నిన్ను కోరి ఫిబ్రవరి 24 ఎపిసోడ్: కలిసి పూజ చేసిన క్రాంతి, శాలిని- భస్మంతో షాకిచ్చిన కామాక్షి- గాయాలతో ఇంటికి విరాట్
నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 24 ఎపిసోడ్ లో రౌడీలతో విరాట్ ఫైట్ చేస్తాడు. ఇంట్లో క్రాంతి, శాలినితో పూజ చేయించమని చెప్తాడు. గుడిలో లింగానికి అభిషేకం చేస్తాడు. కామాక్షి భస్మం సంచితో రాజ్, సరోజాకు షాక్ ఇస్తుంది. గాయాలతో విరాట్ ఇంటికి వస్తాడు.
నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 24 ఎపిసోడ్ లో.. గూండాలతో విరాట్ ఫైట్ చేస్తాడు. రౌడీలను చితక్కొడతాడు. విరాట్ కు కూడా దెబ్బలు తగులుతాయి. స్పృహ కోల్పోయి పడిపోతాడు. గుడిలో ఉన్న వాళ్లు విరాట్ ను లేపుతారు. అప్పుడే విరాట్ కు చంద్రకళ నుంచి కాల్ వస్తుంది.

శివుడికి అభిషేకం
నాకు ఇక్కడే లేట్ అవుతుంది. శివుడికి అభిషేకం చేయిస్తున్నానని.. శాలిని, క్రాంతితో ఇంట్లో పూజ కంప్లీట్ చేయించమని చంద్రకళకు విరాట్ చెప్తాడు. మరోవైపు శ్రుతితో మాట్లాడుతూ కామాక్షిపై రాజ్ పొగడ్తలు కురిపిస్తాడు. అప్పుడే అప్పుల అప్పారావు ఫోన్ చేసి జల్ రాజ్ ను అప్పు తిరిగి ఇవ్వమని అడుగుతాడు. ఇప్పుడు నా రేంజే వేరు అని రాజ్ బిల్డప్ ఇస్తాడు.
శాలిని, క్రాంతి కలిసి
బావ అక్కడ అభిషేకం చేస్తున్నారు కదా. ఇక్కడ క్రాంతి, శాలిని కలిసి పూజ చేస్తారని చంద్రకళ అంటుంది. నేను శాలినితో కలిసి పూజ చేయను. ఇలాంటి వాళ్లతో పూజ చేసిన ఫలితం దక్కదని క్రాంతి అంటాడు. తనకో అవకాశం ఇవ్వాలి కదా అని జగదీశ్వరి, రఘురాం, చంద్రకళ, శ్యామల చెప్తారు. మీ అందరి కోసం చేస్తున్న పూజ అంతే కానీ శాలినిని క్షమించినట్లు కాదని క్రాంతి ఒప్పుకొంటాడు.
ఓ వైపు గుడిలో శివుడికి విరాట్ అభిషేకం, మరోవైపు ఇంట్లో క్రాంతి, శాలిని కలిసి పూజ కంప్లీట్ చేస్తారు. మరోవైపు రాజ్ ఇంట్లో కూడా పూజ జరుగుతుంది. కామాక్షి హారతి ఇస్తుంది. కామాక్షికి రాజ్, సరోజ పోటీపడి మరీ మర్యాదలు చేస్తారు.
భస్మంతో షాక్
పుట్టింటి నుంచి కామాక్షి ఏం తెచ్చిందో చూద్దామని రాజ్, సరోజా తెగ ఎగ్జైట్ అవుతారు. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటిది దక్కదు. మీరు పుణ్యం చేసుకున్నారు. అని చేతిలో ఉన్న సంచిలో నుంచి బూడిదను కామాక్షి గాల్లో చల్లుతుంది. ఏంటీ బూడిదా? అని రాజ్, సరోజా షాక్ అవుతారు. సాక్షాత్తూ ఆ కాశీ విశ్వేశ్వరుణ్ని అలంకరించిన భస్మం ఇది అని కామాక్షి చెప్తుంది.
చంద్రకు థ్యాంక్స్
థ్యాంక్స్ చంద్ర. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. నీ కారణంగానే క్రాంతితో కలిసి పూజ చేశానని శాలిని అంటుంది. నా వల్ల కాదు మీ బావగారి వల్ల. ఆయన రావడం లేటవుతుందని చెప్పారు. మీతో పూజ చేయించమన్నారని చంద్ర చెప్తుంది. మీరందరూ నన్ను క్షమించారు కానీ క్రాంతి ఇంకా నన్ను అర్థం చేసుకోలేదు. నా తప్పు వల్లే క్రాంతికి దూరమయ్యానని శాలిని అంటుంది.
దొంగ ప్రామిస్
ఇంక లైఫ్ లో నా వల్ల ఇంటికి ఏ సమస్య రాకుండా చూసుకుంటానని చంద్రపై శాలిని దొంగ ప్రామిస్ వేస్తుంది. నీకు నీ భర్త ఉండడు చంద్ర అని శాలిని అనుకుంటుంది. తలకు గాయంతో వచ్చిన విరాట్ ను చూసి అందరు కంగారు పడతారు. కానీ శాలిని షాక్ అవుతుంది. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


