నిన్ను కోరి ఫిబ్రవరి 20 ఎపిసోడ్:శాలిని తల్లి ఎంట్రీ-అంద‌రిని న‌మ్మించేలా త‌ల్లిని గెంటేసిన శాలిని-కుట్రలో బిగ్ ట్విస్ట్‌

నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 20 ఎపిసోడ్ లో శాలిని తల్లి సునంద ఎంట్రీ ఇస్తుంది. శాలినిని టార్చర్ పెట్టిన రఘురాం కుటుంబం అంతు చూస్తానని వార్నింగ్ ఇస్తుంది. తల్లిని బయటకు గెంటేసిన శాలిని తాను మారానని నమ్మిస్తుంది. ఆ తర్వాత తల్లి దగ్గరకు వెళ్లి మారానని ఎలా అనుకున్నావమ్మా అంటూ ట్విస్ట్ ఇస్తుంది. 

Published on: Feb 20, 2026, 07:56:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 20 ఎపిసోడ్ లో.. శాలిని ఇంట్లో ఉండటం భరించలేనని క్రాంతి చెప్తాడు. నేను మారాను క్రాంతి. నమ్మమని శాలిని రిక్వెస్ట్ చేస్తుంది. మీ అమ్మ ఇలా చెప్పమందా? వీళ్లు అమాయకులు, నమ్మినట్లు చెప్తే మోసపోతారని చెప్పిందా? అని క్రాంతి అంటుండగానే కార్లో నుంచి ఓ మహిళ దిగుతుంది.

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

సునంద ఎంట్రీ

నీకో విషయం చెప్పనా నా ఫ్యామిలీ ఎంత చెప్పినా నేను మారను. ఎందుకంటే నువ్వు మారవు అని శాలినిని క్రాంతి నెట్టేస్తాడు. అప్పుడే లోపలికి వచ్చిన శాలిని తల్లి సునంద తన బిడ్డను పట్టుకుంటుంది. వీళ్లనా నువ్వు బతిమిలాడుతున్నావని సునంద అంటుంది. ఏం ఎంట్రీ ఇచ్చారు సునంద గారు. ఎక్స్ పెక్ట్ చేశా. అమ్మ నీ మీద విషం చిమ్మడానికి నీ వియ్యంకురాలు వచ్చిందని క్రాంతి అంటాడు.

అంతు చూస్తానని

ఏం సునందా ఎదురు నిలబడే ధైర్యం లేక నీ కూతురిని ఎరగా వేశావా? అసలు నువ్వు తల్లివేనా? ఆడదానివేనా? కూతురి మనసును చెడగొట్టావని జగదీశ్వరి ఫైర్ అవుతుంది. శాలిని పదా వెళ్దాం. నా కూతురిని అందరు కలిసి హింసిస్తున్నారు కదా మీ అంతు చూస్తానని సునంద అంటుంది. శాలిని మీ కూతురు కాదు ఈ ఇంటి కోడలు. తను ఇప్పుడే మారుతుంది. మీరు వెళ్లిపోండి అని సునందతో చంద్రకళ అంటుంది.

శాలిని డ్రామా

మన పిచ్చి కానీ ఇన్నాళ్లు కనపడని సునంద గారు ఇప్పుడు ఇల్లు వెతుక్కుంటూ వచ్చారంటే అన్ని విషయాలు ఆవిడకు ఈమె మోస్తుందని ఇంకా తెలియదా అని క్రాంతి అంటాడు. అమ్మ ప్లీజ్ దయచేసి వెళ్లిపో. లైఫ్ లో నీ ముఖం నాకు చూపించకు. నువ్వు నూరిపోసిన పగ వల్ల ఆడపిల్లని అనే విషయాన్నే మర్చిపోయా. ప్రేమ పేరుతో అందరిని మోసం చేస్తూ వచ్చా. కానీ క్రాంతి ప్రేమలో పడిపోయా. నువ్వు జన్మనిచ్చిన శాలిని చచ్చిపోయిందమ్మా అని శాలిని కన్నీళ్లు పెట్టుకుంటుంది.

నమ్మని క్రాంతి

నీకేమన్నా పిచ్చి పట్టిందా బేబీ. వీళ్లు నీకు బ్రెయిన్ వాష్ చేశారు. పదా మన ఇంటికి వెళ్దాం. వీళ్ల అంతు ఎలా చూడాలో నాకు తెలుసని సునంద అంటుంది. ఖబడ్దార్ సునందా దేవి. ఇంకొక్కసారి నా కుటుంబం జోలికి వస్తే నువ్వు నా తల్లివి అనే విషయం మర్చిపోవాల్సి ఉంటుంది అని తల్లిని శాలిని బయటకు గెంటేస్తుంది. ఇప్పుడు శాలినిని పూర్తిగా నమ్ముతున్నానని జగదీశ్వరి అంటుంది. అమ్మ ఇదంతా డ్రామా అని క్రాంతి అంటాడు.

శాలినిని క్రాంతి నమ్మడం లేదని జగదీశ్వరి బాధపడుతుంది. సునంద పెద్ద మూర్ఖురాలు. తాను అనుకున్నది సాధించడానికి ఏదైనా చేస్తుందని జగదీశ్వరి అంటుంది. ఏం చేయలేదు వదిన. శాలినిలో మార్పు వచ్చిందని శ్యామల చెప్తుంది.

శాలినికి ఏం తక్కువ. కోట్ల ఆస్తి. కానీ క్రాంతి కోసం మారిందని రఘురాం అంటాడు. ఆ మాటలు విన్న శాలిని వచ్చి మీరు అర్థం చేసుకున్నారు చాలు మామయ్య అని అంటుంది. క్రాంతిని నా ప్రేమతో మార్చుకుంటానంటుంది. శివుడికి రుద్రాభిషేకం చేయిస్తానని విరాట్ చెప్తాడు.

శాలిని ట్విస్ట్

తల్లి దగ్గరకు శాలిని వెళ్తుంది. నిజంగానే మారిపోయానని అనుకున్నావా? నేను నీ కూతురిని అమ్మా. ఆ ఇంటిని కుక్కలు చింపిన విస్తరి చేసేదాకా ఎలా వదులుతాను? అలా యాక్టింగ్ చేస్తేనే క్రాంతి తప్ప అందరూ నమ్మారు. వాళ్ల బలం ఐకమత్యం, ఆప్యాయత. ఆ ఇంటి పునాదులు కూల్చాలంటే నేను ఆ ఇంట్లోనే ఉండాలని సునందతో శాలిని చెప్పడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More