Manchu Manoj: ఆ హీరోయిన్‌తో సినిమా తీసి ప్రతీ హీరోకి భయం పుట్టించారు.. దాసరి నారాయణరావుపై మంచు మనోజ్ కామెంట్స్
Manchu Manoj Comments On Dasari Narayana Rao: తెలుగు లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా దాసరి ఘాట్‌ను టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సందర్శించారు. నారాయణరావు గారు ఓ ఇన్‌స్టిట్యూషన్ అని, ఆయన్ని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలని, ఆయన 24 శాఖల్లో రాణించారని మంచు మనోజ్ కామెంట్స్ చేశారు.
Manchu Manoj Comments On Dasari Narayana Rao At Ghat: తెలుగు దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్‌ను హీరో, రాకింగ్ స్టార్ మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనికతో కలిసి సందర్శించారు.

మంచు మనోజ్ కామెంట్స్
ఈ క్రమంలో దాసరి ఘాట్ దుస్థితిపై యాంకర్ గౌతమి షేర్ చేసిన వీడియోపై మనోజ్ రియాక్ట్ కావటమే కాకుండా స్వయంగా ఆ ప్రదేశాన్ని సందర్శించి, శుభ్రపరిచే కార్యక్రమాలను ప్రారంభించారు. దాసరి పట్ల తనకున్న గౌరవాన్ని, ప్రేమను చాటుకున్నారు మంచు మనోజ్. ఈ సందర్భంగా మంచు మనోజ్ ఇంట్రెస్టంగ్ కామెంట్స్ చేశారు
మంచు మనోజ్ మాట్లాడుతూ.. "ఈరోజు మన గురువు గారు దాసరి నారాయణరావు గారి వర్ధంతి. నిజానికి ఈరోజు ఆయన వర్ధంతి అనే విషయం నాకు గుర్తు లేదు. నాలుగు రోజుల క్రితం చిత్రపురి కాలనీ వైపు వస్తుంటే, గురువు గారి విగ్రహం చూసి ఫ్యామిలీని గుర్తు చేసుకున్నాను. వెంటనే అరుణ్ అన్నకు ఫోన్ చేసి ఆలం అక్క నెంబర్ మారి పోయుంటే తీసుకున్నాను" అని తెలిపాడు.
వీడియో చూడగానే బాధేసింది
"వారితో మాట్లాడాను. ఎందుకనో దాసరి గారు గుర్తుకు వస్తున్నారని కూడా అన్నాను. ఈలోగా వేరే పనిలో పడి విషయం మరచిపోయాను. అది జరిగి నాలుగు రోజులు కూడా కాకముందే నిన్న సాయంత్రం గురువు గారు ఘాట్‌కు సంబంధించిన వీడియో చూడగానే చాలా బాధేసింది. వెంటనే స్పందించాను. నా టీమ్‌కు చెప్పాను. నేను ఆలస్యంగా చెప్పినా కూడా దార్లో వాళ్లు కార్మిక సిబ్బందిని మా కార్లలోనే ఎక్కించుకుని వచ్చాం. యాదగిరి అన్నకు ఫోన్ చేస్తే అన్న తెల్లవారు జామునే స్పందించారు" అని మనోజ్ పేర్కొన్నాడు.
"అలాగే ఎమ్మెల్యేగారు కూడా వెంటనే స్పందించారు. నేను కాల్ చేసిన ఇరవై నిమిషాల్లోనే స్పందించారు. జెసీబీని అరెంజ్ చేశారు. అన్నీ ఏర్పాట్లు చేశారు. 20-25 మంది పని చేశాం. నా మాట మీద ఇక్కడకు వచ్చిన వారందరికీ, వసతులను ఏర్పాటు చేసిన అందరికీ థాంక్స్" అని మంచు మనోజ్ చెప్పారు.
24 శాఖలపై రాణించారు
"గురువుగారి గురించి చెప్పాలంటే గొప్ప డైరెక్టర్..గొప్ప యాక్టర్.. గొప్ప స్క్రీన్ ప్లే రైటర్.. డైలాగ్స్, ఎడిటింగ్.. ఇలా 24 శాఖలపై ఆయన రాణించారు. ఆయన నా తండ్రి సమానులు. మా గురువు గారు. ఆయన్ని, పద్మ అంటీని ఎప్పుడూ మిస్ అవుతుంటాను. వాళ్లు లేని లోటు మాకు..ముఖ్యంగా నాకు బాగా తెలుస్తోంది" అని ఎమోషనల్ అయ్యారు మంచు మనోజ్.
"దాసరి గారి గురించి చెప్పాలంటే ఆయన డైరెక్షన్‌లో రూపొందిన నా మొగుడు నాకే సొంతం సినిమాలోయాక్ట్ చేశాను. అలాగే పుణ్యభూమి నాదేశం సినిమాలో ఆయనతో కలిసి నటించే భాగ్యం దక్కింది. మ్యూజిక్, ఎడిటింగ్ వర్క్స్ జరిగేటప్పుడు ఆయనతో పాటు వెళ్లేవాడిని. నాకు కూడా సినీ క్రాఫ్ట్ మీద ఇంత పిచ్చి, ఆసక్తి, ప్రాణం ఉందంటే మా నాన్నగారితో పాటు గురువు గారికే ఆ క్రెడిట్ దక్కుతుంది" అని మంచు మనోజ్ వెల్లడించారు.
హీరోలకు భయం పుట్టించారు
"గురువు గారు ఓ ఇన్‌స్టిట్యూట్. ఆయన మనకు ఓ దారి చూపించారు. ముఖ్యంగా ఆయన తీసిన సినిమాలు. సామాజిక సినిమాలు, కమర్షియల్ సినిమాలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేశారు. దాసరి గారి పని అయిపోయిందని అనుకునే సమయంలో ఓ కొత్త రకమైన సినిమాతో మన ముందుకు వచ్చేవారు" అని మంచు మనోజ్ అన్నారు.
"కమర్షియల్, మేల్ డామినేషన్ ఉన్న సమయంలో విజయశాంతి గారితో ఒసేయ్ రాములమ్మ అనే సినిమా తీసి.. ప్రతీ హీరోకి భయం పుట్టించారు. ఆమెను కమర్షియల్ హీరో రేంజ్‌కు తీసుకొచ్చారు. ఆయన ఇచ్చిన సామాజిక సందేశాలు కానీ.. డ్రామా ఇలా ప్రతీ ఒక్కటి డిఫరెంట్" అని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


