Neelima Azeem: చేతిలో కేవలం 4,500 రూపాయలు, పసిబిడ్డతో ముంబైకి.. సింగిల్ మదర్‌గా షాహిద్ కపూర్ తల్లి నీలిమ అజీమ్ కష్టాలు
Shahid Kapoor Mother Neelima Azeem Single Mother Problems: వైవాహిక బంధం విచ్ఛిన్నమైనా, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా వెనకడుగు వేయకుండా పోరాడిన నటి నీలిమ అజీమ్ స్ఫూర్తిదాయక ప్రయాణం. షాహిద్ కపూర్‌ను పెంచడానికి ఆమె పడ్డ కష్టాలు, తన తల్లిదండ్రుల సహకారంపై తాజాగా ఆమె పంచుకున్న భావోద్వేగ విషయాలు.
Shahid Kapoor Mother Neelima Azeem Single Mother Problems: గ్లామర్ ప్రపంచంలో మెరిసిపోయే తారల వెనుక ఎన్నో కన్నీటి కథలు ఉంటాయి. ముఖ్యంగా ఒక మహిళగా విడాకులు తీసుకుని, పసిబిడ్డను ఒంటరిగా పెంచుతూ కెరీర్‌ను నిర్మించుకోవడం మామూలు విషయం కాదు.

మూడేళ్ల ప్రాయంలో
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తల్లి, ప్రముఖ నటి నీలిమ అజీమ్ జీవితం కూడా అచ్చం ఇలాంటి పోరాటమే. పంకజ్ కపూర్ నుంచి విడిపోయిన తర్వాత, కేవలం మూడేళ్ల ప్రాయంలో ఉన్న షాహిద్‌ను ఆమె ఎలా పెంచారు? ముంబై నగరానికి వచ్చేటప్పుడు ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అనే విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో నీలిమ అజీమ్ గుర్తుచేసుకున్నారు.
ముంబైకి వచ్చేటప్పుడు చేతిలో కేవలం రూ. 4,500
ఢిల్లీ నుంచి ముంబైకి (అప్పట్లో బాంబే) వచ్చేటప్పుడు తన పరిస్థితి ఎంత గందరగోళంగా ఉండేదో నీలిమ వివరించారు. "1990లో నేను ఈ నగరానికి వచ్చినప్పుడు నా చేతిలో కేవలం 4,500 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అది నేను కష్టపడి సంపాదించిన డబ్బు. నా తల్లిదండ్రుల నుంచి ఒక్క పైసా కూడా తీసుకోలేదు. నా జీవితంలో ఎవరి దగ్గరా అప్పు చేయలేదు, కుటుంబం నుంచి కూడా ఆర్థిక సాయం కోరలేదు. నా కాళ్ల మీద నేను నిలబడాలనే పట్టుదలే నన్ను నడిపించింది" అని నీలిమా అజీమ్ పేర్కొన్నారు.
విడాకులు.. పసివాడైన షాహిద్‌పై ప్రభావం
ఆ పట్టుదలే ఆమెను 'ది స్వోర్డ్ ఆఫ్ టిప్పు సుల్తాన్', 'సడక్' వంటి చిత్రాలతో స్టార్‌గా మార్చింది. వైవాహిక జీవితం ముగిసిపోవడం కేవలం తనపైనే కాకుండా, ఎదుగుతున్న షాహిద్ కపూర్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపిందని నీలిమ అంగీకరించారు.
"నేను అప్పుడు చాలా చిన్నదాన్ని. ఆ పరిస్థితులను నేను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నానో నాకే తెలియదు. కానీ నా కొడుకు ఆ ఒడిదుడుకులన్నీ చూడాల్సి వచ్చింది. అది అతనికి అంత సులభమైన విషయం కాదు" అని నీలిమా అజీమ్ భావోద్వేగానికి లోనయ్యారు. షాహిద్ తన తొమ్మిదేళ్ల వయస్సు వరకు తన అమ్మమ్మ, తాతయ్యల దగ్గరే పెరిగారని, వారే షాహిద్‌కు తల్లిదండ్రులుగా నిలిచారని ఆమె వెల్లడించారు.
తల్లిదండ్రుల అండతోనే ప్రయాణం సులభం
ఒక పక్క ఫుల్ టైమ్ నటిగా కెరీర్‌లో నిలదొక్కుకుంటూనే, మరోపక్క కొడుకును జాగ్రత్తగా పెంచడం నీలిమకు పెద్ద సవాల్‌గా మారింది. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు కొండంత అండగా నిలిచారు.
"షాహిద్ వ్యక్తిత్వంపై నా తల్లిదండ్రుల ప్రభావం చాలా ఉంది. మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారు మాకు అండగా నిలబడ్డారు. తాతయ్య, అమ్మమ్మ కంటే ఎక్కువగా వారు అతనికి తల్లిదండ్రుల బాధ్యతను నిర్వర్తించారు" అని నీలిమ అజీమ్ పేర్కొన్నారు. నేడు షాహిద్ కపూర్ ఒక గొప్ప నటుడిగా, క్రమశిక్షణ గల వ్యక్తిగా ఎదగడం వెనుక నీలిమ పడ్డ శ్రమ, ఆమె కుటుంబ సభ్యుల త్యాగం ఎంతో ఉందని ఈ మాటల ద్వారా అర్థమవుతోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


