గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనా వార్నింగ్.. దిగి వచ్చిన సంజూ.. అత్తపై గెలిచిన కోడలు.. పూలు అమ్మనున్న ప్రభావతి!

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఫిబ్రవరి 25 ఎపిసోడ్ లో అత్త ప్రభావతితో శపథం చేసి గెలుస్తుంది మీనా. అటు సంజూకి, అతని తండ్రికి గట్టి వార్నింగ్ ఇవ్వడంతో వాళ్లు దిగి వస్తారు. దీంతో ప్రభావతి పూలు అమ్మే పరిస్థితి వస్తుంది.

Published on: Feb 25, 2026, 08:02:27 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 627వ ఎపిసోడ్ లో అత్త ప్రభావతితో శపథం చేసి గెలుస్తుంది మీనా. ఇంట్లో జరిగే హోమానికి మౌనికను పిలవడానికి వెళ్లిన మీనా.. అక్కడ సంజూకి గట్టి వార్నింగ్ ఇస్తుంది. ఇటు నాలుగు జంటలతో కలిసి ఇంట్లో సంతాన హోమానికి ఏర్పాట్లు చేస్తుంటారు.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనా వార్నింగ్.. దిగి వచ్చిన సంజూ.. అత్తపై గెలిచిన కోడలు.. పూలు అమ్మనున్న ప్రభావతి!
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనా వార్నింగ్.. దిగి వచ్చిన సంజూ.. అత్తపై గెలిచిన కోడలు.. పూలు అమ్మనున్న ప్రభావతి!

బైకుపై రవి, శృతి, నీతూ.. ఆపిన ట్రాఫిక్ పోలీసులు

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (ఫిబ్రవరి 25) ఎపిసోడ్ బైకుపై శృతి, నీతూలను ఎక్కించుకొని రవి వెళ్లే సీన్ తో మొదలవుతుంది. నీతూ మధ్యలో కూర్చోవడంతో శృతి ఉడుక్కుంటుంది. అతన్ని గిల్లుతూ ఉంటుంది. అప్పుడే ట్రాఫిక్ పోలీసులు వాళ్లను ఆపుతారు. ట్రిపుల్ రైడింగ్ అంటూ ఫైన్ కట్టాలని అడుగుతారు. నీతూ, రవి ఇద్దరూ పర్సు తీసుకురాకపోవడంతో చివరికి శృతియే ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత నీతూ మాత్రం ట్రాఫిక్ పోలీసు బైక్ ఎక్కి వెళ్లిపోతుంది.

సంతానం కోసం హోమం చేద్దామన్న సత్యం

ఇటు ఇంట్లో మరోసారి తల్లి ప్రభావతిని బాలు సరదాగా ఆట పట్టిస్తూ ఉంటాడు. అదే సమయంలో సత్యం తమ ఇంట్లో నాలుగు పెళ్లిళ్లు జరిగినా.. ఎవరికీ ఇప్పటి వరకూ సంతానం కలగలేదని, అందుకే బొమ్మల కొలువుతోపాటు హోమం చేయించాలని తల్లి సుశీల చెప్పిందని చెబుతాడు. ఆమె ఎందుకు వస్తోంది అని అడిగిన ప్రభావతిపై అంత ఎత్తున ఎగురుతాడు సత్యం. మా అమ్మ ఎందుకు వస్తుందని అడుగుతావా అని క్లాస్ పీకుతాడు.

మౌనికకు ప్రభావతి ఫోన్.. ఆడుకున్న సంజూ

ఈ హోమానికి మౌనిక, సంజూని కూడా పిలుద్దామనుకుంటారు. వెంటనే ప్రభావతి మౌనికకు ఫోన్ చేస్తుంది. సంజూ అక్కడే ఉండటంతో ఆమె ఫోన్ ఎత్తదు. మళ్లీ చేయడంతో సంజూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఎలా ఉన్నారు అని ప్రభావతి అడిగితే.. ఇప్పుడే కరువు వచ్చి మీ పెద్ద కొడుకులాగా గుడి ముందు కూర్చొని అడుక్కుంటున్నామని, పార్కులో పడుకుంటున్నామని సంజూ అంటాడు. అది విని ప్రభావతి షాక్ తింటుంది. హోమం గురించి చెప్పి ఇంటికి రావాలని ఆహ్వానిస్తుంది. మేము రాము.. మౌనికను కూడా పంపించమని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.

మౌనికను తీసుకొస్తానని వెళ్లిన మీనా

ఇటు మీనా మాత్రం తాను మౌనికను తీసుకొస్తానని అంటుంది. అలా చేస్తే నువ్వు ఏం చెబితే అది చేస్తానని ప్రభావతి అంటుంది. అది విని ఇదే మంచి అవకాశం అని మీనకు బాలు, సత్యం చెబుతారు. దీంతో మౌనిక ఇంటికి వెళ్తుంది మీనా. అప్పటికే మౌనికకు ఆమె అత్త సర్ది చెబుతూ ఉంటుంది. ఈ హోమానికి ఎలాగైనా వెళ్లాలని, నీకు సంతానం కలిగితే సంజూ మారతాడని చెబుతుంది. మీనాను చూడగానే మౌనిక ఎంతో సంతోషిస్తుంది. హోమానికి పిలుద్దామని వచ్చానంటూ ఇద్దరికీ బొట్టు పెడుతుంది.

సంజూతో మీనా గొడవ.. గట్టి వార్నింగ్

అప్పుడే సంజూ అక్కడికి వస్తాడు. మౌనికను పంపించనని అంటాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. మాటా మాటా పెరుగుతుంది. బాలు చేసిన పనిని సంజూ ఎత్తి చూపడంతో అతన్నే పంపిస్తాను.. ఇవే మాటలు అతని దగ్గర మాట్లాడండి చూద్దామని మీనా అంటుంది. బెదిరిస్తున్నావా అని సంజూ అంటాడు. పూలమ్ముకునే దానివి అంటూ అవమానిస్తాడు.

దీంతో ఇటుకలు పట్టిన చేయి ఇది.. నేను ఒక్కసారి టీవీ వాళ్లకు ఫోన్ చేశానంటే నీ పని, మీ నాన్న రాజకీయ జీవితం ముగుస్తుందని మీనా వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే ఎంట్రీ ఇచ్చే సంజూ తండ్రి.. అందరికీ సర్ది చెప్పి వాళ్లను పంపిస్తానని అంటాడు. అయితే నీకు భయపడి ఆ పని చేయడం లేదని మీనాతో అంటాడు.

గెలిచిన మీనా.. ఓడిన ప్రభావతి

ఇటు ఇంట్లో మీనా ఎలాగూ ఓడిపోయి వస్తుంది కాబట్టి.. ఆమెతో అన్ని పనులు చేయిస్తానని ప్రభావతి అనుకుంటుంది. ఆమె కోసం పాత సామానులు, బట్టలు తీసి పెడుతుంది. కానీ మీనా వచ్చి మౌనిక, సంజూ ఇద్దరూ వస్తున్నారని చెబుతుంది. దీంతో ప్రభావతి షాక్ తింటుంది. మరి మీనా చెప్పినట్లు చేయడానికి రెడీగా ఉండు.. రేపటి నుంచి నెత్తి మీద బుట్ట పెట్టుకొని వీధుల్లో పూలు అమ్ము అని సత్యం అంటాడు. మీనా మాత్రం లైట్ తీసుకుంటుంది.

శృతి, మీనాపై అనుమానపడ్డ రోహిణి

ఇటు హోమం రోజు ఏం వంటలు చేయాలా అని మీనా లిస్టు రాసుకుంటుంది. అప్పుడే శృతి వచ్చి ఆమెతో మాట్లాడుతుంది. రోహిణి వచ్చి మీరు ఇద్దరూ గొడవ పడ్డారు కదా.. మళ్లీ ఎప్పుడు కలిసిపోయారని అడుగుతుంది. తాము కలిసిపోలేదంటూ ఇద్దరూ మరోసాని డ్రామా మొదలు పెడతారు. మాటా మాటా అనుకుంటారు. అప్పుడే సుశీల ఎంట్రీ ఇస్తుంది. తోడికోడళ్లు ఇలా గొడవ పడుతున్నారేంటని అడుగుతుంది. అదంతా పెద్ద స్టోరీ.. తర్వాత చెబుతానని బాలు అంటాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More