Gunde Ninda Gudi Gantalu Promo: మీనా కిడ్నాప్- బాలుపై గుణ, దినేష్ ప్రతీకారం- తల్లి ప్రభావతిని నోర్మూయ్ అన్న బాలు

Gunde Ninda Gudi Gantalu Serial April 10th Episode Promo: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 10వ ఎపిసోడ్‌లో ఇంటికొచ్చిన బాలు మీనా గురించి అడిగితే శ్రుతి లేదని చెబుతుంది. ఫోన్ ఇంట్లోనే వదిలేసి వెళ్లిపోయిందని రవి చెబుతాడు. తల్లి ప్రభావతిని నోర్మూయ్ అని తిడతాడు బాలు. మీనాను గుణ కిడ్నాప్ చేయిస్తాడు.

Apr 10, 2026, 13:50:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode Promo: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కామాక్షి రెండు లక్షలు పోయాయని ఇంట్లో ప్రభావతి పెద్ద గొడవ చేస్తుంది. మీనానే దొంగతనం చేసిందని నానా మాటలు అంటుంది. దాంతో ప్రభావతిపై సత్యం, రవి, శ్రుతి మండిపడతారు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 10 ఎపిసోడ్ ప్రోమో
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 10 ఎపిసోడ్ ప్రోమో

సంతోషించేది వాళ్లే

ప్రభావతిని వెనుకేసుకొచ్చిన రోహిణిని మందలిస్తాడు సత్యం. చదువుకున్నదానివి, మనోజ్, నువ్వు బాగుపడితే వాళ్లు సంతోషిస్తారు. కానీ, వాళ్లు ఏదైనా చేశారని నింద వచ్చినప్పుడల్లా సంతోషించేదానివి నువ్వు అవుతున్నావని పెద్ద కోడలిని అంటాడు సత్యం. తర్వాత మీనా, శ్రుతి, రవి మాట్లాడుకోవడం రోహిణి వింటుంది.

రోహిణి మాటలు వింటున్నది చూసిన మీనా కావాలనే రేపు ఉదయం పోలీస్ స్టేషన్‌కు వెళ్తాను, వాళ్లే ఎంక్వైరీ చేసి దొంగను పట్టుకుంటారని అంటుంది. అది విన్న రోహిణి భయంతో వణికిపోతుంది. పోలీసులు వస్తే నిజం అంతా తెలిసిపోతుందని కంగారుపడుతుంది. ఏం చేయాలో తెలియక గుణకు కాల్ చేస్తుంది. అదే సమయంలో దినేష్‌తో కలిసి గుణ మందు తాగుతుంటాడు.

గుణకు కాల్ చేసిన రోహిణి నీకు రెండు లక్షలు ఇచ్చేందుకు కామాక్షి ఇంట్లో దొంగతనం చేశాను. అది ఇంట్లో పెద్ద గొడవ అవుతోంది. దానివల్ల నేను ఇరుక్కుంటాను. దాంతోపాటు నువ్వు కూడా ఇరుక్కోవాల్సి వస్తుంది. ఆ రెండు లక్షలు ఇప్పుడు నాకు ఇవ్వు, నీకు మళ్లీ ఇస్తానంటుంది. అవి దినేష్ ట్రీట్‌మెంట్ కోసం ఇచ్చేశాను కదా. లేవు అని గుణ అంటాడు.

బాలుపై గుణ, దినేష్ పగ

అయ్యో ఇచ్చేశావా. రేపు మీనా పోలీస్ స్టేషన్‌కు వెళ్తే అంతే సంగతి. ఎలాగైన తనను ఆపు అని రోహిణి అంటుంది. వాళ్లతో తేల్చుకోవాల్సిన లెక్కలు ఉన్నాయి. నేను చూసుకుంటాను అని గుణ కాల్ కట్ చేస్తాడు. తర్వాత దినేష్‌కు జరిగింది చెప్పిన గుణ మీనాను కిడ్నాప్ చేస్తానని, అది అడ్డుపెట్టుకుని బాలుగాడిపై పగ తీర్చుకుంటాను, అంతేకాకుండా డబ్బు కూడా లాగుతాను అని గుణ అంటాడు.

ఆ బాలు గాడి మీద నాకు కూడా కోపం ఉంది. నన్నే వాడు జైలుకు పంపించాడు. నేను కూడా నీకు హెల్ప్ చేస్తానంటాడు దినేష్. గుణ, దినేష్ కలిసి బాలుపై పగ తీర్చుకునేందుకు మీనాను కిడ్నాప్ చేసే ప్లాన్ చేస్తారు. మరోవైపు మీనా ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్తుంది. తర్వాత బాలు ఇంటికి వస్తాడు. మీనా అని పిలుస్తాడు. ఇంట్లో అంతా వస్తారు. మీనా గురించి బాలు అడిగితే.. ఇంట్లో లేదని శ్రుతి సమాధానం ఇస్తుంది.

దాంతో బాలు ఫోన్ చేస్తాడు. ఎంతకీ మీనా ఫోన్ తీయదు. వదినా ఫోన్ ఇంట్లోనే వదిలేసి పోయిందని రవి చెబుతాడు. పంపించేసిందా లేదా ఇంట్లోంచి గెంటేసిందా అని తల్లిని ఉద్దేశించి బాలు అంటాడు. నీ పెళ్లాం రెండు లక్షలు దొంగతనం చేసింది అని ప్రభావతి అంటుంది. దాంతో కోపంగా మొదటిసారి తల్లిని నోర్మూయ్ అని అంటాడు బాలు. దాంతో అంతా షాక్ అవుతారు.

కన్న తల్లని కూడా చూడను

సత్యం కూడా అవాక్కవుతాడు. నా భార్యను దొంగ అని ఎవరైన అంటే కన్న తల్లి అయినా చూడను జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడు బాలు. నువ్వు అసలు ఒక ఆడదానివేనా. ఇద్దరు కలిసి ఇంటిని, ఇంటి పత్రాలను, ఇంటి డబ్బుని, నగలని ఎంతగా మింగేశారో మర్చిపోయారా అని తల్లి ప్రభావతి, అన్న మనోజ్‌ను అంటాడు బాలు.

ఇప్పుడు నా భార్య ఎక్కడుందో వెతికి తీసుకొచ్చి అప్పుడు చెబుతాను అని బయటకు వెళ్లిపోతాడు బాలు. బాలు అన్నంత పని చేస్తాడు. దొంగతనం ఎవరు చేశారో కనుక్కుంటే నేను, విద్య దొరికిపోయినట్లే అని కంగారుపడుతుంది రోహిణి. గుణకు కాల్ చేసి తాను చెప్పింది ఏం చేశావ్. మీనాను ఆపావా. మీనా కోసం బాలు వెతుకుతున్నాడు అని రోహిణి చెబుతుంది.

మీనా పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా నేను ఆపుతాను. నువ్వేం కంగారుపడకు అని గుణ చెబుతాడు. మరోవైపు స్కూటీపై మీనా వెళ్తుంటే ఎదురుగా వ్యాన్ వచ్చి ఆగుతుంది. నలుగురు ముసుగు వేసుకుని వచ్చి మీనాను పట్టుకుని తీసుకెళ్తారు. అక్కడే ఉన్న వృద్ధ జంట చూస్తారు. మీనా కిడ్నాప్‌ను ఆపేందుకు ట్రై చేస్తారు. కానీ, ఆపలేకపోతారు.

మీనా కిడ్నాప్

మీనాను గుణ రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతారు. అలా బాలుపై గుణ, దినేష్ ప్రతీకారం తీర్చుకుంటారు. మరోవైపు మీనా కోసం బాలు రోడ్లపై వెతుకుతుంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More