Gunde Ninda Gudi Gantalu Today Episode: రివర్స్ అయిన రోహిణి- మనోజ్‌ను అవమానించిన భార్య-బెడ్ రూమ్‌లో గొడవ-దిష్టిబొమ్మంటూ!

Gunde Ninda Gudi Gantalu Serial May 8th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ మే 8వ ఎపిసోడ్‌లో కల్పన సాక్షిగా వచ్చి వడ్డీతో సహా 45 లక్షలు ఇచ్చినట్లు చెప్పి వెళ్లిపోతుంది. రోహిణిపై విరుచుకుపడిన ప్రభావతి చితకబాదుతుంది. కానీ, ప్రభావతిపై రోహిణి రివర్స్ అయి మనోజ్‌ను అవమానిస్తుంది. అంతా షాక్ అవుతారు.

Published on: May 8, 2026, 09:01:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మనోజ్ రెండోసారి 40 లక్షలు తీసుకున్నాడని తెలుసు అని బాలు అంటే రోహిణి సాక్ష్యం అడుగుతుంది. సాక్షి కూడా వస్తారని బాలు చెబుతాడు. కల్పనను బాలు పిలుస్తాడు. కల్పన వస్తుంది. కల్పనను చూసి మనోజ్, రోహిణి షాక్ అయిపోతారు. ఇద్దరి మొహాలు చూసుకుని దొరికిపోయామనకుంటారు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మే 8 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ మే 8 ఎపిసోడ్

మరి మీ కొడుకు చేసిందేంటీ

ఆరోజు సాక్షి సంతకం పెట్టింది బాలు గాడా అని మనోజ్ మనసులో అనుకుంటాడు. సత్యం, ప్రభావతికి కల్పన సారీ చెబుతుంది. నేను మీ అబ్బాయిని మోసం చేసింది, 40 లక్షలు ఎత్తుకెళ్లింది నిజమే అని కల్పన అంటుంది. అంత సులువుగా ఎలా చెబుతున్నావమ్మా. నేను జీవితాంతం కష్టపడిన డబ్బు అది. కాస్తా జాలి, దయ లేకుండా తీసుకెళ్లావమ్మా అని సత్యం అంటాడు. సారీ చెబుతుంది కల్పన.

చేసిందంతా చేసి సిగ్గు లేకుండా వచ్చి చెబుతున్నావా అని ప్రభావతి తిడుతుంది. నేనంటే పరాయిదాన్ని, మీరు తెలియదు. మరి మీ కొడుకుకు ఏమైంది. మీరు నమ్మి 40 లక్షలు ఇచ్చారు. అవి ఎత్తుకుని పారిపోయాడు. అతనికి ఉందా సిగ్గు, అతను మోసం చేయలేదా, అది దొంగతనం కాదా. తల్లిదండ్రులను మోసం చేసింది తప్పు కాదా అని కల్పన అంటుంది. ఆవిడ ఏదో అడుగుతుంది చెప్పండి అని మీనా కౌంటర్ ఇస్తుంది.

తల్లిదండ్రుల కష్టాన్ని దోచుకెళ్లి ప్రియురాలి చేతిలో పెట్టింది ఎవరు అని కల్పన అంటే.. కానీ, ఆ డబ్బంతా అనుభవించింది నువ్వు కదా అని ప్రభావతి అంటుంది. ఆ డబ్బంతా తిరిగి ఇచ్చింది కూడా నేనే అని కల్పన చెబితే అంతా షాక్ అవుతారు. సత్యం ఏంటమ్మా అనేది అని అంటాడు. మీ 40 లక్షలు మాత్రమే కాదు, వడ్డీతో కలిపి 45 లక్షలు మీ ముద్దుల కొడుకు మనోజ్‌కే ఇచ్చాను. పక్కనే మీ కోడలు ఉందని కల్పన నిజం చెబుతుంది.

పోలీసులను పిలిపించమంటావా

5 లక్షల వడ్డీ డిమాండ్ చేసింది మీ కోడలే అని కల్పన చెబుతుంది. అంతా అబద్ధం అమ్మా, నాకు ఏ డబ్బు ఇవ్వలేదని మనోజ్, ఇదంతా బాలు ఆడుతున్న నాటకం అని రోహిణి అంటారు. సాక్ష్యం ఉందా అని ప్రభావతి అడుగితే పోలీస్ కంప్లైంట్ కాపీ చూపిస్తుంది కల్పన. రవి చూసి నిజమే అని చెబుతాడు. ఇదంతా ఏదో నాటకంలా ఉందని మనోజ్ అంటే.. పోలీసులను పిలిపించమంటావా అని కల్పన అంటుంది.

బ్యాంక్ అకౌంట్‌కు 45 లక్షలు పంపిన స్టేట్‌మెంట్ కూడా చూపిస్తుంది కల్పన. ఏంటిది రోహిణి అని ప్రభావతి అంటే.. నాకేం తెలియదని రోహిణి బుకాయిస్తుంది. ఎందుకు తెలియదు. మీ కొడుక్కి అసలు తెలివితేటలే లేవు. అందరిని నమ్ముతాడు. కానీ, మీ కోడలు చాలా పెద్ద ఖిలాడీ. పొరపాటున పార్లర్‌కు వెళ్తే ఇదంతా చేసింది తనే. ఇంతపెద్ద విషయం మీ కొడుకు దాచాడంటే అది మీ కొడుకు తెలివితేటలు కావు. మీ ఖిలాడీ కోడలివే అని కల్పన అంటుంది.

సారీ అంకుల్. నేను డబ్బు ఎత్తుకెళ్లాను. కానీ తిరిగి ఇచ్చాను. అది మీ అబ్బాయి రెండోసారి కూడా దోచుకున్నాడని కల్పన అంటుంది. ఇప్పుడు అందరికి పూర్తిగా నిజమేంటో అర్థమైందిగా అని బాలు అంటాడు. ఫారెనమ్మా మీరు చేసింది తప్పే. కానీ, ఇంటి దొంగలు ఇంకా డేంజర్. వచ్చి చెప్పినందుకు థ్యాంక్స్ అని బాలు అంటాడు. మీ మనోజ్‌కు ఎన్ని డిగ్రీలున్నా వృథానే. మీపై ప్రేమే లేదు. బాలుకు డిగ్రీలు లేకున్నా నిజాయితీ ఉంది. బాలు కోసమే నేను వచ్చి చెప్పాను అని కల్పన వెళ్లిపోతుంది.

ఇంత ఫ్రాడ్ చేశారా

ఇన్ని రోజులు మోసం చేశారా, ఏ మనిషివిరా అని రవి, ఇద్దరికి ఇద్దరు ఇంత ఫ్రాడ్ చేశారా. ఒకరికోసం ఒకరు పుట్టినట్లు ఉన్నారు అని శ్రుతి అంటుంది. ఇంటిగుట్టు పుట్టింటికి చేరవేస్తున్నాను అత్తగారు అన్నారు. మరి అత్తింటి 45 లక్షలు ఎక్కడికి చేరవేశారో అడగరా అత్తగారు అని మీనా పంచ్‌లు వేస్తుంది. మనోజ్‌ను రమ్మని సత్యం పిలిచి మొదటిసారి క్షమించానుగా. రెండోసారి ఎలా తీసుకోవాలనిపించిందిరా, ఎలా మనసు ఒప్పిందిరా, నువ్వు కన్నవాళ్లను మోసం చేశావురా అని సత్యం అంటాడు.

నువ్వు నా కొడుకు అని చెప్పుకోడానికే అసహ్యం వేస్తుందని సత్యం అంటాడు. అమ్మా రోహిణి నువ్వైనా ఆలోచించలేదా. నీకైనా మనసు రాలేదా అని సత్యం అంటాడు. ఆ డబ్బుతోనే ఫర్నిచర్ షాప్ పెట్టారా అని సత్యం అడిగితే.. అవును అని రోహిణి నిజం ఒప్పుకుంటుంది. దాంతో మావయ్య 25 లక్షలు ఇచ్చి పంపించాడని రోహిణి చెప్పిన అబద్ధాన్ని గుర్తు చేసుకుంటారు.

మనోజ్‌ కాలర్ పట్టుకుని లాగిన ప్రభావతి రేయ్.. నలుగురిని కన్నానురా. కానీ నీ మీదే కలలు కన్నాను. రెండోసారి కూడా మేము ఎవరం గుర్తుకు రాలేదా. నీకు మనసు ఎలా ఒప్పిందిరా అని ప్రభావతి నిలదీస్తుంది. సారీ అమ్మా.. డబ్బు రాగానే వాళ్ల నాన్న ఇచ్చి షోరూమ్ ఓపెన్ చేద్దామని ఐడియా ఇచ్చింది రోహిణియే, నాకు ఏం తెలియదమ్మా అని మనోజ్ అంటాడు.

మీనా పంచ్‌లు

రవి, శ్రుతి ఇందాక నన్ను అత్తయ్య ఏమన్నారో తెలుసా. నేను పుట్టింటి నుంచి రూపాయి తేలేదు. రోహిణి మాత్రం 25 లక్షలు తెచ్చి షోరూమ్ ఓపెన్ చేయించింది అన్నారు. ఎవరిని అడిగి.. రోహిణి వాళ్ల నాన్నను అడిగి. ఇప్పుడు తెలిసిందా ఎవరి డబ్బుని ఎవరు ఇచ్చారని చెప్పిందో అని మీనా అంటుంది. దాంతో రోహిణి చెప్పింది గుర్తు తెచ్చుకుంటుంది ప్రభావతి. నిన్ను నెత్తిన పెట్టుకున్నాను. అలాంటిది ఇంత మోసం చేశావే అని రోహిణిని కొడుతుంది ప్రభావతి.

నిన్ను కన్నతండ్రికన్నా ఎక్కువ చూసుకున్నాడుగా. ఆమాత్రం ఆయన కనిపించలేదా. సిగ్గు లేదా అని ఎడాపెడా రోహిణిని కొడుతుంది ప్రభావతి. అంతా ఆపుతారు. నన్ను ఆపకండి. ఇది నా నమ్మకాన్ని ముక్కలు చేసిందని ప్రభావతి అంటుంది. వాళ్ల నాన్నను అడిగే ఇద్దామనుకున్నా అని రోహిణి అనడంతో ఇది కూడా అబద్ధమే అని మళ్లీ కొడుతుంది ప్రభావతి. ఉగ్రరూపంతో రోహిణి పీక పట్టుకుంటుంది అత్త ప్రభావతి.

సత్యం లాగుతాడు. చంపేస్తావా అని సత్యం అంటే.. అవును, చంపేస్తాను. ఇంత మోసాన్ని తట్టుకోలేకపోతున్నా. ఇలాంటి దాన్ని జీవితంలో క్షమించను అని ప్రభావతి అంటుంది. నేను ఏ తప్పు చేయలేదు. నేను షో రూమ్ ఓపెన్ చేయించకపోతే నీ కొడుకు పార్కులో పడుకునేవాడు, గాలికి తిరిగేవాడు అని రోహిణి అంటుంది. వాడికి తెలివితేటలు లేవా అని ప్రభావతి అంటే.. అలా ఉంటే కల్పన దగ్గర ఎందుకు మోసపోతాడు. నేను కాబట్టి 45 లక్షలు రాబట్టగలిగాను అని అత్తపైకి కోడలు రోహిణి రివర్స్ అవుతుంది.

జీవితం ధారపోసినట్లు

దాంతో మరింత విరుచుకుపడుతుంది ప్రభావతి. రోహిణిని చితకబాదుతుంది అత్త ప్రభావతి. నా కొడుకుకు జీవితం ధారపోసినట్లు మాట్లాడుతుందని ప్రభావతి అంటుంది. రోహిణిని లోపలికి వెళ్లమని సత్యం చెబుతాడు. దాంతో వెళ్లిపోతుంది. ఇద్దరు తప్పు చేశారు. మనోజ్‌ను ఏం అనలేదు కానీ రోహిణిని కొడుతున్నారు. బయట నుంచి వచ్చిందనా అని శ్రుతి అంటుంది. మనోజ్ మెల్లిగా జారుకుంటాడు. ఎక్కడికి అని ప్రభావతి అడిగితే.. పాపం రోహిణి అని మనోజ్ అంటాడు.

దాంతో మనోజ్‌ను వెనక్కి నెట్టేసిన ప్రభావతి నవ్వు దాని దగ్గరికి వెళ్లి చవటలా చెప్పింది చేశావో నరికి పోగులేస్తాను. సిగ్గు లేదారా నీకు, తల్లిని, తండ్రిని మోసం చేశావ్. పెళ్లాం మాటలు విని అందరికి ద్రోహం చేశావ్ అని ప్రభావతి వెళ్లిపోతుంది. అమ్మా అవమానం తట్టులోకే వదినను కొట్టిందని రవి అంటాడు. ఏ అత్త అంతలా కొట్టదనుకుంటా అని జరిగిన దాని గురించి మాట్లాడుకుంటారు బాలు-మీనా, రవి-శ్రుతి.

ఇంట్లో ఏ ఫ్రాడ్ జరిగిన అది బాలునే కనిపెడతాడు అని శ్రుతి అంటుంది. మీ వదిన ఇంటికి వచ్చినప్పుడే ఆవిడ ఏదో దాస్తుందని మీ అన్నయ్య కనిపెట్టాడని మీనా అంటే.. పార్లరమ్మా ఇంకా చాలా విషయాలు దాచి ఉంటుందని నా అనుమానం అని బాలు డౌట్ పడతాడు. దొరికాక మనోజ్ అన్నయ్య గురించి వదిన చీప్‌గా మాట్లాడిందని రవి అంటాడు. ఆ మాటలు మనోజ్ వెంటాడు.

మనోజ్, రోహిణి గొడవ

పదిమందిలో గౌరవంగా చూడాల్సినవాన్ని దొరికిపోయేసరికి వాడి మీదకు నెట్టేసిందని బాలు అంటాడు. మీ అన్నయ్య ఏం తక్కువ కాదు భార్యను ఇరికించాడు అని మీనా అంటుంది. మనోజ్ మంచి భర్త కాదు. అత్త కొడుతుంటే మనోజ్ ఆపలేదని శ్రుతి అంటుంది. ఆ మాటలు విన్న మనోజ్ రోహిణి దగ్గరికి వెళ్తాడు. నన్ను ముట్టుకోకు, అక్కడ అంతా జరుగుతున్న నువ్వు కొంచెం కూడా సపోర్ట్ చేయలేదు. అత్తయ్య అంత కొడుతుంటే ఆపమని కూడా అనలేదు అని రోహిణి అరుస్తుంది.

ఎందుకని అరుస్తున్నావ్. నువ్వు మాత్రం తప్పు చేయలేదా. అమ్మతో అలా మాట్లాడుకుండా ఉండాల్సింది. నా గురించి నువ్వు అలా మాట్లాడలా. నా చదువులు ఎందుకు పనికి రావు అన్నట్లు మాట్లాడావు. నేను చదువుకోడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా అని మనోజ్ అంటాడు.

ఆ చదువుతో ఏం చేశావ్. ఈ ఇంటి ముందు దిష్టిబొమ్మకు పోటీగా పెద్ద బోర్డ్ పెట్టావ్. ఎన్ని డిగ్రీలు చదివాడో చెప్పుకోడానికి తప్పా దేనికి పనికిరాదు అని మరోసారి మనోజ్‌ను అవమానిస్తుంది రోహిణి. అలా బెడ్‌రూమ్‌లో రోహిణి, మనోజ్ ఇద్దరు గొడవపడతారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More