Gunde Ninda Gudi Gantalu Today Episode: బాలుకు నిజం చెప్పేసిన కల్పన- కోర్టు బోనులో మనోజ్- సాక్షిగా మనోజ్ లవర్, ప్రతీకారం
Gunde Ninda Gudi Gantalu Serial May 6th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ మే 6వ ఎపిసోడ్‌లో ఫేక్ ఓనర్స్‌ను పట్టుకునేందుకు మణికంఠతో కలిసి బాలు ఎంక్వైరీ చేస్తాడు. మీనా దగ్గరికి వెళ్తే కల్పన ఫొటో చూసిన సుమతి మనోజ్ లవర్ అని చెబుతుంది. కల్పనను నిలదీయడంతో జరిగిన నిజం అంతా చెప్పేస్తుంది కల్పన.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ అదిరిపోయింది. 30 లక్షలు పోగొట్టినందుకు మనోజ్‌ను కొట్టబోతే రోహిణి అడ్డుపడుతుంది. అప్పులు చేసి ఎప్పుడు ప్రాపర్టీలు కొనాలని అనుకోకూడదు అని సత్యం అంటాడు. బాలు సెటైర్లు వేస్తే.. ప్రభావతి తిడుతుంది. అసలు వాన్ని ఇలా తయారు చేసింది నువ్వే, అతి గారాబం చేసి ఎందుకు పనికి రాకుండా చేశావని ప్రభావతిని అంటాడు సత్యం.

తల పట్టుకున్న రవి, శ్రుతి
రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు వెళ్లారుగా. అక్కడ చెక్ చేయలేదా అని రవి, శ్రుతి అడుగుతారు. లేదు. రిజిస్ట్రేషన్ ఖర్చుల గురించి అడిగామని మనోజ్ చెప్పడంతో రవి, శ్రుతి అయ్యో అని తల పట్టుకుంటారు. సరే మోసపోయాను. డబ్బు నేనే ఎలాగో సర్దుతాను అని మనోజ్ అంటాడు. మేము బాధపడితో సంతోషించడం అలవాటుగా బాలు అని రోహిణి అంటుంది.
5 కోట్ల విల్లా 3 కోట్లకే వస్తుందంటే అనుమానంగా ఉందని పదే పదే వద్దని చెప్పారు. మీరే అసూయ అని చెప్పలేదు. ఇప్పుడు ఆయన్ను అంటున్నారు అని మీనా రివర్స్ అవుతుంది. సరే తప్పు మాదే అని రోహిణి ఒప్పుకుంటుంది. ప్రతి నెల కాకుండా నాన్నకు ఇచ్చే డబ్బు మొత్తం ఒకేసారి ఎప్పుడిస్తారో చెప్పమని బాలు అడుగుతాడు. రోహిణి మీ నాన్నకు కాల్ చేసి డబ్బు పంపించమను అని మనోజ్ అంటాడు. దాంతో రోహిణి నీళ్లు నములుతుంది.
నాన్న జైలు అంటూ కాస్తా కోపంగా మాట్లాడుతుంది రోహిణి. మీ నాన్న అంటే చాలు నీకు కోపం వస్తుంది. ఆ విషయంలో కూడా నాకు అనుమానంగా ఉందని బాలు అంటే రోహిణి షాక్ అవుతుంది. ఇంకా వీడు 70 లక్షల కోసం ఇల్లు అమ్మామన్నాడు. ఇది పోతే ఎలా ఉండేదని బాలు అంటాడు. సరే వాడిని పట్టుకునే సంగతి చూడండని సత్యం అంటాడు. మణికంఠను పట్టుకుని ఏవైనా వివరాలు దొరుకుతాయో చూస్తానని బాలు వెళ్లిపోతాడు.
బాలు ఎంక్వైరీ
మణికంఠను కారులో తీసుకెళ్తాడు బాలు. మోసం చేసినవాడు నెల రోజుల నుంచి తెలుసు అని మణికంఠ చెబుతాడు. మనోజ్‌ను తిడతాడు బాలు. ఆ మొగుడు పెళ్లాం దొరికేంత వరకు నువ్వు నాతోనే ఉండాలని బాలు అంటాడు. విల్లా దగ్గర్లో ఉన్న కొబ్బారి బొండాం అతని దగ్గరికి వెళ్లి బొండాలు తాగుతారు బాలు, మణికంఠ. విల్లాలో రెంట్‌కు ఉన్నవాళ్ల గురించి బాలు ఆరాలు తీస్తాడు.
వాళ్లు 6 నెలలుగా అద్దెకు ఉంటున్నారని, ఈ మధ్య ఎప్పుడు ఎవరో ఒకరు వచ్చి వెళ్తున్నారని, వారిలో ఒకతను టీవీ సీరియల్‌లో పని చేస్తాడని, ఏదో సీరియల్‌లో చూసినట్లు తెలుసు, ఆ ఇంట్లో పని చేసే అమ్మాయి కూడా తెలుసు ఆమె ఇల్లు ఎక్కడో చెబుతాడు కొబ్బరి బొండాల అతను. బాలు డబ్బులిచ్చి ఆ మొగుడు పెళ్లాలు కనిపిస్తే నాకు కాల్ చేయమని విజిటింగ్ కార్డ్ కూడా ఇస్తాడు బాలు.
నువ్వు పోలీసులా భలే ఆలోచిస్తున్నావ్ బాలు. నిజంగా పోలీస్ అయితే ఎక్కడెక్కడో క్రిమినల్స్‌ను పట్టుకొచ్చేవాడివని మణికంఠ పొగుతాడు. ఈ బాలుకు కారు చాలు. మనోజ్ గాడి వల్ల ఈ ఎంక్వైరీ చేస్తున్నాను అని బాలు అంటాడు. కల్పన ఇచ్చిన స్పెక్ట్స్ మణికంఠ పెట్టుకుంటే బాలు తిడతాడు. పార్వతి, సుమతితో తన డెకరేషన్ గురించి మీనా చెబుతుంది. ఇకనుంచి నీ లైఫ్‌లో అంతా మంచే జరుగుతుందని సుమతి అంటుంది.
స్టైల్ మార్చిన బాలు
ఇంతలో బాలు వస్తాడు. కల్పన ఇచ్చిన స్పెక్ట్స్ పెట్టుకుని స్టైలిష్‌గా వస్తాడు. స్టైల్ మారిందే అని సుమతి అంటుంది. బాగుందని సుమతి చెబుతుంది. కస్టమర్ ఇచ్చింది. నీకు కూడా ఇచ్చిందని మీనాకు స్పెక్ట్స్ ఇస్తాడు బాలు. మీనా పెట్టుకుంటుంది. బాలు, మీనా ఇద్దరు హీరో హీరోయిన్లల ఉన్నారని సుమతి అంటుంది. పార్వతి, సుమతి, బాలు, మీనా అంతా కలిసి సెల్ఫీ తీసుకుంటారు. ఫొటోలు చూస్తూ కల్పనతో బాలు దిగిన ఫొటో చూస్తుంది సుమతి.
కల్పన ఫొటోను మీనాకు చూపిస్తుంది సుమతి. ఆరోజు రిసెప్షన్‌కు వచ్చిందిగా అని మీనా అంటుంది. ఇద్దరి గురించి కల్పన చెప్పింది గుర్తు చేసుకుంటాడు బాలు. లక్షలు మింగినోడితో లేచిపోయింది ఈ అమ్మాయా అని బాలు అంటాడు. అవును బావ, ఈ అమ్మాయే, నాకు బాగా గుర్తుందని సుమతి అంటుంది. అంటే, మనోజ్ గాడి దగ్గర 40 లక్షలు కొట్టేసి పారిపోయిన అమ్మాయి, ఈ కల్పన ఇద్దరు ఒక్కరే అన్నమాట అని బాలు అనుకుంటాడు.
ఇదే మిస్టరీలో ఉందని బాలు అంటాడు. కట్ చేస్తే కల్పన దగ్గరికి వెళ్లి గొడవ పెట్టుకుంటాడు బాలు. మనోజ్‌తో ప్రేమ, డబ్బు కొట్టేయడం అంతా చెబుతాడు బాలు. ఇలా ఒకరి డబ్బు కొట్టేసి పారిపోయి బతికే బతుకు కూడా ఒక బతుకేనా అని బాలు అంటే.. కల్పన అరుస్తుంది. తనకంటే ఎక్కువగా ఏయ్ అని బాలు అరుస్తాడు. నువ్వు చేసిన పనికి నా తమ్ముడు రవి, నేను ఎదుగుబొదుగు లేకుండా మిగిలిపోయాం. ఆ మనోజ్ నా అన్నయ్య అని బాలు అంటాడు.
నిజం చెప్పేసిన కల్పన
కల్పన షాక్ అవుతుంది. మా నాన్న డబ్బు నువ్వు దోచుకెళ్తే ఈనాటికి మేము కోలుకోలేదని బాలు అంటాడు. ఈనాటికి ఏంటీ. మీ నాన్న గారి డబ్బు నేను ఏనాడో సెటిల్ చేశాను కదా అని కల్పన అంటే బాలు అవాక్కవుతాడు. ఎవరికి అని బాలు అడుగుతాడు. నేను లాస్ట్ టైమ్ వచ్చినప్పుడే మీ అన్న, వదినకు ఇచ్చేశాను అని కల్పన నిజం చెప్పేస్తుంది. అబద్ధం. అది వాడు మాకు చెప్పలేదని బాలు అంటాడు.
ఓహో అర్థమైంది. వడ్డీతో సహా తీసుకుని మీ అన్న మీకు చెప్పలేదన్నమాట అని కల్పన అంటుంది. నేను ఎలా నమ్మాలని బాలు అంటే.. ఆరోజు నువ్వు సాక్షి సంతకం చేశావుగా అని పోలీస్ స్టేషన్‌లో మొత్తం జరిగింది చెబుతుంది కల్పన. అది గుర్తు తెచ్చుకున్న బాలు ఎంత మోసం అంటాడు. నిన్ను, మీ కుటుంబాన్ని మోసం చేశాడు మీ అన్నయ్య. మీ వదిన మాములిది కాదు. ఆ డబ్బంతా రాబట్టింది మీ వదినే పార్లర్‌లో జరిగింది కూడా చెబుతుంది కల్పన.
ఆ డబ్బంతా ఏం చేశారు. ఇది ప్రూవ్ చేయాలంటే పోలీస్ స్టేషన్ కాపీ, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ స్టేట్‌మెంట్ కావాలి. ఆ రెండు తీసుకొచ్చి మా ఇంట్లో చెబుతావా అని బాలు అడిగితే.. కచ్చితంగా చెబుతాను. నన్ను నీచంగా చూసినందుకు ప్రతీకారం తీర్చుకుంటానని కల్పన అంటుంది. తల్లితో మీనా మాట్లాడితే ఇంటి విషయాలు చెబుతున్నావా అని అంటుంది ప్రభావతి. మీనా సెటైర్లు వేస్తుంది. రోహిణి వాళ్ల మనోజ్ షో రూమ్‌కు డబ్బు ఇచ్చాడు. మీ పుట్టింటోళ్లు ఏం చేశారో అని ప్రభావతి అంటుంది.
కోర్టు బోనులో మనోజ్
బాలు స్టైల్‌గా ఎంట్రీ ఇచ్చి అందరిని పిలుస్తాడు. మళ్లీ కోర్ట్ బోన్ సెట్ చేస్తాడు బాలు. సత్యం, ప్రభావతి ఇద్దరిని జడ్జ్‌లుగా కూర్చోబెడతాడు బాలు. ఇల్లు కోర్ట్ బోన్ అయిందని బాలు అంటాడు. అందులో మనోజ్‌ను నిలబడమంటాడు. రోహిణి అరిస్తే.. మీ తోడుదొంగల సంగతి తెలుసు, నీ దగ్గరికి కూడా వస్తాను అని బాలు అంటాడు. మనోజ్‌ను బలవంతంగా కోర్టు బోన్‌లో లాక్కెళ్లి నిలబెడతాడు బాలు.
ఏంట్రా ఇది అని సత్యం అంటాడు. మన ఇల్లు కోర్టు. నేను లాయర్, అమ్మ జడ్డ్. అన్యాయం జరిగిన బస్సు డ్రైవర్‌కు న్యాయం జరగాలి. ఇక వాదనలు మొదలుపెడదామా అని బాలు అంటాడు. సత్యం కష్టం గురించి చెప్పి 40 లక్షల డబ్బు, లవర్ చేతిలో మనోజ్ ఆ డబ్బు పెట్టడం గురించి చెబుతాడు. ఈ కేసు రీ ఓపెన్ అయిందని బాలు అంటాడు. మధ్యలో రవి మాట్లాడితే నువ్వు డిస్టర్బ్ చేయకు. చూస్తుంటే మనోజ్‌కు మూడినట్లు అనిపిస్తుందని శ్రుతి అంటుంది.
ఇదంతా తెలిసిందే కదా అని రవి అంటే.. తెలియని వింత కథ ఇంకోటి ఉంది. అది వీడి వికృత రూపం ఎంత నీచంగా ఉంటుందో చెప్పే కథ అని బాలు అంటాడు. ఈ లక్షలు మింగినోడు రెండోసారి కూడా లక్షలు మింగాడు అని బాలు అంటాడు. తీసుకెళ్లిన అమ్మాయి దగ్గర నుంచి వీళ్లిద్దరు కలసి మళ్లీ రాబట్టారు. ఎత్తుకెళ్లిన 40 లక్షలు ఈ మొగుడు పెళ్లాం ఇద్దరు రాబట్టారు. తోడు దొంగలు అని బాలు అంటాడు.
సాక్షిగా కల్పన
షటప్ బాలు, అనడం కాదు సాక్ష్యం కావాలని రోహిణి అంటుంది. సాక్ష్యం కాదు సాక్షే వస్తారని బాలు అంటాడు. ఎవరా సాక్షి అని రోహిణి అడిగితే.. నీ మొగుడి మాజీ ప్రియురాలు కల్పన అని బాలు అంటాడు. అంతా షాక్ అవుతారు. సాక్షిగా కల్పన సత్యం ఇంటికి వస్తుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


