Srija: సమంత ఫ్రెండ్ క్యారెక్టర్ చేశా, సాంగ్ షూట్ మా ఇంట్లోనే చేశాం- హీరోయిన్, నిర్మాత, డైరెక్టర్ శ్రీజ కామెంట్స్

Srija Speech Kotha Kothaga Song Launch: బుల్లితెరపై టీవీ షోలు, సీరియల్స్‌తోపాటు హీరోయిన్‌గా చేసిన శ్రీజ నిర్మాతగా, దర్శకురాలిగా మారారు. శ్రీజ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సాంగ్ కొత్త కొత్తగా. ఇటీవల కొత్త కొత్తగా సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Apr 6, 2026, 12:38:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిర్మాతలు దర్శకులుగా మారడం, డైరెక్టర్స్ నటులు అవడం, హీరోలు డైరెక్షన్ చేయడం, హీరోయిన్స్ పాటలు పాడటం వంటి ఇంట్రెస్టింగ్ సంఘటనలు సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఓసారి జరుగుతూనే ఉంటాయి. అలాగే, మెయిన్ లీడ్ రోల్ చేయడంతోపాటు స్వీయ దర్శకత్వం వహించిన హీరోలు కూడా ఉన్నారు.

సమంత ఫ్రెండ్ క్యారెక్టర్ చేశా, సాంగ్ షూట్ మా ఇంట్లోనే చేశాం- హీరోయిన్, నిర్మాత, డైరెక్టర్ శ్రీజ కామెంట్స్
సమంత ఫ్రెండ్ క్యారెక్టర్ చేశా, సాంగ్ షూట్ మా ఇంట్లోనే చేశాం- హీరోయిన్, నిర్మాత, డైరెక్టర్ శ్రీజ కామెంట్స్

డైరెక్టర్‌గా, నిర్మాతగా మారి

ఈ కోవకే చెందుతుంది టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీజ. అయితే, ఈమె స్వీయ దర్శకత్వంలో తెరకెక్కింది సినిమా కాదు. ఓ సాంగ్. అదే కొత్త కొత్తగా. బ్యూటిపుల్ హీరోయిన్ శ్రీజ డైరెక్టర్‌గా, నిర్మాతగా మారి రూపొందించిన పాటే కొత్త కొత్తగా. ఈ సాంగ్ ఆల్బమ్‌లో శ్రీజకు జోడీగా దేవగుడి సినిమా హీరో అభినవ్ శౌర్య యాక్ట్ చేశాడు.

సాంగ్ లాంచ్ ఈవెంట్

కొత్త కొత్తగా సాంగ్ ఆల్బమ్‌కు రఘురాం సంగీతం, సాహిత్యం అందించగా.. సింగర్ లిప్సిక ఆలపించారు. అయితే, ఇటీవల హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో కొత్త కొత్తగా సాంగ్ ఆల్బమ్ రిలీజ్ చేస్తూ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో అభినవ్ శౌర్య, హీరోయిన్ శ్రీజ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

హీరోగా జన్మనిచ్చారు

హీరో అభినవ్ శౌర్య మాట్లాడుతూ.. "దేవగుడి చిత్రంతో నాకు హీరోగా జన్మనిచ్చారు బెల్లం రామకృష్ణారెడ్డి గారు. ఇప్పుడు కొత్త కొత్తగా సాంగ్ ఆల్బమ్ కూడా ఆయన సపోర్ట్‌తోనే చేయగలిగాను. శ్రీజతో కలిసి ఈ సాంగ్ చేయడం హ్యాపీగా ఉంది. ఆమెకు పట్టుదల ఎక్కువ. డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా చాలా క్లారిటీగా ఉంటుంది. తను అనుకున్న ఔట్ పుట్ వచ్చేవరకు ప్రయత్నిస్తుంది" అని తెలిపాడు.

నేనే కొరియోగ్రఫీ చేశాను

"ఈ పాటకు స్టెప్స్ నేనే కొరియోగ్రఫీ చేశాను. ఈ సాంగ్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. హీరోగా స్క్రిప్ట్స్ వింటున్నా. మంచి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ చేయాలనుకుంటున్నా" అని తన అప్‌కమింగ్ సినిమాల గురించి చెప్పాడు హీరో అభినవ్ శౌర్య.

సమంత ఫ్రెండ్ క్యారెక్టర్

హీరోయిన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ శ్రీజ మాట్లాడుతూ.. "మా కొత్త కొత్తగా సాంగ్‌ను లాంచ్ చేసిన ప్రొడ్యూసర్ డీవై చౌదరి గారికి థ్యాంక్స్ చెబుతున్నా. వారి ప్రొడక్షన్‌లో నేను సీరియల్స్‌లో నటించాను. నాకు నటన అంటే ప్యాషన్. రంగస్థలం సినిమాలో సమంత ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. ఆ తర్వాత మరికొన్ని మూవీస్‌లోనూ నటించాను" అని చెప్పారు.

టీవీ ఛానెల్స్ కోసం

"టీవీ ఛానెల్స్ కోసం శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, జూ లకటక షోస్ చేశాను. శ్రీజ మ్యూజిక్ ఛానెల్‌లో మేము చేసిన సాంగ్స్ అన్నీ మంచి సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు కొత్త కొత్తగా సాంగ్ చేశాం. ఈ పాటను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేశాం. బడ్జెట్ ఎంత అయింది అనేది చూసుకోలేదు. ఈ సాంగ్‌లో కొంత షూట్ మా ఇంట్లోనే చేశాం. కొత్త కొత్తగా సాంగ్‌ను మీరంతా విని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా" అని ఆకాంక్షించారు శ్రీజ.

శ్రీజకు శుభాకాంక్షలు

కాగా, బీఆర్ఎస్ మహిళా వింగ్ మణికొండ ప్రెసిడెంట్ పటోళ్ల రూప రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని కొత్త కొత్తగా ఆల్బమ్ మంచి విజయం సాధించాలని తన బెస్ట్ విషెస్ అందించారు. అలాగే, ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్రీజ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More