Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనాకు 10 వేల అడ్వాన్స్- పారిపోయిన మాణిక్యం- బిర్యానీకి మనోజ్, ప్రభావతి టెంప్ట్

Gunde Ninda Gudi Gantalu Serial April 21st Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 21వ ఎపిసోడ్‌లో చేతబడి పరిహానికి ప్రభావతి ఒప్పుకుంటుంది. అందుకోసం ఉపవాసం ఉంటారు. మీనాకు చిన్న ఫంక్షన్ ఆర్డర్ వస్తుంది. అందుకు రూ. 10 వేలు అడ్వాన్స్ కూడా ఇస్తారు. బిర్యానీకి ప్రభావతి, మనోజ్ టెంప్ట్ అవుతారు.

Published on: Apr 21, 2026, 08:39:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రెండు నిమిషాల్లో చావు అంచులదాకా వెళ్లొచ్చినట్లు ఉందని ప్రభావతి కరెంట్ షాక్ గురించి మాట్లాడుతుంది కామాక్షి. నీ మీద నాకు పీకల లోతు కోపం ఉంది మాట్లాడకు అని ప్రభావతి అంటుంది. ఇదంతా దాని ఎఫెక్టే అని మనోజ్ వచ్చి అంటాడు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 21 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 21 ఎపిసోడ్

కొడుకు చెప్పిన వినలేదట

అసలు నువ్వెందుకు స్విచ్ ఆన్ చేశావని ప్రభావతి అడిగితే.. షో రూమ్‌కు వెళ్దామని మనోజ్ అంటాడు. మనోజ్ గాడిలో చాలా మార్పు వచ్చిందని పొగుడుతుంది కామాక్షి. హ్యాండ్ స్కూల్ (చేతబడి) ఎఫెక్ట్ గురించి జరిగినవన్నీ చెప్పి పరిహారం చేద్దామని మనోజ్ అంటాడు. నిజమే, గతేదాడి పక్క ఊరిలో సుబ్బలక్ష్మీకి ఇలాగే జరిగింది. జుట్టు రాలిపోయి, పళ్లు ఊడిపోయి చివరికి కళ్లు తేలేసింది. ఆవిడకు ఇలాగే చేశారట. కొడుకు చెప్పిన వినలేదట అని కామాక్షి అంటుంది.

నేను నీతో మాట్లాడను. నీతో మాట్లాడటం ఇదే ఆఖరుసారి. నీకు నాకు తెగిపోయిందని ప్రభావతి అంటుంది. ఇది కూడా దాని ఎఫెక్టేరా తొందరగా పరిహారం చేయించు అని మనోజ్‌కు చెబుతుంది కామాక్షి. ప్రభావతి అరవడంతో కామాక్షి వెళ్లిపోతుంది. తల్లిని ఒక్కరోజే కదా అని మనోజ్ బతిమిలాడుతాడు. ఒక్కరోజే కదా, తర్వాత ఏమైనా నేను సేవలు చేస్తాను అని రోహిణి అంటుంది. సీలింగ్ కూడా మనమీద పడుతుందేమో అని భయపెడతాడు మనోజ్.

దాంతో సరేనని చేతబడి పరిహారానికి ఒప్పుకుంటుంది ప్రభావతి. మరోవైపు మీనాకు ఒకతని నుంచి స్టేజ్ ఫంక్షన్ ఆర్డర్ ఉందని, కానీ పెద్దగా లాభం రాకపోవచ్చు. అయితే మీ వర్క్ చాలా మందికి తెలుస్తుందని అతను చెబుతాడు. ఇప్పుడే బయలుదేరి వస్తానని చెబుతుంది మీనా. నాకు వచ్చిన ఈ చిన్న అవకాశం పెద్దదిగా అనిపిస్తుంది. అందరికి నచ్చేలా దీవించు అని దేవుడుకు మొక్కుకుని వెళ్తుంది మీనా. కాల్ చేసిన అతన్ని వెళ్లి కలుస్తుంది.

అడ్వాన్సుగా 10 వేలు

ఇది చాలా చిన్న ఫంక్షన్, పెద్దగా కంగారుపడకండి. అన్నీ మీరే చూసుకోవాలి అని అతను చెబుతాడు. జీవితంలో డబ్బు కంటే ముందు పేరు సంపాదించుకోవడం ముఖ్యమనుకునేదాన్ని, బాగా చేస్తానంటుంది మీనా. దీనికి రూ. 14 వేలు ఖర్చు రావచ్చు. ముందుగా 10 వేలు ఇస్తున్నాను అని మీనాకు అడ్వాన్స్ ఇస్తాడు అతను. తర్వాత అగ్రిమెంట్ పేపర్‌పై సంతకం మీనాతో సంతకం చేయించుకుంటాడు.

డెకరేషన్ మొదలుపెట్టాక నాకు వచ్చిన మొదటి అడ్వాన్స్ ఇది. ఆయనకు చెప్పాలని మీనా వెళ్లిపోతుంది. ఇంటికెళ్లిన మీనా జరిగింది సత్యంకు చెప్పి స్వీట్స్ ఇస్తుంది. ఎప్పుడో అప్పుడు అడుగు పడితేనే ముందడుగు వేయగలం. నీ మొదటి అడుగు పడింది. నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని స్వీట్స్ తీసుకుంటాడు సత్యం. ఇంతలో వచ్చిన ప్రభావతి అడ్డుకుంటుంది. మీకు షుగర్ వచ్చిందని ప్రభావతి చెబుతుంది.

మీనా డెకరేషన్ ఆర్డర్ గురించి చెబితే ప్రభావతి చాలా చులకనగా మాట్లాడుతుంది. దాంతో గాడిద అంటూ పంచ్‌లు వేస్తాడు సత్యం. ఇంతలో రోహిణి, మనోజ్ వస్తారు. విషయం తెలిసి రోహిణి స్వీట్ తీసుకుంటుంది. మనోజ్ మాత్రం అది ఏ షాప్‌లో తీసుకొచ్చారో అని చులకనగా చేస్తాడు. ఇంతలో బాలు వస్తే విషయం తెలిసి.. ఇది మా అమ్మ రగిలిపోయే వార్త అని అంటాడు. డెకరేషన్ చేస్తే పెద్ద బిజినెస్ వుమెన్ అవుతుందా అని మనోజ్ అంటాడు.

ప్రీ వెడ్డింగ్ షూట్ ఆర్డర్స్

నీలా మామ డబ్బుతో పెట్టుకోలేదుగారా అని బాలు అంటాడు. మంచి పలకొచ్చుగారా, బుద్ధి లేదా అని, చెడు కోరుకుంటే నోరు పడిపోతుందని మనోజ్‌ను తిడతాడు సత్యం. మీనాను అందరికి బిర్యానీ చేయమంటాడు బాలు. మా హోటల్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్స్ వంటివి ప్లాన్ చేస్తారు. ఆ ఆర్డర్ కూడా నీకే ఇప్పిస్తానని రవి చెబుతాడు. వంట కోసం సామాన్లు తీసుకొస్తానని మీనా చెబితే.. తమకేం వద్దని ఉపవాసం ఉంటున్నామని ప్రభావతి చెబుతుంది.

బిర్యాని చేసేందుకు ఓ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది మీనా. తనకు కుదరదని, కానీ మంచి మటన్ ఇప్పిస్తానని చెబుతుంది. దాంతో మటన్ కోసం మీనా, తన ఫ్రెండ్ వెళ్తారు. మరోవైపు మటన్ కొట్టు మాణిక్యంకు ఎడమ కన్ను అదురుతుందని కంగారుపడతాడు. ఇంతలో మాణిక్యం దగ్గరికి మీనా ఫ్రెండ్ వెళ్లి మటన్ అడుగుతుంది. మీనా పక్కన రోడ్డు మీద ఫోన్ మాట్లాడుతుంది. మీనాను చూసి మొహానికి టవల్ కట్టుకుంటాడు.

ఇంతలో మీనా వస్తుంది. మొహనికి అలా అడ్డంగా కట్టుకున్నారని మీనా అడిగితే పంటి నొప్పి అని పక్కన పని చేసే అతను చెబుతాడు. చేతులు వణికిపోతున్నాయేంటని మీనా అడుగుతుంది. ఇలాంటి మనిషిని ఎక్కడో చూశాను. కానీ, గుర్తు రావట్లేదు అని మీనా అంటుంది. నాలుగు కిలోల మటన్‌కు నాలుగు వేలు అయిందని మాణిక్యం చెబుతాడు. ఇకనుంచి ఇదే షాప్‌కు మా మీనా వస్తుందని ఆమె చెబుతుంది.

బిర్యానీకి మనోజ్, ప్రభావతి టెంప్ట్

ఆ టవల్ తీయండి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుందని మీనా అంటుంది. వెంటనే ఈ విషయం రోహిణికి చెప్పాలని పక్కకు పారిపోతాడు మాణిక్యం. దాంతో మీనా వెళ్లిపోతుంది. మీనా మటన్ తీసుకొస్తుంది. ఇంట్లో వ్రతం చేస్తున్నాం. ఇంట్లో వండకండని ప్రభావతి అంటుంది. దాంతో ఇంటి బయట 15 మందికోసం అని మటన్ బిర్యానీ వండుతుంది మీనా. మీనాకు బాలు, రవి, శ్రుతి హెల్ప్ చేస్తారు.

మీనా చేసే వంటను శ్రుతి వీడియో తీస్తుంది. మటన్ వాసనకు మనోజ్ టెంప్ట్ అవుతాడు. థ్యాంక్స్ మనోజ్. స్వామిజీ అడిగినప్పుడు నా పేరు చెప్పనందుకు. మంచిగా ఇప్పుడు నేను బిర్యానీ తినవచ్చు అని రోహిణి అంటుంది. మీనా బిర్యానీకి ప్రభావతి కూడా టెంప్ట్ అవుతుంది. మనోజ్, ప్రభావతి, రోహిణి వెళ్లి ఆశగా మీనా చేస్తున్న బిర్యానీ వంట వైపు చూస్తారు. ఇంతలో సత్యం వచ్చి తినొచ్చుగారా అని అడుగుతాడు.

బిర్యానీ కోసం చూస్తే ప్రాణాలు పోతాయని మనోజ్ వద్దంటాడు. బిర్యానీని సత్యం టేస్ట్ చూస్తాడు. చాలా బాగుందని మెచ్చుకుంటాడు. కావాలంటే రేపు వ్రతం చేద్దాంరా అని ప్రభావతి అంటుంది. మీనా వాళ్లతో కలిసి రోహిణి కూడా బిర్యానీ తింటుంది. అందరూ కూర్చుని బిర్యానీ తింటారు. మనోజ్, ప్రభావతి ఆశగా చూస్తారు. తర్వాత విద్య ఇంటికి వెళ్లిన మాణిక్యం రోహిణికి మీనా వచ్చింది చెబుతాడు.

మీనా విషయం చెప్పిన మాణిక్యం

కానీ మీనా నన్ను చూడకుండా గుడ్డ కట్టుకున్నానని మాణిక్యం చెబుతాడు. బతికించావ్, గుండె ఆగినంత పనయిందని రోహిణి అంటుంది. అబద్దం చెప్పకూడదని మా నాన్న ఎప్పుడు చెబుతుండేవాడు. కానీ, నీవల్ల ప్రతిసారి అబద్ధం చెప్పాల్సి వస్తుందని మాణిక్యం అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More