Cocktail 2: రష్మిక మందన్నా రొమాంటిక్ మూవీ సాంగ్ కాపీ వివాదం- మ్యూజిక్ డిటెక్టివ్‌లు అంటూ సంగీత దర్శకుడు ప్రీతమ్ ఫైర్

Pritam Slams On Cocktail 2 Mashooqa Song Copy Controversy: రష్మిక మందన్నా బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ కాక్‌టెయిల్ 2 లోని 'మషూకా' పాట కాపీ వివాదంలో చిక్కుకుంది. ఒక ఇటాలియన్ ట్యూన్‌ను సంగీత దర్శకుడు ప్రీతమ్ కాపీ కొట్టారనే ఆరోపణలపై ఆయన సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు.

Published on: May 21, 2026, 11:20:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Pritam Slams On Cocktail 2 Mashooqa Song Copy Controversy: బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, కృతి సనన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన తాజా రొమాంటిక్ చిత్రం 'కాక్‌టెయిల్ 2'. ఈ సినిమా నుంచి మే 19న విడుదలైన 'మషూక' అనే మెలోడీ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే, ఈ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు.

రష్మిక మందన్నా రొమాంటిక్ మూవీ సాంగ్ కాపీ వివాదం- మ్యూజిక్ డిటెక్టివ్‌లు అంటూ సంగీత దర్శకుడు ప్రీతమ్ ఫైర్
రష్మిక మందన్నా రొమాంటిక్ మూవీ సాంగ్ కాపీ వివాదం- మ్యూజిక్ డిటెక్టివ్‌లు అంటూ సంగీత దర్శకుడు ప్రీతమ్ ఫైర్

మషూక సాంగ్ విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ ట్యూన్ కాపీ కొట్టారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ వివాదంపై బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ చక్రవర్తి ఎట్టకేలకు నోరు విప్పారు. తనపై వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.

ఇటాలియన్ సాంగ్‌తో పోలికలు!

ఈ మషూక పాట ట్యూన్ 1993 నాటి 'సే సో అరుబాతే ఎ నోన్నా' (Se So Arrubate A Nonna) అనే ఒక ఇటాలియన్ కామెడీ సాంగ్‌ను పోలి ఉందంటూ నెటిజన్లు కొన్ని వీడియోలను తెరపైకి తెచ్చారు. బీబీ & కో అనే ఇటాలియన్ మ్యూజిక్ ద్వయం పాడిన ఆ పాట రికార్డింగ్స్‌ను, మషూకా పాటతో పోలుస్తూ మీమ్స్, ట్రోల్స్ చేయడం ప్రారంభించారు.

దీనిపై మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. "నా ప్రతి కొత్త పాట విడుదల కాగానే కొంతమంది స్వయం ప్రకటిత మ్యూజిక్ డిటెక్టివ్‌లు రంగంలోకి దిగుతున్నారు. వారు 'ఊహాజనిత పోలికలు' అనే ఒక కొత్త జోనర్‌ను సృష్టించారు. ఎప్పుడూ అదే మనుషులు, అదే కాపీ సిద్ధాంతాలు పట్టుకుని కూర్చుంటారు" అని ప్రీతమ్ అసహనం వ్యక్తం చేశారు.

నెటిజన్ల ట్రోలింగ్‌కు తనదైన శైలిలో సమాధానమిస్తూ..

"నిజం చెప్పాలంటే, ప్రస్తుతానికి మీరు నా ఫ్రీ పీఆర్ టీమ్‌లా పనిచేస్తూ నా పాటకు పబ్లిసిటీ తెస్తున్నారు. కానీ మీరు చేస్తున్న ఈ పని అస్సలు బాలేదు" అని సంగీత దర్శకుడు ప్రీతమ్ నెటిజన్లకు హితవు పలికారు.

ప్రీతమ్‌కు వివాదాలు కొత్తేమీ కాదు!

సంగీత దర్శకుడు ప్రీతమ్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆయన స్వరపరిచిన పలు సూపర్ హిట్ సాంగ్స్ అంతర్జాతీయ ట్యూన్ల నుంచి ఇన్‌స్పైర్ అయినవేనంటూ నెటిజన్లు ఆధారాలతో సహా నిరూపించారు. 2017లో వచ్చిన 'యే దిల్ హై ముష్కిల్' చిత్రంలోని 'బుల్లెయా' సాంగ్‌ను, పాపా రోచ్ అనే అంతర్జాతీయ బ్యాండ్ మ్యూజిక్ నుంచి కాపీ చేశారనే విమర్శలు వచ్చాయి.

అయితే, 2016లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రీతమ్ మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభంలో తాను కొన్ని పొరపాట్లు చేశానని, ఆ తర్వాత నుంచి సొంత ట్యూన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నానని అంగీకరించడం గమనార్హం.

2012 నాటి సినిమాకు సీక్వెల్

అమితాబ్ భట్టాచార్య సాహిత్యం అందించిన ఈ 'మషూకా' పాటను రాఘవ్ చైతన్య, మహమూద్ రువా కే పాడారు. ఈ కాక్‌టేయిల్ 2 సినిమాకు హోమీ అదజానియా దర్శకత్వం వహించారు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం 2012లో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె, డయానా పెంటీ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ 'కాక్‌టెయిల్' చిత్రానికి సీక్వెల్.

జూన్ 19న 'కాక్‌టెయిల్ 2' విడుదల

అయితే, కాక్‌టేయిల్ 2 కథ పూర్తిగా భిన్నంగా ఉంటుందని హీరోయన్ కృతి సనన్ ఇటీవల స్పష్టం చేశారు. షాహిద్, కృతి సనన్, రష్మిక మందన్నా కలిసి నటించిన కాక్‌టేయిల్ 2 జూన్ 19న థియేటర్లలో విడుదల కానుంది.

మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ ఇన్‌స్టా స్టోరీ
మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ ఇన్‌స్టా స్టోరీ

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'కాక్‌టెయిల్ 2' చిత్రంలోని ఏ పాట వివాదంలో చిక్కుకుంది?

షాహిద్ కపూర్, కృతి సనన్ నటించిన ఈ చిత్రంలోని 'మషూకా' (Mashooqa) అనే పాట కాపీ వివాదంలో చిక్కుకుంది.

2. 'మషూకా' పాటను ఏ అంతర్జాతీయ సాంగ్‌తో పోలుస్తున్నారు?

1993లో విడుదలైన 'సే సో అరుబాతే ఎ నోన్నా' అనే ప్రసిద్ధ ఇటాలియన్ కామెడీ సాంగ్ ట్యూన్‌ను ఈ పాట పోలి ఉందంటూ నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

3. కాపీ ఆరోపణలపై సంగీత దర్శకుడు ప్రీతమ్ ఎలా స్పందించారు?

ఆ పోలికలన్నీ కేవలం ఊహాజనితమైనవని ప్రీతమ్ కొట్టిపారేశారు. తనను ట్రోల్ చేసేవారంతా తన ఫ్రీ పీఆర్ టీమ్‌లా మారి పాటకు పబ్లిసిటీ కల్పిస్తున్నారని ఎద్దేవా చేశారు.

4. 'కాక్‌టెయిల్ 2' సినిమా ఎప్పుడు విడుదలవుతుంది? ఇందులో తెలుగు నటి ఎవరైనా ఉన్నారా?

ఈ చిత్రం జూన్ 19న థియేటర్లలో విడుదల కానుంది. టాలీవుడ్ స్టార్ నటి రష్మిక మందన్న ఇందులో ఒక ప్రధాన పాత్రలో నటిస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More