Manchu Manoj On POCSO: బండి భగీరథ్‌పై పోక్సో కేసు- మంచు మనోజ్ సంచలన ట్వీట్- న్యాయానికి అధికారం, పదవి అడ్డు కాకూడదంటూ!

Manchu Manoj Tweet On Bandi Bhageerath Pocso Case: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తీవ్రంగా స్పందించారు. చట్టం ముందు అందరూ సమానులేనని, బాధితురాలికి నిష్పక్షపాతంగా న్యాయం జరగాలని మంచు మనోజ్ డిమాండ్ చేశారు. మనోజ్ ట్వీట్ వైరల్ అవుతోంది.

Published on: May 11, 2026, 16:49:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Manchu Manoj Tweet On Bandi Bhageerath Pocso Case: టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు. రాజకీయంగా, సామాజికంగా అత్యంత సున్నితమైన అంశాలపై స్పందించే మనోజ్.. తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసుపై గొంతు విప్పారు.

బండి భగీరథ్‌పై పోక్సో కేసు- మంచు మనోజ్ సంచలన ట్వీట్- న్యాయానికి అధికారం, పదవి అడ్డు కాకూడదంటూ!
బండి భగీరథ్‌పై పోక్సో కేసు- మంచు మనోజ్ సంచలన ట్వీట్- న్యాయానికి అధికారం, పదవి అడ్డు కాకూడదంటూ!

రాజ్యాంగం ముందు అందరూ సమానులే

సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యాయి. రాజకీయ పలుకుబడి, పదవి లేదా హోదా అనేవి ఎప్పుడూ న్యాయానికి అడ్డుగోడలుగా నిలవకూడదని మంచు మనోజ్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

నన్ను తీవ్రంగా కలిచివేసింది

"కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి కుమారుడు బండి భగీరథ్‌పై ఇటీవల నమోదైన పోక్సో కేసు నన్ను తీవ్రంగా కలచివేసింది. పరిస్థితులు ఎలా ఉన్నా.. ప్రతి మైనర్ బాలికకు కచ్చితంగా న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతోనే #POCSO చట్టాన్ని తీసుకువచ్చారని నేను బలంగా నమ్ముతున్నాను" అని మంచు మనోజ్ అన్నారు.

ప్రతి బాలికకు సమానమైన న్యాయం దక్కాల్సిందే

"అధికారం, పదవి, పలుకుబడి లేదా హోదా ఎప్పుడూ న్యాయానికి అడ్డు రాకూడదు. రాజ్యాంగం, చట్టం దృష్టిలో ప్రతి బాలికకు సమానమైన న్యాయం దక్కాల్సిందే. మైనర్లకు సంబంధించిన కేసుల్లో వేగంగా స్పందించాలి, అలాగే పారదర్శకత, జవాబుదారీతనం చాలా అవసరం. విచారణలో జాప్యం జరిగినా, మౌనం వహించినా లేదా పక్షపాత చర్యలు తీసుకున్నా.. అది న్యాయవ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తుంది" అని మంచు మనోజ్ రాసుకొచ్చారు.

ఎలాంటి ఒత్తుళ్లకు తావులేకుండా

"ఇది రాజకీయాలకు లేదా వ్యక్తులకు సంబంధించిన విషయం కాదు. కేవలం నిజం బయటకు రావాలి, న్యాయం గెలవాలి. ఎలాంటి ఒత్తిళ్లు, ప్రభావాలకు తావులేకుండా ఈ కేసు దర్యాప్తు, చట్టపరమైన ప్రక్రియలన్నీ అత్యంత వేగంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని మంచు మనోజ్ తెలిపారు.

అందరం సమానులే అని

"న్యాయం జరగడమే కాదు, అది జరిగినట్లు అందరికీ స్పష్టంగా కనిపించాలి. చట్టం ముందు అందరూ సమానులే అని ఈ కేసు ద్వారా మరోసారి నిరూపితం కావాలి" అని మంచు మనోజ్ కోరారు. దీంతో మంచు మనోజ్ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

రేవంత్ రెడ్డి స్పందన

బండి భగీరథ్‌పో నమోదైన పోక్సో కేసుపై సినీ ఇండస్ట్రీ నుంచి ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు. అందరికంటే ముందుగా మంచు మనోజ్ ఈ కేసు విషయంలో స్పందించడం చర్చనీయాంశంగా మారింది. కాగా, తాజాగా బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి, హోంమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.

ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు

ఈ కేసు సమగ్ర విచారణ కోసం ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంలో కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More