలాంటిదేమీ జరిగి ఉండదని తనకు తాను ధైర్యం చెప్పుకుంటుంది.

బాలుకి క్లాస్ పీకిన సత్యం

బాలు కోసం అటు సత్యం కూడా టెన్షన్ పడుతుంటాడు. ప్రభావతి వచ్చి తిందామని చెప్పినా నీ చేత్తో వడ్డిస్తే అజీర్తి అవుతుందని అంటాడు. అప్పుడే బాలు వస్తాడు. అతన్ని చూడగానే సత్యం క్లాస్ పీకుతాడు. కోడలు ఫోన్ చేస్తే ఎందుకు తీయలేదు.. రోజంతా ట్రిప్ లోనే ఉన్నావా.. మీనా ఉదయం నుంచి ఏమీ తినకుండా నీ కోసం చూస్తోంది.. అయినా ఆమెకు చెప్పకుండా ఎందుకు వెళ్లావ్ అంటూ కొడుకును నిలదీస్తాడు. మీనా పైన ఉంది.. వెళ్లి తీసుకు వచ్చి ఇద్దరూ తినండి అని చెబుతాడు.

బాలుపై మండిపడిన మీనా.. ఫీలైపోయిన బాలు

దీంతో బాలు మేడపైకి వెళ్తాడు. అక్కడ మీనా టెన్షన్ పడుతూ కనిపిస్తుంది. బాలుని చూడగానే ఆమె తెగ మండిపడుతుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు లిఫ్ట్ చేయలేదు.. ఎంత కంగారు పడ్డానో తెలుసా.. ఇంత ఆలస్యం ఎందుకు అయింది అని అడుగుతుంది.

నువ్వు నాకన్నా ఎక్కువ సంపాదిస్తున్నానని అన్నావు కదా.. అందుకే రోజంతా కష్టపడి నీ కంటే రూ.1000 ఎక్కువే సంపాదించానని డబ్బు ఆమె చేతుల్లో పెడతాడు. దీంతో మీనా మరింత మండిపడుతుంది. నేనేదో సరదాకు అంటే అంతలా ఫీలవ్వాలా.. తన వాళ్లు బాగు పడుతుంటే చూసి సంతోషించే మీరే ఇలా చేస్తారా అంటూ బాలు చేతుల్లో డబ్బు పెట్టి వెళ్లిపోతుంది.

అలిగిన మీనా.. కూల్ చేసిన బాలు

మీనా అలిగిన విషయం తెలుసుకొని బాలు తనను తాను తిట్టుకుంటాడు. ఆమె దగ్గరికి వెళ్లి క్షమించమని బతిమాలుతాడు. తినమంటూ వడ్డిస్తాడు. ఆమె వద్దనడంతో తానే స్వయంగా కలిపి తినిపిస్తాడు. ప్రతి ముద్దకు సారీ చెబుతాడు. దీంతో మీనా కూల్ అవుతుంది. ఆ తర్వాత బాలుకి కూడా మీనా తినిపిస్తుంది. ఇద్దరూ మళ్లీ కలిసిపోతారు.

తల్లి ఫొటోకు పూజ చేసిన మనోజ్.. బాలు ఎగతాళి

మరుసటి రోజు ఉదయం దేవుడి పటాల బదులు తన తల్లి దిష్టిబొమ్మకు పూజ చేస్తుంటాడు మనోజ్. ఎవరైనా చూస్తే బాగుండదు అని రోహిణి అంటుంది. ఆమె వల్లే మనకు మంచి జరుగుతోంది కదా అని మనోజ్ అంటాడు. ఇంతలో ప్రభావతి రావడం చూసి వెంటనే ఆ ఫొటో తీసేస్తాడు. దేవుళ్లకు హారతి ఇస్తాడు. అతడు పూజ చేయడం చూసి ప్రభావతితోపాటు ఇంట్లో వాళ్లంతా షాక్ తింటారు. బాలు తనదైన స్టైల్లో ఎగతాళి చేస్తాడు. అటు సత్యం, రవి, శృతి కూడా ఆశ్చర్యపోతారు.

5 కోట్ల విల్లా కొంటున్నట్లు చెప్పిన మనోజ్.. బాలు, రవి డౌట్

దీంతో తాము ఓ గుడ్ న్యూస్ చెప్పాలని అనుకుంటున్నామని మనోజ్ అంటాడు. ఏంటని అడిగితే.. తాము రాజమండ్రిలోని రిచ్ ఏరియాలో విల్లా చూశామని చెప్పాం కదా.. అది కొనేద్దామని అనుకుంటున్నట్లు మనోజ్ చెబుతాడు. ఆ విల్లా విలువ రూ.5 కోట్లు అని చెప్పడంతో అందరూ షాక్ తింటారు. ప్రభావతి మాత్రం తన కొడుకును చూసి తెగ మురిసిపోతుంది. నువ్వు ఎత్తుకు ఎదుగుతావని నాకు తెలుసు అంటూ అతన్ని ముద్దు చేస్తుంది.

అంత డబ్బు ఎక్కడిది అని సత్యం అడిగితే.. ఆ 5 కోట్ల విల్లాను 3 కోట్లకే ఇస్తున్నారని రోహిణి చెబుతుంది. దీంతో బాలు, రవి, శృతి, సత్యం సందేహిస్తారు. అంత తక్కువకు ఇస్తున్నారంటే అందులో ఏదో మతలబు ఉందని అంటారు. ఏం లేదు.. ఓనర్ దుబాయ్ వెళ్తుండటంతో అర్జెంటుగా అమ్మేయాలని తక్కువ రేటుకే ఇస్తున్నాడని మనోజ్ చెబుతాడు.

తుమ్మిన మీనా, రోహిణి, శృతి

3 కోట్లు అయినా సరే ఎక్కడి నుంచి తెస్తావంటే అడ్వాన్స్ గా రూ.30 లక్షలు ఇస్తే చాలు.. ఆ డబ్బు ముంబై ముకేష్ ఇస్తాడని మనోజ్ అంటాడు. ప్రస్తుతానికి ఓనర్ కు రూ.5 లక్షల అడ్వాన్స్ ఇచ్చి వస్తామని మనోజ్, రోహిణి బయలుదేరడానికి వెళ్తారు. అప్పుడే మీనా తుమ్ముతుంది. దీంతో ప్రభావతి మండిపడుతుంది. కాసేపు ఆగండి అంటూ వెళ్లి మిరపకాయలు తెచ్చి మనోజ్ కు దిష్టి తీస్తుంది.

మీనా కావాలనే తుమ్మిందని రోహిణి నిందిస్తుంది. మళ్లీ బయలుదేరుతుండగా రోహిణియే తుమ్ముతుంది. ఆ తర్వాత వరుసగా శృతి, సత్యం కూడా తుమ్ముతారు. అందరూ ఇలా అడ్డు పడుతుండటంతో ప్రభావతిలోనూ అనుమానం మొదలవుతుంది. మీనా కూడా ఇప్పుడే వెళ్లొద్దని చెబుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More