Gunde Ninda Gudi Gantalu Today Episode: సత్యం ఫ్యామిలీతో యాడ్ షూట్- 2 లక్షలు ఎగ్గొట్టిన మనోజ్- నిజం బయటపెట్టిన డైరెక్టర్
Gunde Ninda Gudi Gantalu Serial April 7th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 7వ ఎపిసోడ్‌లో మనోజ్‌కు కాల్ చేసిన ముంబై ముఖేష్ మీ ఫ్యామిలీతో ఫర్నిచర్ ప్రమోషన్ యాడ్ షూట్ చేద్దామంటాడు. అందుకు జంటకు 50 వేలు రెమ్యూనరేషన్ ఇస్తానంటాడు. కానీ, అది చెప్పకుండా మనోజ్ ఫ్రీగా యాడ్ షూట్ చేయించుకుంటాడు.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మనోజ్‌కు ఆర్డర్స్ కావాలంటూ ఫోన్ కాల్స్ వస్తుంటాయి. ఇంతలో రోహిణి వస్తుంది. అప్పుడే మనోజ్‌కు ముంబై ముఖేష్ కాల్ చేసి ప్రొడక్ట్స్ అన్ని రెడీ అయ్యాయి. రేపటి నుంచి డిస్పాచ్ చేస్తాను, షో రూమ్ పబ్లిసిటీ గ్రాండ్‌గా ఉండాలి. బడ్జెట్ అంతా నేను భరిస్తాను. ఓనర్స్ తమ బ్రాండ్స్‌కు ప్రమోట్ చేసుకుంటున్నారు. మీ ఫ్యామిలీతోనే ప్రమోషన్ చేయిద్దామని ముఖేష్ అంటాడు.

జంటకు 50 వేలు
మీ ఫ్యామిలీలో బాలు ఎక్స్‌ప్రెషన్స్ చాలా నాచురల్‌గా ఉంటాయి, తన వైఫ్ కూడా చాలా డీసెంట్‌గా ఉంటారు. మీ మదర్, ఫాదర్, బ్రదర్ అందరు బాగా ఇంపాక్ట్ చేస్తారు. ప్రతి జంటకు రూ. 50 వేలు రెమ్యూనరేషన్ ఇస్తాం. మీరు ఓకే అంటే రేపే ఏజెన్సీ వాళ్లు వచ్చి మాట్లాడుతారు అని ముఖేష్ అంటాడు. రోహిణి ఒప్పుకోమంటుంది. మనోజ్ సరేనంటాడు. బాలు, మీనాలు ఉంటారంటేనే ఇరిటేట్‌గా ఉందంటాడు మనోజ్.
బిజినెస్ కోసం తప్పదు. క్లియర్‌గా కాన్సెప్ట్ చెబితే చేస్తారు. 25 వేలు ఇస్తే సరిపోతుందని రోహిణి అంటుంది. వాళ్లేమైనా ప్రొఫెషనల్సా, కావాలంటే అమ్మకు 10 వేలు ఇద్దాం. తనే చూసుకుంటుంది. మిగతా వారికి ఒక్క రూపాయి ఇవ్వను అని కోపంగా వెళ్లిపోతాడు మనోజ్. అదే రోజు రాత్రి అందరిని పిలిచి ముంబై ముఖేష్ ఫర్నిచర్ డీలర్‌షిప్ ప్రమోషన్ కాన్సెప్ట్ గురించి చెబుతాడు మనోజ్.
తనకు నటన రాదని ప్రభావతి అంటే బాలు సెటైర్లు వేస్తాడు. మనమందరం కస్టమర్స్‌లా బాగా కనిపిస్తామని ఆయన చెప్పారని రోహిణి అంటుంది. శ్రుతి నటించడానికి ఓకే అంటుంది. తను ఏ పాత్ర అయిన చేస్తానని మీనా అంటుంది. నువ్వు మంచిదానిలా నటిస్తావ్ కదే అని ప్రభావతి అంటే.. అత్త చేసిన నాటకాలన్నీ చెప్పి పంచ్‌లు వేస్తుంది మీనా. బాలు నటించనంటాడు, మీనా కూడా అలాగే అంటుంది.
రెమ్యూనరేషన్ ఎగ్గొట్టిన మనోజ్
బాలు కావాలని ముఖేష్ అంటున్నారని మనోజ్ చెబుతాడు. సరే మీనా ఎందుకు మరి అని బాలు అంటే.. అంతా జంటలుగా రావాలన్నదేగా కాన్సెప్ట్ అని మనోజ్ అంటాడు. మీనా ఏమైనా ఐశ్వర్య రాయా అని ప్రభావతి అంటే.. మీనా అలిగి రానంటుంది. దాంతో బాలు, రవి, శ్రుతి రానంటారు. రోహణి ఒప్పుకోమని అంటుంది. అత్తయ్య బతిమిలాడితేనే వస్తానని మీనా అంటుంది. నాకోసం బతిమిలాడమ్మా అని మనోజ్ అంటాడు.
అలాగే, ప్రభావతి మీనాను బతిమిలాడుతుంది. దాంతో మీనా ఒప్పుకుంటుంది. అది సరే యాడ్ చేసేందుకు వచ్చినవాళ్లకు డబ్బులు ఇవ్వరా అని బాలు అడుగుతాడు. ఇది మన ఫ్యామిలీ బిజినెస్‌రా. సపోర్ట్ చేయవా. మనలో మనకు డబ్బులెందుకురా. నీ సాయం గుర్తు పెట్టుకుంటాగా అని మనోజ్ అంటాడు. వీళ్లంతా సెల్ఫిష్ ఎవరు లేరని మనోజ్, రోహిణిని అంతా అంటారు.
ఆ ముంబై ముఖేష్ నిజంగా ఒకరి కష్టం ఉంచుకునే వ్యక్తి కాదే అని మీనా అంటుంది. డబ్బు విషయం చెప్పకుండా మనోజ్ మనకు బాగా పేరు వస్తుందని కవర్ చేస్తాడు. సరే వాడికి మంచి జరిగితే అదే పదివేలు అని సత్యం అంటాడు. ఓనర్స్‌గా సత్యం, ప్రభావతి నటించాలని మనోజ్ అంటాడు. అలా ఫర్నిచర్ యాడ్ షూట్‌కు సత్యం ఫ్యామిలీని ఒప్పుకుంటుంది. కానీ, రెమ్యూనరేషన్‌ను మాత్రం మనోజ్ ఎగ్గొట్టి ఊరికే అని చెబుతాడు.
తల్లికి 10 వేలు
తర్వాత తల్లి ప్రభావతి దగ్గరికి వెళ్లిన మనోజ్ రూ. 10 వేలు ఇస్తాడు. నువ్వు నటించడానికి నేను ఇస్తున్న రెమ్యూనరేషన్, కళాకారుల వేతనం అని మనోజ్ అంటాడు. కానీ, ఆ ముంబై అతను డబ్బులు ఇవ్వలేదుగా అని ప్రభావతి అంటే.. ఇది నేను ఇస్తున్నా అని అబద్ధం చెబుతాడు మనోజ్. నీకు తప్ప నేను ఎవరికి ఇస్తానమ్మా అని మనోజ్ అనేసి వెళ్లిపోతాడు.
అమ్మో ఒక్కరోజు నటిస్తే 10 వేలు వస్తాయా. ఇకనుంచి బాగా నటించి డబ్బు సంపాదిస్తాను అని ప్రభావతి అనుకుంటుంది. మరుసటి రోజు మనోజ్ షాప్‌లో యాడ్ ఫిల్మ్ షూటింగ్ జరుగుతుంటుంది.మ డైరెక్టర్‌కి ముక్కు మీద కోపం అని అసిస్టెంట్ చెబుతాడు. బాలు నోరుకు హద్దు ఉండదని, గొడవ అవుతుందని అంతా అనుకుంటారు. గొడవ అవుతున్నట్లు అనిపిస్తే నేను బాలు.. చాలు అంటాను, ఆగిపోవాలని మీనా కంట్రోల్ చేసేందుకు రూల్ పెడుతుంది.
బాలు సరేనంటాడు. ఇంతలో డైరెక్టర్ ముక్కోటి ముకుందం వస్తాడు. డ్యాష్ అంటూ హడావిడి చేస్తాడు. సత్యం ఫ్యామిలీ పరిచయం చేసుకుంటుంది. అసిస్టెంట్‌ను స్క్రిప్ట్ చెప్పలేదని డ్యాష్ అంటూ తిడతాడు. తర్వాత మనోజ్ రోహిణి హై క్లాస్ కారులో వస్తారని.. రవి, శ్రుతి బీ క్లాస్ బైక్‌పై.. బాలు, మీనా లో క్లాస్ ఆటోలో వస్తారని ముక్కోటి చెబుతాడు. ముక్కోపి మేమ చేయమని బాలు అంటే.. నాకోం అవసరం నిర్మాతకు చెప్పి షూట్ క్యాన్సిల్ చేసుకోండి. ప్యాకప్ అని డైరెక్టర్ అంటాడు.
సత్యంపై డైరెక్టర్ అరుపులు
మనోజ్ బతిమిలాడుతాడు. ఆ డ్యాష్ గాడు ఓవర్ చేస్తున్నాడని బాలు అంటాడు. బాలు చాలు అని మీనా అనడంతో బాలు ఊరుకుంటాడు. మనోజ్‌ను బాగా నటించాలని డైరెక్టర్ చెబితే బాలు సెటైర్లు వేస్తాడు. షూటింగ్ నడుస్తుంది. కారులో మనోజ్, రోహిణి వస్తారు. సత్యం నటించి వెనక్కి చూసి ఓకేనా అని తప్పు చేస్తాడు. ఎలా చేయాలో దర్శకుడు చెబుతాడు. మనోజ్‌ను రిచ్‌గా నడవమని, ముష్టోడిలా కాదంటాడు డైరెక్టర్.
తర్వాత టేక్ ఓకే అంటాడు దర్శకుడు. కానీ, సత్యం గారు మీరు ఊకే కెమెరా వైపు చూస్తున్నారు. నా డ్యాష్‌లోది ఎన్నిసార్లు చెప్పను అని డైరెక్టర్ ముక్కోటి కోప్పడుతాడు. దాంతో బాలు అవమానంగా ఫీల్ అయి ఆవేశం రావడంతో మీనా ఆపుతుంది. తర్వాత రవి, శ్రుతి బైక్‌పై వస్తారు. సత్యం వంగి వంగి దండాలు పెడతాడు. దాంతో ముక్కోటి కోప్పడుతాడు. పనివాడిలా ఎందుకు చేస్తున్నారు, మీరు షాప్ ఓనర్. బానిసలా చేయకండని అరుస్తాడు.
ఓ ముక్కోపి ఏంటీ మా నాన్నను అంటున్నావ్ అని బాలు సీరియస్ అవుతాడు. మా నాన్న కూడా డైరెక్టరే. ఇంట్లో ఎన్నో రకాల పాత్రలను డైరెక్ట్ చేసే డైరెక్టరే అని బాలు అంటాడు. మీనా ఊరుకోమ్మంటాడు. సత్యం కూడా తనదే తప్పు అని ఒప్పుకుని బాలును సముదాయిస్తాడు. టేక్ మధ్యలో బాలు మాట్లాడితే ముక్కోటి కోప్పడతాడు. తర్వాత బాలు, మీనా ఆటోలో వస్తారు. వారికి ప్రభావతి నమస్కారం పెట్టదు.
నిజం బయటపెట్టిన డైరెక్టర్
దాంతో డైరెక్టర్ అడుగుతాడు. నేను లో క్లాస్ వాళ్లకు నమస్కారం పెట్టను అని ప్రభావతి అంటుంది. కస్టమర్ ఎవరైనా గాడ్‌తో సమానం అని డైరెక్టర్ అంటాడు. తర్వాత మీనాకు టచప్ చేస్తారు. మరి నాకు అని ప్రభావతి అంటే.. అదే క్లాత్ తీసుకొస్తాడు మేకప్ మ్యాన్. దాంతో వద్దంటుంది ప్రభావతి. తర్వాత షాట్ ఓకే అవుద్ది. తర్వాత క్యాష్ కౌంటర్ దగ్గర సీన్ ఉంటుంది. బాలు దిక్కులు చూస్తే డైరెక్టర్ తిడతాడు.
దాంతో ఫ్రీగా చేయించుకుందే కాకుండా అరుస్తావేంటని బాలు కోప్పడుతాడు. ఫ్రీగా ఎవరు చేయించుకోవట్లేదు. మనిషికి రూ. 25 వేలు చొప్పున మనోజ్‌కు 2 లక్షలు ఇచ్చారు అని డైరెక్టర్ ముక్కోటి నిజం బయటపెడతాడు. దాంతో అంతా షాక్ అయి చూస్తారు. మనోజ్ తల దించుకుంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


