గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: పూలు అమ్మిన ప్రభావతి- రోహిణి కొంపముంచిన బామ్మ- రోహిణి చేతిలో బాలు ఫోన్ చూసేసిన మీనా
Gunde Ninda Gudi Gantalu Serial February 26th Episode: గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 26 ఎపిసోడ్‌లో ప్రభావతి నెత్తిపై పూలగంప పెట్టి పూలు అమ్మిస్తారు. కామాక్షి ఫ్రెండ్ ఫామ్ హౌజ్‌లో బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. గుణ వచ్చి రోహిణిని ఎలాగైనా వీడియో తీసుకురమ్మని చెబుతాడు. బాలు ఫోన్ తీసుకుంటుంది రోహిణి.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో అందరూ త్వరగా పడుకోండని, ఉదయాన్నే ప్రభావతి పూలమ్ముకుని తిరుగుతుంది అని బాలు అంటాడు. అంతా పైకి వెళ్తారు. నిజంగా నాతో పూలు అమ్మిస్తారా అని సత్యంతో ప్రభావతి అంటుంది. మీనా ఓడిపోతే పూలు అమ్మటం మానిపించేదానివిగా. అందుకే బాలు ఇలా చేయిస్తున్నాడని సత్యం అంటాడు.

రవి, శ్రుతి గొడవ
మరోవైపు రవిపై శ్రుతి నీతూ విషయంలో చిరాకు పడుతుంది. తర్వాత యాగంలో కూర్చోనంటుంది. పిల్లలను కనడం ఇష్టం లేదంటుంది శ్రుతి. రవి పదే పదే అడగడంతో శ్రుతి ఒప్పుకుంటుంది. మధ్యలో టెడ్డీ బేర్ పెట్టి పడుకుంటుంది శ్రుతి. తర్వాత రొమాంటిక్‌గా శ్రుతిపై చేయి వేస్తే రవిని గిల్లుతుంది.
టెడ్డీ బేర్‌లో నీతూను చూసుకుని రవి చేయి వేసి మాట్లాడటంతో శ్రుతి కొడుతుంది. తర్వాత ఇద్దరు కలిసిపోతారు. మరోవైపు మీనా, శ్రుతి గొడవ గురించి సుశీలకు చెబుతాడు బాలు. అదా సంగతి ఇద్దరు కలిసి ప్రభావతిని వెర్రిబాగలదాన్ని చేశారా అని మీనాను పొగుడుతుంది సుశీల. సంజును ఎలా ఒప్పించావ్ అని బాలు అడిగితే.. కొందరికి కొన్ని పద్ధతులు ఉంటాయి. అలాగే చేశా అని మీనా అంటుంది.
మీ చెల్లి చల్లగా ఉండాలంటే మీరు అతనితో గొడవ పడొద్దు. అతను కలిసినా కలవకున్నా మీరే బుద్ధిగా ఉండి అన్ని కావాల్సినవి చూసుకోవాలని మీనా అంటుంది. వాడు దున్నపోతు మీనా. దున్నపోతు మీద వాన పడినట్లే అని సంజును అంటాడు బాలు. ఒక్కసారి అతన్ని క్షమించమని అడగమని సుశీల అంటుంది. సరే నేను ప్రేమించే ఇద్దరు డార్లింగ్స్ చెబుతున్నారు. చెబుతా అని బాలు అంటాడు.
పూలావతి షాప్
మరుసటి రోజు ఉదయం పూలకొట్టుకు ప్రభావతిని బలవంతంగా తీసుకెళ్తారు. పూలు అమ్మమంటారు. రా పూలావతి, ఈ షాప్ నీదే అని బాలు అంటాడు. పూలమ్మా పూలు అని ప్రభావతి మెల్లిగా అంటే.. మీనా అరిచి చూపిస్తుంది. దాంతో గట్టిగా అరుస్తుంది ప్రభావతి. ఇద్దరు కస్టమర్స్ వచ్చి పూలామే, పూలమ్మా అంటూ మాట్లాడుతారు. ప్రభావతి పూలు కొలుస్తుంది.
అదంతా చూసి మీనా, సత్యం, బాలు నవ్వుతారు. వెంటనే లేచి ఇదంతా నా కల అని పడుకుంటుంది ప్రభావతి. మరుసటి రోజు ఉదయం పూలగంప ఇచ్చి నెత్తిమీద పెట్టుకుని మార్కెట్‌కు వెళ్లమని ప్రభావతికి చెబుతారు. ఆ ఐడియా అంతా మీనాదే అని తిట్టేసరికి ఇప్పుడు చెబుతున్నా మీరు ఈ పూలు అమ్మాలని, ఫొటోలు తీయాలని మీనా అంటుంది.
మర్యాదగా అమ్మమని సుశీల చెబుతుంది. దాంతో నెత్తిమీద పూలగంప పెట్టుకుని ప్రభావతి అరుస్తూ అమ్ముతుంది. రవి, శ్రుతి ఫొటోలు వీడియోలు తీస్తారు. ఇక చాలు లెండని ఆపుతుంది మీనా. ఏంటే నిజమా, నాతో పూలు అమ్మించట్లేదా అని ప్రభావతి అంటుంది. లేదు నేను ఎలా అమ్మిస్తానని మీనా అంటుంది. ఈరోజు నువ్వు నా కళ్లకు మధుర మీనాక్షిలా, దేవతలా కనిపిస్తున్నావని ప్రభావతి అంటుంది.
డబ్బా కొట్టిన కామాక్షి
బొమ్మల కొలువు కోసం మీనాక్షి ఫ్రెండ్ ఫామ్ హౌజ్‌కు వెళ్తారు. తన ఫ్రెండ్‌దే అని డబ్బా కొడుతుంది కామాక్షి. ఇంట్లో బొమ్మల కొలువు పెడతారు. కామాక్షి వచ్చి పూలగంపను ఇటువ్వురా అంటే మీనాను ఎత్తుకొచ్చి ఇస్తాడు బాలు. ప్రభావతి పూలగంప ఎత్తగానే పూలమ్మా పూలు అంటూ బాలు ఎగతాళి చేస్తాడు. ఇంతలో పార్వతి, సుమతి వస్తారు. సుశీలను పలకరిస్తారు.
శ్రుతి తల్లి శోభన కూడా వస్తుంది. మమ్మీ ఎప్పుడు పుల్లలు వేసి వెళ్తావుగా. ఈ పుల్ల తీసుకో అని శ్రుతి అంటుంది. ప్రభావతి డ్యాన్స్ స్కూల్ నుంచి స్టూడెంట్స్ వస్తారు. కొత్తగా జాయిన్ అయిన స్టూడెంట్ మయూక కామాక్షిని బామ్మ అని పిలుస్తుంది. విద్య వచ్చి రోహిణితో గుణ కాల్ చేయమన్నాడని చెబుతుంది. దాంతో రోహిణి కాల్ చేస్తే.. బాలు ఫోన్ నుంచి వీడియో కొట్టేయమని, ఫామ్ హౌజ్ పక్కనే ఉన్నానని గుణ చెబుతాడు.
సరేనని రోహిణి అంటుంది. బాలు ఫోన్ ఛార్జింగ్ పెట్టి వెళ్లిపోతాడు. ఆ ఫోన్ దగ్గరికి రోహిణి వెళ్లి వెతుకుతుంది. ఇంతలో మనోజ్ వచ్చి బొమ్మల కొలువులో మనమే ముందు కూర్చోవాలని తీసుకెళ్తాడు. తర్వాత రోహిణిని పిలిచిన సుశీల నీకు కడుపు పోయిందట కదా అని అడుగుతుంది. దాంతో అంతా ఇబ్బందిపడతారు. మీనానే చెప్పి ఉంటుందని ప్రభావతి తిడుతుంది.
కొంప ముంచిన బామ్మ
ఆ విషయం చెప్పింది నేను అని సత్యం అంటాడు. మీరెందుకు చెప్పారని ప్రభావతి అంటుంది. మా అమ్మకు చెప్పేంత దూరం లేదని సత్యం కౌంటర్ ఇస్తాడు. ఒకసారి ఇలా అయిందంటే రెండోసారి కూడా అయ్యే ప్రమాదం ఉంది. డాక్టర్‌తో టెస్ట్ చేయించుకో. నేనే ఇక్కడికి డాక్టర్‌ను రమ్మన్నాను, ఆవిడ చూసి సమస్య ఏంటో చెబుతుంది అని సుశీల చెబుతుంది.
ఏంటే ఈవిడ (బామ్మ సుశీల) నీ కొంప ముంచేలా ఉందని విద్య అంటుంది. ఆ డాక్టర్‌కు దొరకకుండా తప్పించుకోవాలని రోహిణి అంటుంది. ప్రభావతి వచ్చి మీనా కంటే ముందు నువ్వే పిల్లలను కనాలి. గుర్తుపెట్టుకో అని చెప్పి వెళ్లిపోతుంది. ఏంటో అందరూ నన్నే టార్గెట్ చేస్తున్నారని ఫీల్ అవుతుంది రోహిణి.
మరోవైపు రాజేష్‌కు ఫోన్ చేయాలని ఫోన్ కోసం వెతుకుతాడు బాలు. ఛార్జింగ్ పెట్టినచోట లేదని మీనాకు చెబుతాడు. ప్రభావతి, మనోజ్ దొంగతన చేసి ఉంటారని బాలు అంటాడు. వాళ్లను దొంగలను చేశారు కదండి అని బాలు ఫోన్‌కు కాల్ చేస్తుంది మీనా.
రోహిణి చేతిలో బాలు ఫోన్
అది చూసి రోహిణి కంగారు పడుతుంది. కట్ చేస్తుంది. కాల్ రింగ్ అయింది, కట్ చేస్తున్నారని మీనా చెబుతుంది. రోహిణిని దగ్గర బాలు ఫోన్ ఉన్నట్లు చూస్తుంది మీనా. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


