Gunde Ninda Gudi Gantalu Today Episode: చెప్పు తెగే దాకా కొడతా, ఊర కుక్క.. మనోజ్‌ను కొట్టిన ప్రభావతి- ఏడిపించేసిన బాలు!

Gunde Ninda Gudi Gantalu Serial April 16th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 16వ ఎపిసోడ్‌లో బాలు వేసిన ప్లాన్ సత్యంకు తెలుస్తుంది. చాలా ఎమోషనల్‌గా బాలును హగ్ చేసుకుంటాడు. సుగుణ ఊరికి వెళ్లిన బాలు కాల్ చేస్తే సుగుణ కోపంగా మాట్లాడుతుంది. చింటు జీవితంలో రహస్యం ఉందని బాలు డౌట్ పడతాడు.

Apr 16, 2026, 09:03:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో సత్యం ఇంకా ఇంటికి రాలేదని ప్రభావతి బాధగా ఎదురుచూస్తుంటుంది. బాలు సెటైర్లు వేస్తాడు. ఇంతలో సత్యం వస్తాడు. ప్రభావతి తెగ సంతోషిస్తుంది. ఉద్యోగం దొరికిందని సత్యం చెబుతాడు. ఏం జాబ్ అని అడుగుతారు. పార్కులో పిల్లలకు నీతి కథలు చెప్పాలని సత్యం చెబుతాడు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 16 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 16 ఎపిసోడ్

జీతం ఎంతిస్తున్నారు

మంచి ఉద్యోగమే. జీతం ఎంతిస్తున్నారని ప్రభావతి అడుగుతుంది. రోజు ఓ గంట నీతి కథలు చెబితే ఎంత ఇస్తారు. న్యాయంగా ఇస్తే చాలు, నా వయసుకు తగిన ఉద్యోగం ఇది అని సత్యం అంటాడు. పూర్తి జాబ్ దొరికే వరకు ఇది. ఇది చేస్తూనే అది వెతుక్కుంటా అని సత్యం అంటాడు. సీరియస్‌గా ట్రై చేయి నాన్న దొరుకుతుందని మనోజ్ అంటే బాలు పంచ్‌లు వేస్తాడు. నేను చేసేది రోజుకో గంట మాత్రమే. దీనిపై గొడవ అవసరం లేదు అని సత్యం అంటాడు.

కట్ చేస్తే పిల్లలకు సత్యం నీతి కథలు చెబుతాడు. పంచ తంత్రం కథలు చెబుతాడు. పిల్లలకు చెబుతుంటే తల్లిదండ్రులు కూడా వచ్చి వింటారు. ఇలాంటి కథలు చెప్పేవాళ్లు కరువైపోయారు. అలాంటిది ఇంతమంది పిల్లలను పోగేసి చెబుతున్నారు. పైగా ఫ్రీగా చెబుతున్నారు అని ఒకావిడ అంటుంది. దాంతో సత్యం అనుమానిస్తాడు. ఫ్రీగానా మరి అడ్వాన్స్ ఎలా వచ్చిందని సత్యం అనుకుంటాడు.

ఇంతలో రంగా వస్తాడు. నాకు పనిపాట లేదని నాకు ఫ్రీగా డబ్బు ఇచ్చావా. స్నేహంలో దాపరికాలు ఉండవు అని సత్యం అంటాడు. నీకు బాలు లాంటి కొడుకు ఉండటం అదృష్టంరా అని ఇదంతా బాలు ప్లాన్ పని అని, నువ్ కష్టపడకూడదని ఇలా చేశాడని రంగా నిజం చెప్పేస్తాడు. చింటు వాళ్ల ఊరికి ట్రిప్ కోసం బాలు వెళ్తాడు. ప్యాసెంజర్స్‌ను దింపిన తర్వాత చింటు వాళ్ల ఇంటికి వెళ్తాడు బాలు. ఇంటికి తాళం వేసి ఉంటుంది.

సుగుణకు బాలు కాల్

చింటు వాళ్ల అమ్మమ్మకు ఒంట్లో బాగుండటం లేదు. హాస్పిటల్‌కు వెళ్లినట్లున్నారని వాళ్ల చెల్లి వచ్చి చెబుతుంది. ఓసారి కాల్ చేద్దామని సుగుణకు కాల్ చేస్తాడు బాలు. అప్పుడే రోహిణి, విద్య తల్లి ఇంటికి వెళ్తారు. తను చెప్పినట్లే మాట్లాడమని కాల్ లిఫ్ట్ చేయమంటుంది రోహిణి. సుగుణ కాల్ లిఫ్ట్ చేస్తుంది. అమ్మా నేను మీ ఇంటి బయటే ఉన్నాను. మీరెక్కడ ఉన్నారని బాలు అడుగుతాడు. దాంతో అంతా షాక్ అవుతారు.

విద్య వెళ్లి చెక్ చేసి వస్తుంది. లేడని చెబుతుంది. ఇప్పుడు అక్కడ ఉండటం లేదు, వేరే ఊరికి వచ్చామని చెబుతుంది సుగుణ. ఏ ఊరు, ఎక్కడ అని బాలు అడిగితే.. సుగుణను కోపంగా మాట్లాడమని రోహిణి చెబుతుంది. దాంతో బాలుపై తెగ కోప్పడుతుంది సుగుణ. బాలు బాధపడుతాడు. తను అలా మాట్లాడే మనిషి కాదు. నాకు ఎక్కడో తేడా కొడుతుందని బాలు డౌట్ పడతాడు.

మరోవైపు మీనా ఇంట్లో వంట చేస్తుంది. బాలు వెళ్లి ఇంటికి నువ్వు అన్నపూర్ణ అని అంటాడు. తర్వాత సుగుణ వేరే ఊరికి వెళ్లడం గురించి, సుగుణ అన్న మాటలు అన్ని చెబుతాడు బాలు. అప్పుడే రోహిణి వస్తుంది. బాలు మాటలు వింటుంది రోహిణి. సుగుణ అలా మాట్లాడటంపై బాలు, మీనా ఇద్దరు డౌట్ పడతారు. నాకెందుకో చింటు జీవితంలో ఏదో రహస్యం ఉంది. అది మనకు తెలియకూడదని వాళ్లు అనుకుంటున్నారు. దుబాయిలో ఉన్న వాళ్ల అమ్మే ఇలా చేస్తుందనుకుంటా. ఆవిడ ఇక్కడే ఉండి ఉంటుందని బాలు అంటాడు.

సుశీలతో ఎంక్వైరీ

నా సంగతులు ఇతనికెలా తెలుస్తున్నాయని రోహిణి భయపడుతుంది. వాళ్లు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలు. మన షీల డార్లింగ్ ఉండే పక్క ఊరిలో వాళ్ల చెల్లి ఉంటుంది కదా. షీలాతో ఎంక్వైరీ చేయిద్దామని బాలు అంటాడు. నేను ఎంత పరుగెత్తుతున్నా పట్టుకుంటునే ఉంటున్నాడు. దొరకకూడదు. ఏ ఒక్క చిన్న క్లూ కూడా దొరకకూడదు అని రోహిణి అనుకుంటుంది. సత్యం ఇంటికి వస్తాడు. మీనా నీళ్లు ఇస్తుంది.

అంతా వస్తారు. ఎన్నో రోజులు కథలు చెబితే 3 లక్షలు వస్తాయని ప్రభావతి అంటుంది. కథలు చెప్పడమే కదా చాలా ఈజీ పని అని మనోజ్ అంటాడు. బాలు వచ్చి సెటైర్లు వేస్తాడు. సత్యం డల్‌గా ఉండటంతో ఏమైంది అని అడుగుతాడు బాలు. నీ కష్టాన్ని నా కష్టార్జీతంగా చెప్పుకోవాలంటే చాలా కష్టంగా ఉందిరా అని బాలును చాలా ప్రేమగా హగ్ చేసుకుంటాడు సత్యం. అంతా షాక్ అవుతారు.

మా నాన్న నీ కొడుకుగా పుడుతాననేవాడురా. అప్పుడప్పుడు నీ రూపంలో నాకు నాన్న పుట్టాడనిపించేది. కానీ ఈసారి చాలా నమ్మకంగా అనిపిస్తుంది. మా నాన్న మళ్లీ పుట్టాడురా. నాన్నకే నాన్న. నాకు పని కల్పించి ఆ పనికి నువ్వే డబ్బులు ఇప్పిస్తున్నావ్. ఎందుకురా ఇంత ప్రేమ నేనంటే.. వీళ్లకే ఎక్కువ చేశాను కదరా. నీకే తక్కువ చేశాను అని సత్యం అంటాడు. అమ్మ పక్కన పెడితే అమ్మ ప్రేమ కూడా నువ్వే చూపించావుగా నాన్న అని బాలు ఎమోషనల్‌గా చెబుతాడు.

మనోజ్‌ను కొట్టిన ప్రభావతి

తండ్రి చూపించిన ప్రేమను చాలా గొప్పగా చెబుతాడు బాలు. అమ్మ స్థానం నీదే నాన్న స్థానం నీదే అని బాలు అంటాడు. దాంతో ప్రభావతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అలా అందరిని బాలు ఏడిపించేస్తాడు. నీ జీతాన్ని నా జీతంగా చెప్పుకోలేనురా. నీ అప్పు తీర్చడమనేది సాకు మాత్రమేరా. నువ్వు గర్వ పడేలా పని చేయనివ్వరా అని సత్యం వెళ్లిపోతాడు. అంతా ఎమోషనల్‌గా ఉంటారు.

మా నాన్న పిచ్చిగానీ, ఆయనేమైనా ఐఏఎస్ చదివాడా. ఈ వయసులో సెక్యురిటీ గార్డ్ లాంటి ఉద్యోగాలు తప్పా ఇంకేం దొరుకుతాయ్ అని మనోజ్ హేళనగా అంటాడు. దాంతో ప్రభావతి వచ్చి కోపంగా మనోజ్‌ చెంప చెల్లుమనిపిస్తుంది. సచ్చినోడా. వాడికి నాకు ఒక్క క్షణం కూడా పడదురా. కానీ, కన్నతల్లిని ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడో వాడిని చూసి నేర్చుకో. నేను చేసిన అప్పును తీర్చేందుకు నా భర్త ఉద్యోగం చేస్తానంటే ఎగతాళి చేస్తావా అని తిడుతుంది ప్రభావతి.

చెప్పు తెగేదాకా కొడతా.. ఊర కుక్క అని మనోజ్ దుమ్ము దులిపి పోతుంది ప్రభావతి. సత్యం చేసినదాన్ని మంచి అనుభూతిగా అనిపించిందని మీనాతో చెబుతాడు బాలు. మీ తండ్రికొడుకుల బంధం చూసి ఒక్కసారి కుళ్లుకున్నాను. ఇంట్లో అందరు కుళ్లుకున్నారు అని మీనా చెబుతుంది. ఇద్దరు సత్యం గురించి, బంధాల గురించి మాట్లాడుకుంటారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More