Gunde Ninda Gudi Gantalu Today Episode: ప్రభావతి శివతాండవం- జైలుకు శివ- కుప్పకూలిన పార్వతి- బాలుపై విషం నింపిన గుణ!

Gunde Ninda Gudi Gantalu Serial March 26th Episode: గుండె నిండా గుడి గంటలు మార్చి 26 ఎపిసోడ్‌లో ప్రభావతికి శివ దొంగనతనం వీడియో రోహిణి చూపిస్తుంది. దాంతో పార్వతి ఇంటికి వెళ్లి శివతాండవం చేస్తుంది ప్రభావతి. మీనా వాళ్లకు కూడా దొంగతనం గురించి చెబుతుంది ప్రభావతి. దాంతో పార్వతి కుప్పకూలిపోతుంది.

Published on: Mar 26, 2026, 08:35:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో ప్రేమ్‌కు ప్రభావతి పనిష్‌మెంట్ ఇస్తే గుంజీలు తీస్తాడు. ఇంతలో రోహిణి వచ్చి పిలుస్తుంది. మీరు మోసపోయారని రోహిణి చెబుతుంది. మీనా, బాలు మోసం చేశారని రోహిణి అంటే.. వాళ్లు మోసం చేయరని రాసిస్తానంటుంది కామాక్షి.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మార్చి 26 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ మార్చి 26 ఎపిసోడ్‌

ప్రభావతికి చూపించిని రోహిణి

శివ దొంగతనం వీడియోను ప్రభావతికి చూపిస్తుంది రోహిణి. శివే దొంగతనం చేశాడని తెలిసి ప్రభావతి నిర్ఘాంతపోతుంది. ఈ మీన కుటుంబమే మన లక్ష కొట్టేసింది. మన ఇంట్లో లక్ష ఉన్నట్లు వాడికి ఎలా తెలిసింది. మీనా చెబితేనేగా. అందుకే కుటుంబం అన్నా. ఆ లక్ష పోయాయనే ఫైనాన్షియర్ లాకప్‌లో పెట్టాడు, అప్పుడు ఇల్లు తాకట్టు గురించి తెలిసింది, దానికే బాలుగాడు ఇంట్లో ఖైదీలా నిలబెట్టాడు పాత పగ గుర్తు తెచ్చుకుంటుంది ప్రభావతి.

ఇవాళ నా ప్రళయతాండవం చూస్తావని రోహిణిని పార్వతి ఇంటికి తీసుకెళ్తుంది ప్రభావతి. మరోవైపు శివను గుణ ఆపుతాడు. లవ్ శివ, నువ్వు లేకుండా ఉండలేకపోతున్నా. ఇప్పుడు నువ్వు సెలబ్రిటీవి అని దొంగతనం చేసిన వీడియోను శివకు చూపిస్తాడు గుణ. ఎంత పని చేశావ్ గుణ అని కాలర్ పట్టుకుంటాడు శివ. ఈ విధంగా రివేంజ్ తీర్చుకోవాలనుకుంటున్నావా అని శివ అంటాడు.

నా మొహం ఉంది. నేనేలా చేస్తాను. మీ బావే వీడియో రిలీజ్ చేశాడని గుణ చెబుతాడు. మా బావ అలా చేయడు. ఫోన్ తన దగ్గర లేదు. ఎవరో దొంగతనం చేసి లీక్ చేశారు. ఇదంతా నువ్వే చేశావనిపిస్తుందని శివ అంటాడు. నేను కూడా దొరికిపోతానుగా. మీ బావ నిన్ను మోసం చేస్తున్నాడు. ఎలాంటి దురుద్దేశం లేకుండా వీడియో డిలీట్ చేసి ఉండొచ్చుగా అని శివ మనుసులో విషం నింపుతాడు గుణ.

బాలు మోసం చేస్తున్నాడంటూ

కానీ, శివ నమ్మకుండా వెళ్లడు. ఇంకాసేపట్లో పోలీసులు శివను తీసుకెళ్తారు. అప్పుడు వాడే మన దగ్గరికి వస్తాడని గుణ అంటాడు. మరోవైపు బాలు ప్యాసెంజర్స్ కూడా శివ దొంగతనం గురించి మాట్లాడుకుంటారు. పిల్లలు బాగా పాడైపోయారని అంటుంటే బాలు కూడా నిజమే అని వాళ్లతో పాటు చెబుతాడు. మరోవైపు పార్వతి ఇంట్లో మీనా సుమతి పెళ్లి గురించి మాట్లాడుతుంది.

ఇంతలో శివ వస్తాడు. తండ్రిని చూసి బాధపడుతాడు. ఇంతలో పార్వతి ఇంటికి ప్రభావతి, రోహిణి వస్తారు. నీ ఇంట్లో ఎంతమంది దొంగలు ఉన్నారు. నీ తమ్ముడు ఎక్కడ అని ప్రభావతి అడుగుతుంది. శివను చూసి కోపంతో రగిలిపోయిన ప్రభావతి లాక్కొస్తుంది. శివను దారి కాసి దొంగతనం చేస్తావా అని తిడుతుంది, కొడుతుంది ప్రభావతి. శివ తాండవం చేస్తుంది ప్రభావతి. మీనా, పార్వతి ఆపుతారు.

నాకు వచ్చే కోపానికి చెంపదెబ్బ సరిపోదు, చెప్పుతో కొట్టాలని ఎడా పెడా చెప్పుతో కొడుతుంది ప్రభావతి. నా పుట్టింటివాళ్లను అవమానిస్తే ఊరుకోను అని మీనా తిరగబడుతుంది. లక్ష రూపాయలు కొట్టేశాడు. ఇందులో మీ వాటా ఎంత అని ప్రభావతి అంటుంది. ఏ తప్పు చేయనిదే కిక్కురుమనకుండా ఉంటాడా నీ తమ్ముడు అని రోహిణి అంటుంది.

కుప్పకూలిపోయిన పార్వతి

ఏం చేశావురా అని అంతా అడుగుతారు. దాంతో రోహిణి వీడియో చూపిస్తుంది. అది చూసి నివ్వేరపోతారు మీనా, పార్వతి, సుమతి. ఇంటి బయట జనం అంతా పోగై మేము కూడా చూశామంటారు. దాంతో పార్వతి కుప్పకూలిపోతుంది. ఎంత పని చేశాడే వాడు, ఒక చిన్న తప్పు చేశాడనే కదే మీ నాన్న బస్సు కింద పడి చనిపోయాడు, ఇప్పుడు వీడు నేరం చేశాడు అని పార్వతి ఏడుస్తుంది.

శివను మీనా కూడా కొడుతుంది. తిన్న తినకున్నా ఇంట్లో ఉండమని నాన్న, కారం వేసుకుని తిన్నా తప్పు చేయొద్దని అమ్మా ఎంత చెప్పారురా. అయినా ఇలా చేశావేంటీ అని తిడుతుంది మీనా. మీకోసమే కదరా అక్కడ అన్ని అవమానాలు పడుతున్నాను అని మీనా అంటుంది. సుమతి కూడా శివను కొడుతుంది.

మీరు కొడితే ఊరుకుంటానని అనుకుంటున్నారా. వీన్ని జైలుకు పంపించందే నేను ఊరుకోను అని బయటకు లాక్కొస్తుంది ప్రభావతి. ఇలా దొంగతనం చేసిన డబ్బుతోనే సుమతి పెళ్లి చేస్తారని అందరిలో పార్వతి పరువు తీస్తుంది ప్రభావతి. మరోవైపు సత్యం ఇంటికి బాలు వస్తాడు. మీనా గురించి అడుగుతాడు.

జైలుకు శివ

మీనా ఇకనుంచి ఇంటికి (అత్తింటికి) రాదు. దొంగ కుటుంబం నుంచి కోడలును తెచ్చుకున్న అపవాదు నాకు వద్దు అని ప్రభావతి అంటుంది. దాంతో బాలు షాక్ అవుతాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More