Gunde Ninda Gudi Gantalu Promo: ఆ తెలివితేటలు నీ ఖిలాడీ కోడలివి- కల్పనతో బయటపడిన రోహిణి ద్రోహం- ప్రభావతి ఉగ్ర తాండవం!
Gunde Ninda Gudi Gantalu Serial Latest Episode Promo: గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రోహిణి అడగడంతో కల్పనను సాక్షిగా పిలుస్తాడు బాలు. ఎత్తుకెళ్లిన డబ్బుతోపాటు వడ్డీతో కలిపి 45 లక్షలు ఇచ్చానని కల్పన నిజం చెబుతుంది. ఖిలాడీ కోడలంటూ రోహిణి ద్రోహాన్ని కల్పన బయటపెడుతుంది.
Gunde Ninda Gudi Gantalu Serial Promo: గుండె నిండా గుడి గంటలు సీరియల్ తాజా ఎపిసోడ్ ప్రోమోలో రోహిణి నిజ స్వరూపం, మోసం, ద్రోహం అన్ని కల్పన ద్వారా బయటపడిపోయాయి. కల్పన దగ్గర అసలు నిజం తెలుసుకున్న బాలు ఇంటికొచ్చి ఇల్లునే కోర్టు బోన్ చేస్తాడు. ఆ కోర్టు బోన్‌లో మనోజ్‌ను నిలబెడతాడు.

సత్యం కష్టం గురించి
జడ్జిగా ప్రభావతిని, దోషులుగా మనోజ్, రోహిణిలను, లాయర్‌గా బాలు ఉంటాడు. బాలు వాదనలు మొదలుపెట్టి సత్యం రాజమండ్రికి వచ్చి చదువుకుని కష్టపడింది, డబ్బు సంపాదించింది అంతా చెబుతాడు. జీవితాంతం సంపాదించిన రూ. 40 లక్షలను మనోజ్ ఎత్తుకెళ్లి, లవర్‌కు ఇచ్చేసి మోసపోవడం అంతా చెబుతాడు. అదంతా తెలుసుని రవి అంటాడు.
అదంతా నాణెనికి ఒకవైపు మాత్రమే మరోవైపు మనకు తెలియని వింత కథ ఉందని, అదంతా మనోజ్ వికృత రూపమని బాలు చెబుతాడు. ఈ లక్షలు మింగినోడు రెండోసారి కూడా లక్షలు మింగాడు. ఆ 40 లక్షలను మనోజ్ తన ప్రియురాలి దగ్గరి నుంచి వసూలు చేసుకున్నాడని అందరిముందు నిజం బయటపెడతాడు బాలు. దానికి అంతా షాక్ అవుతారు. షటప్ బాలు, నోటికొచ్చినట్లు అనకు అని రోహిణి అంటుంది.
రోహిణి ద్రోహం
నువ్వు చేసిన మోసం, ద్రోహం అన్ని నాకు తెలుసు అని బాలు అంటాడు. తెలుసు అంటే సరిపోదు సాక్ష్యం కావాలి అని రోహిణి అంటుంది. సాక్ష్యమే కాదు సాక్షే వస్తుందని బాలు అంటే ఎవరని రోహిణి అడుగుతుంది. నీ మొగుడి మాజీ ప్రియురాలు కల్పన అని బాలు అనడంతో అంతా అవాక్కవుతారు. రామ్మా కల్పనమ్మా.. అని బాలు పిలవగానే కల్పన వస్తుంది. కల్పనను చూసి మనోజ్, రోహిణి దడుసుకుంటారు.
అప్పుడు అందరిముందు రోహిణి, మనోజ్ నిజ స్వరూపాలను బయటపెడుతుంది కల్పన. మీ 40 లక్షలు మాత్రమే కాదు వడ్డీతో కలిపి రూ. 45 లక్షలు ఇచ్చాను అని కల్పన అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. సత్యం నోరెళ్లబెడతాడు. తను వచ్చి ఏదోటి చెబితే నిజమైపోతుందా. మనోజ్ మీద కోపంతో తను, అసూయతో నువ్వు ఇదంతా చేస్తున్నారని రోహిణి ఆరోపిస్తుంది. నువ్వు ఇలా అంటావని తెలిసే సాక్ష్యాలతో కూడా వచ్చాను పార్లరమ్మ అని బాలు అంటాడు.
45 లక్షలు ఇచ్చా
దాంతో మనోజ్‌కు 45 లక్షలు ఇచ్చినట్లు పోలీస్ స్టేషన్‌లో పెట్టిన సంతకం డాక్యుమెంట్, బ్యాంక్ ట్రాన్జాక్షన్స్ చూపిస్తుంది కల్పన. దాంతో అది నిజమే అని తేలుతుంది. మీ కొడుకు ఇంత పెద్ద విషయం దాచాడు అంటే అది వాడి తెలివితేటలు కాదు మీ ఖిలాడీ కోడలివి అని కల్పన అంతా చెబుతుంది. ఇప్పుడు పూర్తిగా నిజమేంటో, అబద్ధమేంటో అర్థమైందనుకుంటాను అని బాలు అంటాడు.
దాంతో మనోజ్ కాలర్ పట్టుకుని లాగి తిడుతుంది ప్రభావతి. నేను ఇంట్లో ఇచ్చేద్దామనే చెప్పాను అమ్మా. షో రూమ్ ఓపెన్ చేద్దామని ప్లాన్ చేసింది రోహిణియే, నాకు ఏం తెలియదమ్మా అని ఇరికిస్తాడు మనోజ్. దానికి మరింతగా అంతా అవాక్కవుతారు. వాడితో ఎందుకు అబద్ధం చెప్పించావ్ చెప్పు అని రోహిణిని నిలదీస్తుంది ప్రభావతి. నేను అలా చేయకపోతే మీ అబ్బాయి అడుక్కు తినేవాడని రోహిణి రివర్స్ అవుతుంది.
ప్రభావతి చెంపదెబ్బలు
దాంతో రోహిణిని ఏమన్నావే అని లాగి చెంపదెబ్బ కొడుతుంది అత్త ప్రభావతి. రోహిణి ఎడాపెడా బాదుతుంది. అయితే, ఇప్పటివరకు తనను అత్త కొట్టినట్లు కలలు మాత్రమే కనేది. ఈసారి మాత్రం రియల్‌గా జరిగింది. అసలు రాబట్టిన డబ్బులు ఎవరివి నీ బాబువా.. చెప్పు అని రోహిణిపై కోపంతో ప్రభావతి ఉగ్ర తాండవం చేస్తుంది. ఉగ్రరూపం చూపిస్తుంది అత్త. అలా మనోజ్ షో రూమ్‌కి డబ్బులు ఇచ్చింది రోహిణి తండ్రి కాదనే నిజం తెలుస్తుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్ సీరియల్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


