Gunde Ninda Gudi Gantalu Today Episode: 5 కోట్ల విల్లా చూసిన మనోజ్, రోహిణి- మళ్లీ టోకరా- మీనాకు కొత్త విలన్‌గా చింతామణి!
Gunde Ninda Gudi Gantalu Serial April 27th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 27వ ఎపిసోడ్‌లో స్కూల్‌లో సత్యంను చూసిన రోహిణి జాబ్ మానిపించేయాలని అనుకుంటుంది. 5 కోట్ల విల్లాను మనోజ్, రోహిణి చూస్తారు. కానీ, వాళ్లు ఫేక్ ఇంటి ఓనర్స్. మరోసారి ఇల్లు రూపంలో మనోజ్ మోసపోనున్నాడు.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో సత్యంను స్కూల్‌లో బాలు డ్రాప్ చేస్తాడు. మరోవైపు అదే స్కూల్‌కు చింటును తీసుకెళ్తుంది రోహిణి. ఆ స్కూల్‌లో తనంటే అందరికి ఇష్టమని తల్లికి చింటు చెబుతాడు. తన ఫ్రెండ్ బర్తే డ్. వాళ్ల ఇంటికి రమ్మన్నాడు. వెళ్తాను. నా ఫ్రెండ్స్ అందరూ వస్తారని చింటు అంటే.. రోహిణి వద్దంటుంది.

బతిమిలాడిన వినని రోహిణి
నేను ఎందుకు వెళ్లకూడదని చింటు అంటే.. వెళ్లకూడదు అంతే. నేను చెప్పింది వినమని రోహిణి అంటుంది. అయినా చింటు వినడు. తల్లిని బతిమిలాడుతాడు. ఇలా చేస్తే నిన్ను మళ్లీ ఊళ్లో పెడతాను. నిన్ను కలవడానికి మళ్లీ రాను అని రోహిణి అనేసరికి చింటు డల్ అయి సైలెంట్‌గా ఉండిపోతాడు. మరోవైపు స్కూల్‌లో సత్యంను డ్రాప్ చేసిన బాలు జాబ్ చేస్తానని చెప్పేసి అని గోల చేస్తాడు.
సత్యం వినడు. బాలు, సత్యం ఇద్దరు జాబ్ గురించి వాదించుకుంటారు. స్కూల్‌లో సత్యం, బాలును రోహిణి చూస్తుంది. బాలును చూసిన చింటు సంతోషంతో పిలవనా అంటాడు. చింటు నోరు మూసి పక్కకు తీసుకెళ్లిపోతుంది రోహిణి. సత్యంకు చాలా జాగ్రత్తలు చెప్పి బాలు వెళ్లిపోతాడు. చింటును పక్కన పెట్టి వెళ్లి వాచ్‌మెన్‌ను సత్యం గురించి అడిగితే అతను చెబుతాడు. అకౌంటెంట్‌గా జాయిన్ అయ్యారని, వారంలో ఒక్కరోజు బుధవారం మాత్రమే వస్తాడని వాచ్‌మెన్ చెబుతాడు.
ఎవరికి కనిపించకూడదని ఎంత ప్రయత్నించినా మావయ్య ఇక్కడికే వచ్చాడని అనుకున్న రోహిణి చింటు దగ్గరికి వెళ్లి ఇవాళ స్కూల్‌కు వద్దని, ఇంటికి వెళ్దామంటుంది. చింటు మారం చేస్తాడు. చింటును బలవంతంగా ఇంటికి తీసుకెళ్లిపోతుంది రోహిణి. చింటును మళ్లీ ఎందుకు తీసుకొచ్చావని తల్లి సుగుణ అడుగుతుంది. చింటు కోపంగా వెళ్లి డోర్ వేసుకుంటాడు. స్కూల్‌లో ఏదైనా సమస్య అని సుగుణ అడుగుతుంది.
మావయ్యను జాబ్ మానిపించేయాలి
మా మావయ్య చింటు చదువుతున్న స్కూల్‌లోనే జాబ్ చేస్తున్నాడని రోహిణి చెబుతుంది. నాకు ఏదో భయంగా ఉందని సుగుణ అంటుంది. అందరికి నిజం చెప్పు. మీ మావయ్య చాలా మంచివాడు అని సుగుణ అంటుంది. నాకు అక్కడ ఎవరు లేరు. మనోజ్ కూడా సపోర్ట్ చేయడు. బుధవారం ఒక్కరోజు చింటును స్కూల్‌కు పంపకుంటే చాలు. ముందు మా మావయ్యను అక్కడ జాబ్ చేయకుండా చేయాలి అని రోహిణి అంటుంది.
ఇంతలో మనోజ్ కాల్ చేసి కొత్త ఇల్లు లొకేషన్ గురించి చెబుతాడు. దాంతో రోహిణి వెళ్లిపోతుంది. మరోవైపు మనోజ్ రూ. 5 కోట్ల విల్లా చూస్తాడు. అది చాలా రిచ్‌గా, చాలా బాగుంటుంది. ఇంటి ఓనర్స్‌తో మనోజ్ మాట్లాడుతాడు. ఎంతో ఇష్టంగా ఈ ఇల్లు కట్టుకున్నాం. మంచి విలువ ఉన్న వ్యక్తికి ఇల్లు ఇవ్వాలనుకుంటున్న అని ఇంటి ఓనర్ అంటాడు. ఇంతలో రోహిణి వస్తుంది. మనోజ్, రోహిణి ఇద్దరు కలిసి ఇల్లు చూస్తారు.
మంచి వ్యూ పాయింట్ ఉందని, ఇల్లు చాలా బాగుందని రోహిణి, మనోజ్ మాట్లాడుకుంటారు. మేము అనుకున్నట్లు మాకు మంచివాళ్లు దొరికారు అని ఇంటి ఓనర్ అంటాడు. మరి ఇంత తక్కువకి ఎందుకు అమ్మేస్తున్నారు అని రోహిణి అడుగుతుంది. అనుకోకుండా దుబాయ్‌కి షిఫ్ట్ అవుతున్నాం. అక్కడ పెట్టిన బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది. అది కూడా ఈ ఇల్లు కట్టాకే అని ఇంటి ఓనర్ అంటాడు.
దుబాయ్ షిఫ్ట్ అవుతున్నాం
మరి ఇంత తక్కువకు ఎందుకు అమ్ముతున్నారని రోహిణి అడిగితే.. నాకు టైమ్ లేదు. త్వరగా డబ్బు కావాల్సి వచ్చింది. 3 కోట్లు ధర. అడ్వాన్స్ ఇస్తే ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని ఇంటి ఓనర్ అంటాడు. ఓకే ఇన్ఫార్మ్ చేస్తామని మనోజ్ అంటాడు. రోహిణికి బొట్టు పెట్టి పంపిస్తుంది ఇంటి ఓనర్ భార్య. బయటకు వచ్చాక ఇంత మంచి డీల్ మళ్లీ రాదు. నేను చెప్పాను అని తొందరపడకండి. ఎందుకంటే పెద్ద అమౌంట్ కదా. మీ ఎంక్వైరీ మీరు చేసుకోండి అని మనోజ్ ఫ్రెండ్ మణికంఠ అంటాడు.
విల్లా చాలా బాగుంది. ప్రత్యేకంగా వెతికేది ఏం లేదు. కొనేద్దామని మనోజ్ అంటాడు. ముగ్గురు వెళ్లిపోతారు. అది చూసిన ఇంటి ఓనర్స్ నవ్వుకుంటారు. తెలివి తక్కువ వాళ్లు. ఇల్లు మనదని నమ్మేశారు. ఆశకు కూడా హద్దు ఉండాలి. కనీసం ఆలోచించాలి. అతను వట్టి పప్పుసుద్ధలా ఉన్నాడు. అడ్వాన్స్ ఇచ్చాక మనం కనిపించకపోయేసరికి అప్పుడు అసలు విషయం అర్థం అవుతుందని ఫేక్ ఇంటి ఓనర్స్ మాట్లాడుకుంటారు. అంటే, మనోజ్‌కు మళ్లీ ఇల్లు రూపంలో టోకరా పడనుందని తెలుస్తోంది.
మరోవైపు మీనా చేసిన డెకరేషన్ చాలా బాగుందని పూర్తి అమౌంట్ ఇస్తాడు. ఈ డెకరేషన్ ఫీల్డ్‌లో చింతామణి అని ఒకావిడ ఉంది. ఆవిడను కొట్టేవాళ్లు ఈ జిల్లాలోనే లేరు. ఇప్పుడు పై స్థాయిలో ఉందని అతను మీనాకు చెబుతాడు. కట్ చేస్తే చింతామణి ఎంట్రీ చూపిస్తారు. ఒకతన్ని కిడ్నాప్ చేసి కారులో ఉంచుతుంది చింతామణి. డెకరేషన్ ఫీల్డ్‌లో తనకు పోటీగా వచ్చిన అతన్ని చంపేస్తానని బెదిరిస్తుంది చింతామణి.
మీనాకు కొత్త విలన్ చింతామణి
దాంతో అతను భయపడి పారిపోతాడు. మనకు పోటీ వచ్చినవాళ్లను మొగ్గలోనే తుంచేయాలని చింతామణి అంటుంది. మరోవైపు చింతామణికి మించిన పేరు నీకు వస్తుందని మీనాతో మేనేజర్ అంటాడు. మీనా సంతోషంతో వెళ్లిపోతుంది. చింతామణికి మీనా ఎదురుపడుతుంది. మీనాను చూస్తూ చింతామణి వెళ్తుంది. మేనేజర్‌ను తనకు కాదని ఇంకెవరికో ఆర్డర్ ఎలా ఇచ్చారని బెదిరిస్తుంది.
నేను కాదు ఓనరే డైరెక్ట్ ఇచ్చారు. తనపేరు మీనా. ఇందాక మీకు ఎదురుపడిన ఆమెనే మీనా అని అతను చెబుతాడు. మీనాను గుర్తు చేసుకున్న చింతామణి నవ్వి.. అయితే నాకు పోటీనే లేదు. నేను చూసుకుంటా అనుకుంటుంది. అంటే మీనాకు కొత్త విలన్‌గా పోటీగా చింతామణి వచ్చింది. ఇంటికెళ్లిన మీనా తనను మెచ్చుకున్న విషయం సత్యంకు చెబుతుంది. మీనా స్వీట్స్ ఇస్తుంది.
ఇంతలో ప్రభావతి వచ్చి మీనాపై అరుస్తుంది. ఎన్నిసార్లు స్వీట్స్ ఇస్తావని తిడుతుంది ప్రభావతి. మంచి జరిగిందని ఇస్తుంది అంతే అని ప్రభావతిని తిడతాడు సత్యం. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


