గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: ప్రభావతి పాటకు పారిపోయిన కుక్కలు- తల్లి కాబోతున్న మౌనిక- మీనా బుగ్గపై బాలు ముద్దు

Gunde Ninda Gudi Gantalu Serial February 27th Episode: గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 27 ఎపిసోడ్‌లో యాగం, బొమ్మల కొలువు జరుగుతుంది. సంజుకు బావగా బాలు బాగా మర్యాదలు చేస్తుంటాడు. యాగం తర్వాత మౌనిక తల్లి కాబోతున్నట్లు తెలుస్తుంది. ప్రభావతి పాటకు అంతా దడుసుకుంటారు. మీనా బుగ్గపై బాలు ముద్దు పెడతాడు.

Feb 27, 2026, 09:26:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో బాలు ఫోన్‌కు మీనా కాల్ చేస్తుంది. రోహిణి కట్ చేస్తుంది. ఇంతలో మౌనిక వాళ్లు వస్తారు. దాంతో అటు చూసి వాళ్ల దగ్గరికి వెళ్తారు. సంజుతో బాగా ఉండమని బాలుకు చెబుతుంది మీనా. సత్యం, ప్రభావతి పరామర్శిస్తే వెటకారంగా మాట్లాడుతాడు సంజు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఫిబ్రవరి 27 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఫిబ్రవరి 27 ఎపిసోడ్‌

4 గంటలు కూడా ఉండలేను

నాలుగు రోజులు ఉండమని సుశీల అంటే.. నాలుగు గంటలు కూడా ఉండలేను అని సంజు అంటాడు. బాలు వస్తాడు. మౌనిక సంతోషిస్తే.. అన్నయ్యతో మాట్లాడాలని ఉందా వెన్నుపూస ఇరిగిపోద్ది అని బెదిరిస్తాడు సంజు. బాలు వచ్చి బావగారు బాగున్నారా అని అడుగుతాడు. అందరూ ఇదే ప్రశ్న ఎన్నిసార్లు అడుగుతారు అని చిరాకు పడతాడు సంజు.

బాలు గదిలోకి వెళ్లి అద్దం ముందు సంజుతో ఎలా మర్యాదగా మాట్లాడాలో ప్రాక్టీస్ చేస్తాడు. ఏది వర్కౌట్ కాదు. ఇంతలో బాలు అంతరాత్మ వచ్చి నీతో ఏది కాదంటుంది. నువ్వు చేసింది మీ బావ ఎందుకు మర్చిపోతాడు. నువ్వు ఎంత ప్రాక్టీస్ చేసిన నువ్వు సారీ చెప్పలేవు. నీ మొహంలో అది కనిపించదు. నీ బావ ఏం చేసినా కొట్టకుండా పంపించు అది చాలు అని బాలు అంతరాత్మ అంటుంది.

మరోవైపు బాలు ఫోన్ ప్రభావతి డ్యాన్స్ స్కూల్ స్టూడెంట్ మయూకకు దొరుకుతుంది. అందులో వీడియోలు చేస్తుంది. మరోవైపు యాగంలో జంటలు అంతా కూర్చొంటారు. పాప దగ్గర ఫోన్ చూస్తారు రోహిణి, విద్య. నేను వెళ్లి తీసుకొస్తానని విద్య వెళ్తుంది. హోమంలో సమిధలు వేయమని పంతులు చెబితే.. ముందుగా మా బావ గారెతో వేయించండి అని బాలు అంటాడు.

సెల్ ఫోన్ దొంగవి

మయూకను విద్య ఫోన్ అడిగితే.. ఇందులో నీ పేరు, ఫొటో ఉందా. నువ్వు సెల్ ఫోన్ దొంగవి. పోలీసులకు కాల్ చేస్తాను అని వెళ్లిపోతుంది మయూక. వెళ్లి మీనా పక్కన కూర్చుంటుంది మయూక. తర్వాత సంజుకు ప్రేమగా జ్యూస్ తాగమని ఇస్తాడు. ఇందులో విషం కలిపావా అంటే.. అదెందుకు కలుపుతాను చిలిపి అని అంటాడు బాలు.

ఇన్ని రోజులు చేసిన తప్పులను క్షమించండి. ఈ జ్యూస్ తాగండి అని బాలు అంటాడు. సంజు తీసుకుంటాడు. మౌనిక వచ్చి మా అన్నయ్య నిజంగానే మర్యాద ఇస్తున్నాడని మౌనిక అంటుంది. ఫోన్ కోసం రోహిణి వెళ్తే.. ఇంటికి పెద్ద కోడలివి. నువ్వు కూడా వడ్డించాలని ప్రభావతి చెబుతుంది. అంతా భోజనం చేస్తుంటారు. మయూక ఫోన్ చూస్తూ తింటుంది.

అది చూసిన రోహిణి వెళ్లి ఫోన్ అడుగుతుంది. మయూక ఇవ్వదు. నేను దొంగలకు ఇవ్వనంటుంది. సంజుకు అది వేసుకో ఇది వేసుకో అని మర్యాదలు చేస్తుంటాడు బాలు. అవి తట్టుకోలేకపోతాడు సంజు. ఇంతలో పాప వేరే చోటుకు వెళ్లి కూర్చొంటుంది. నీ దగ్గర ఫోన్ ఉండే కదా ఏది అని రోహిణి అడిగితే.. ఒక అంకుల్ తీసుకున్నాడు. నాకు ఐస్ క్రీమ్ ఇచ్చి తీసుకున్నాడని మయూక చెబుతుంది.

ప్రభావతి పాటకు పారిపోయిన కుక్కలు

మరోవైపు ప్రభావతి పాట పాడుతుంది. అందరూ భయపడిపోతారు. తట్టుకోలేక చెవులు మూసుకుంటారు. తల బాదుకుంటారు. సత్యం మాత్రం వావ్ సూపర్ వన్స్ మోర్ అంటాడు. అంతా షాక్ అవుతారు. దాంతో మళ్లీ మొదలుపెడుతుంది ప్రభావతి. ఇంతలో వంట మనిషి వచ్చి ఆమెను ఇంకా గట్టిగా పాడమను. ఇప్పటికే మూడు కుక్కలు పారిపోయాయి, ఇంకోటి లోపల ఉంది. అది కూడా పోతుందని అతను అంటాడు.

అతన్ని బాలు పంపించేస్తాడు. ఇంతలో బాలు తల్లిని ఆపి.. సత్యంతో ఇంత బీభత్సం జరుగుతుంటే వన్స్ మోర్ అంటావేంటీ నాన్న అని అంటాడు. చెవిలో దూది తీసి ఏంట్రా అని సత్యం అంటాడు. దాంతో అందరికి అర్థమై నవ్వుతారు. నీకున్న తెలివి మాకు లేక బలి అయిపోయామని బాలు అంటాడు. ఒకరినొకరు పాడమంటారు. పాడు పార్లరమ్మా అని బాలు అంటాడు.

అది పాడు పార్లరమ్మ అని తిట్టినట్టుందని మనోజ్ అంటాడు. ఇలాంటి వాటిలో మా మీనా బాగా పాడుతుందని పార్వతి అంటుంది. పోయి పోయి అదే పాడాలని ప్రభావతి అంటుంది. ప్రభావతి పాట వల్ల అందరి చెవుల్లో రక్తం వచ్చింది, కుక్కలు పారిపోయాయి, పిల్లలకు జ్వరం వచ్చిందని బాలు చెబుతాడు. మీనాతో బాలు పాట పాడిస్తాడు.

రెండు గ్రూపులు

బొమ్మల కొలువులో రెండు గ్రూపులుగా విడిపోతారు. మీనా పాట పాడుతుందని సుశీల అంటుంది. దాంతో మీనా పాడుతుంది. ప్రభావతి ఆశ్చర్యపోతుంది. బాగుందని అంతా చప్పట్లు కొడతారు. సంజుకు బాలు ప్రసాదం ఇస్తే తీసుకోడు. ఇది సంతానం కోసం చేసిన సంతాన పాసుపతి యాగం కదా. ప్రసాదం తీసుకోవాలని సుశీల చెబుతుంది. అటు సంజు ప్రసాదం తీసుకోగానే ఇటు మౌనికకు వాంతులు వస్తాయి.

మీనా చేసిన ప్రసాదం వల్లే ఇదని ప్రభావతి అంటుంది. కామాక్షి కోప్పడుతుంది. సుశీల మౌనికకు గాలి ఆడనిచ్చేలా విషయం అడుగుతుంది. దాంతో సత్యం నువ్వు తాతవి కాబోతున్నావురా అని మౌనిక ప్రెగ్నెంట్ అని, తల్లి కాబోతున్నట్లు చెబుతుంది సుశీల. దాంతో అంతా సంతోషిస్తారు. ప్రభావతిని అమ్మమ్మ గారు అంటూ కామాక్షి, సత్యం అంటారు.

నీలకంఠం చెప్పిన ప్లాన్ ఫెయిల్ అవుతుందని సంజు భయపడతాడు. అందరం గ్రూప్ ఫొటో తీసుకుందామని తీస్తాడు బాలు. ఇంతలో మయూక వచ్చి రోహిణితో నాకు ఐస్‌క్రీ ఇచ్చి ఫోన్ తీసుకుంది ఆ అంకులే అని బాలును చూపిస్తుంది. తన ఫోన్ బాలుకే తిరిగి వెళ్తుంది. సంజు, మౌనిక వెళ్తుంటారు. సంజుకు బావ మొదటిసారిగా థ్యాంక్స్ చెబుతున్నా. చెల్లిని జాగ్రత్తగా చూసుకో అని ఎమోషనల్‌గా చెబుతాడు బాలు.

మీనా బుగ్గపై బాలు ముద్దు

మౌనిక కొడుకును కను, నేను కూతురుని కంటాను. నీ కొడుకు నా కూతురునే ఇచ్చి పెళ్లి చేస్తానని బాలు అంటాడు. తర్వాత రాత్రి మీనా పాలు తీసుకొస్తుంది. బాలు సిగ్గు పడతాడు. మీనా బుగ్గలు గిల్లుతాడు బాలు. నొప్పిగా ఉందని మీనా అంటే మంత్రం అని చెప్పి మీనా బుగ్గలపై ముద్దు పెట్టుకుంటాడు బాలు. ఇది ముద్దు మంత్రం అని బాలు అంటాడు. బొమ్మల కొలువు సూపర్ హిట్ సినిమాలాగా జరిగిందని బాలు అంటాడు.

మౌనిక తల్లి కాబోతున్నందుకు సంతోషంగా ఉందని మీనా చెబుతుంది. మౌనిక కొడుకును నేనే ఆడిస్తాను, నా కారులో బుల్లి సీటు పెట్టుకుని తిప్పుతాను అని బాలు అంటాడు. మరి ఇంత చేసిన నాకు ఏమిస్తారు అని మీనా అంటుంది. నీకు డైమండ్ ఇస్తాను. వజ్రం లాంటి కూతురును అని బాలు అంటాడు.

నిప్పుల కొలిమిలో

నువ్వేంటీ పాట భలే పాడావు అని బాలు పొగుడుతాడు. మీ అమ్మ మైక్ తీసుకుంటే బాగా పాడుతుందనుకున్నా. కానీ పాడేంత సేపు బొమ్మల కొలువులో ఉన్నామా నిప్పుల కొలిమిలో ఉన్నామా అనిపించిందని మీనా అంటుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.