గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బొమ్మల కొలువులో బాలు, మీనాకు అవమానం- నానా మాటలు అన్న సుగుణ- రోహిణి పతనం, తల్లి శాపం
Gunde Ninda Gudi Gantalu Serial March 3rd Episode: గుండె నిండా గుడి గంటలు మార్చి 3 ఎపిసోడ్‌లో బొమ్మల కొలువుకు వచ్చిన సుగుణను చింటును దత్తత తీసుకుంటామని బాలు, మీనా అడుగుతారు. దానికి నానా మాటలు అంటుంది సుగుణ. అందరిముందు అవమానిస్తుంది. బాలు, మీనాకు బాగా బుద్ధి చెప్పారంటూ కామాక్షి, రవి అంటారు.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో బొమ్మల కొలువుకు బాలు రమ్మంటున్నాడని రోహిణికి సుగుణ చెబుతుంది. సరే వచ్చేసేయ్, కాకపోతే నేను చెప్పినట్లు చేయి అని రోహిణి ఓ ప్లాన్ చెబుతుంది. సరేనని సుగుణ అంటుంది. మరోవైపు ఎగ్జామ్స్ గురించి, అటెండెన్స్ గురించి ఫ్రెండ్‌తో శివ మాట్లాడుతుంటాడు.

బిజినెస్ ట్రాక్‌లో పడింది
అది చూసిన గుణ వాడి వల్లే మన బిజినెస్ ట్రాక్‌లో పడింది. వాడిని వదులుకోకూడదు అని కారు శివ దగ్గర ఆపుతాడు. వచ్చి తన అకౌంట్స్ చూసుకోమని అడుగుతాడు. కానీ, శివ ఒప్పుకోడు. తాగుబోతుల దగ్గర పని చేయనంటాడు. ఎగ్జామ్స్ ఉన్నాయని, నాకోసం ఎప్పుడు రావొద్దు అని శివ వెళ్లిపోతాడు. వీడిని ఎగ్జామ్స్ రాయకుండా చేస్తే చచ్చినట్లు నా దగ్గరికి వస్తాడని రౌడీలతో గుణ ఓ ప్లాన్ చెబుతాడు.
మరోవైపు బొమ్మల కొలువులో బాలు నుంచి ఫోన్ ఎలా తీసుకోవడం గురించి ఆలోచిస్తుంటారు రోహిణి, విద్య. ఇవాళ అందరిముందు బాలు, మీనాకు అవమానం జరుగుతుంది అని రోహిణి అంటుంది. ఇంటికి పెద్ద గెస్ట్ వచ్చారని, బాలకృష్ణ వచ్చాడని బాలు చెబుతాడు. అంతూ చూస్తుంటే చింటు కృష్ణుడి గెటప్‌లో వస్తాడు. రారా బాలకృష్ణ అని బాలు పిలుస్తాడు.
చింటూని చూసి రోహిణి మురిసిపోతుంది. తర్వాత సుగుణ వస్తుంది. చింటూను దగ్గరికి తీసుకోలేనందుకు రోహిణి ఫీల్ అవుతుంది. నీ ఫేస్‌కు అమ్మతనం సూట్ కాదని విద్య అంటుంది. చింటును దత్తత తీసుకుందామని మీనా అంటే.. టైమ్ చూసి అడుగుదామని బాలు అంటాడు. తర్వాత చింటును బాలు పిలిస్తే రోహిణి వెళ్లి ముద్దు చేస్తుంది. హగ్ చేసుకుని ఎమోషనల్ అవుతుంది.
మనవాళ్లకు బుద్ధి లేదు
నీ కోడలు తన కొడుకునే తీసుకున్నట్లు ఉంది అని కామాక్షి అంటే.. అబార్షన్ అయిందిగా అందుకే అని ప్రభావతి అంటుంది. మనోజ్‌ను మయూక ఫొటోలు తీయమంటుంది. మనోజ్ తీస్తాడు. తర్వాత చింటును దత్తత తీసుకుంటామని సుగుణను అడుగుతాడు బాలు. నా మనవడిని నాకు కాకుండా చేద్దామనుకుంటున్నారా అని అరుస్తుంది సుగుణ.
మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని మీనా అంటుంది. నాకున్నది వీడు ఒక్కడే. వీడికి అమ్మమ్మను ఉన్నాను. కన్నతల్లి బతికే ఉంది అని సుగుణ అంటే.. కొడుకును పారేసి తన సుఖం చూసుకుంటుందా అని సుశీల అంటుంది.
మనవాళ్లకు బుద్ధి లేదు. దారిన పోయేవాళ్లను బాగా చూసుకుందామనుకుంటే ఇలాగే అంటారు. మీకేమంతా వయసు అయిపోయిందనిరా ఇంత పెద్ద బాధ్యత తీసుకుందామనుకుంటున్నారు. పెద్దోడు మనోజ్ గాడు ఉన్నాడుగా. వాడు తినడం ఆపి బిడ్డను కనమను అని తిడుతుంది కామాక్షి.
బాలు, మీనాను ఇంటికి రమ్మన్నానా, రాసుకుపూసుకుని తిరిగింది మీరు. ముమ్మాటికి తప్పు మీదే. మాకేమైనా మీది అయ్య చుట్టమా.. అమ్మ చుట్టమా. మీకు అంతలా బిడ్డను పెంచుకోవాలంటే అనాథ ఆశ్రమం నుంచి తెచ్చి పెంచుకోండి అని సుగుణ అంటుంది. ఇదేనా నువ్వు చూడమంది. నీలాగే మీ అమ్మని దిగజార్చావుగా అని రోహిణిని అంటుంది విద్య.
బాలు, మీనాకు అవమానం
మీకు దత్తత ఇవ్వకుంటే సున్నితంగా చెప్పొచ్చు కదా. ఇంతలా అవమానించాలా అని సత్యం అంటాడు. చాలా సార్లు చెప్పాలని చూశాను. కని నన్ను మాట్లాడనివ్వలేదు. అందుకే అందరిముందు ఇలా చెప్పేస్తున్నా అని సుగుణ అంటుంది. మంచి పని చేశారు. మా అన్నయ్య, వదినకు బుద్ధి వచ్చి ఉంటుంది. ఇంకోసారి దారిన పోయినవాళ్లకు హెల్ప్ చేయాలనుకోరు అని రవి అంటాడు.
మీనా ఏడుస్తుంటుంది. కావాలంటే వాడి మనసులు ఏముందో అడగండి అని మీనా అంటుంది. దాంతో సుగుణ ఎవరితో ఉండాలని ఉందో చెప్పు అని చింటును అడుగుతుంది. అమ్మతో ఉండాలనిపిస్తుందని చింటు అంటాడు. దాంతో అంతా నోరెళ్లబెడతారు. ఇకనైనా అందరిని పట్టించుకోవడం మానండి అని కామాక్షి అంటుంది. సరే ఇదంతా వదిలేయండి. భోజనం చేసి వెళ్లండి. చింటు ఆకలికి ఆగలేడు కదా అని మీనా అంటుంది.
వాడి ఆకలి చూసుకునేందుకు నువ్వు ఎవరమ్మా అని సుగుణ కోపంగా అంటుంది. వాళ్లను వెళ్లనివ్వు మీనా అని బాలు అంటాడు. దాంతో మీనా ఏడుస్తుంది. బయటకు వచ్చిన సుగుణ తాను చేసినదానికి ఏడుస్తుంది. బాగుందా అంటూ మీనాను అంటుంది ప్రభావతి అంటుంది. చింటు తల్లిని కామాక్షి తిడుతుంది. ఇంకొకసారి ఆవిడ నా ఇంటి ముందు కనిపిస్తే ఊరుకోను అని ప్రభావతి అంటుంది.
సుశీల ఎమోషనల్
మీ వల్ల బొమ్మల కొలువు బాగా జరిగింది. మౌనిక కడుపు పండింది. మీ ముగ్గురు కడుపు కూడా పండాలని కోరుకుంటున్నానని ఎమోషనల్‌గా అంటుంది సుశీల. మరోవైపు జరిగిన దాని గురించి తలుచుకుంటుంది సుగుణ. రోహిణి వచ్చి తినమంటుంది. నాతో పాపం చేయించావుగా అని కూతురుని తిడుతుంది సుశీల. వాళ్లతో రాసుకుపూసుకుని తిరుగుతారు. వాడు ఏదో రోజు నన్ను అమ్మా అంటే నా కాపురం ఏం కావాలని రోహిణి అంటుంది.
రోహిణి, సుగుణ ఇద్దరు వాదించుకుంటారు. వాడిని దత్తత ఇవ్వడానికి నీకేం హక్కుందని రోహిణి అంటే.. అసలు నీ కొడుకు అని చెప్పుకోడానికి నీకేం హక్కు ఉంది. కని పడేసి పోయావ్. నీకేం హక్కు ఉంది. చిన్నప్పుడు నీ పెళ్లి చేసి ఒక్క తప్పు చేశాను. నువ్వు వంద తప్పులు చేశావ్. అన్నింటికంటే దరిద్రం కన్నతల్లిని చంపేయడం, నీ పతనం ఎప్పుడో మొదలైంది. ఏదో ఒక రోజు నీ రంగు తెలిసి మళ్లీ మొదటికి వస్తావ్ అని సుగుణ అంటుంది.
శాపం పెడుతున్నావా అని రోహిణి అంటుంది. బాలు మీనాలను అనిపించినందుకు నీకు, అన్నందుకు నాకు ఉసురు తగలకుండా పోదు. ఈ పాపానికి శిక్ష అనుభవించే తీరుతాం అని కోపంగా వెళ్లిపోతుంది సుగుణ. మరోవైపు మీనా బాధపడుతుంటుంది. ఇలా కూడా మాటలు పడొచ్చని తెలిసిందని బాలుతో మీనా అంటుంది. అదంతా రోహిణి వింటుంది.
బాలు డౌట్
దీనంతటికి కారణం వేరే ఉందనిపిస్తుంది, సుగుణమ్మకు అంతా తెలిసి అలా అందంటే.. చింటు వాళ్ల అమ్మ అనిపించి ఉంటుంది, ఇంకోసారి చింటును దత్తత తీసుకుంటామని తెలిసి ఇలా చేసి ఉంటుంది, కన్నకొడుకును పెంచడం రాదు గానీ దత్తత తీసుకుంటామంటే పౌరుషం వస్తుందని బాలు అంటాడు.
నాకు తెలిసి చాలా రోజుల వరకు కూతురు మాట వినదు. చూద్దాం అని బాలు అంటాడు. అదంతా విన్న రోహిణి ఏం చేసిన ఈ బాలు మారేలా లేడే అనుకుంటుంది. మరోవైపు గుడికి మౌనికకు ముడుపు కట్టేందుకు వెళ్తారు. మీనా లేదని తెలిసి ప్రభావతి తిడుతుంది. మౌనిక మీనాను మెచ్చుకుంటుంది. అలా గడ్డి పెట్టమని సత్యం అంటాడు.
ఇంతలో ఒకావిడ వచ్చి మీనా చెప్పిందని చెప్పి పూలు ఇచ్చి వెళ్లిపోతుంది. డబ్బు ఇస్తే వద్దని, మీనా తీసుకోవద్దని చెప్పిందని చెబుతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

E-Paper












