గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: రౌడీలను బెదరగొట్టిన మీనా- గుడిలో పార్వతిని అవమానించిన రోహిణి- పోలీసుల చేతికి ఫుటేజ్

Gunde Ninda Gudi Gantalu Serial May 28th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ మే 28వ ఎపిసోడ్‌‌లో సత్యం కొడుకు కోడళ్లు గొడవ పడతారు. కొడుకులు డాబాపై పడుకుంటారు. ప్రభావతితో సత్యం కూడా గొడవ పడి పైకి వెళ్తాడు. మీనా వృత్తి నుంచే పారిపోయేలా చింతామణి ప్లాన్ వేస్తుంది. కానీ, అది ఫెయిల్ అవుతుంది.

Published on: May 28, 2026, 08:38:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో సత్యం ఒక్కరికే అన్నం వడ్డించి మీనా వెళ్తుంటే ప్రభావతి తనకు వడ్డించమని అరుస్తుంది. మండిపోతుంది నాకు. ఇంకో ఇద్దరు కోడల్లు ఉన్నారు. వారిని అడిగారా. నేను మాత్రమే కనిపిస్తాను అని అత్తపై మీనా రివర్స్ అవుతుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మే 28 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ మే 28 ఎపిసోడ్

కొడుకు, కోడళ్ల గొడవ

ప్రభావతి నోరెళ్లబెట్టి చూస్తుంది. అలా ఉంటే అన్నం నోట్లో పడదు. తింటే తినండి లేకుంటే లేదు అని వెళ్లిపోతుంది మీనా. ఏరా మీ ముగ్గురు ఆ ముగ్గురితో గొడవ పడ్డారా అని సత్యం అడిగితే.. మాకు అంత దమ్ముందా అని రవి అంటాడు. దాంతో స్పూన్ ఎత్తేస్తుంది మీనా. మనోజ్‌ను అడిగితే ఊరికే గొడవ పడుతుందని అంటాడు. దాంతో మరో గరిట ఎత్తేస్తుంది మీనా.

మేము ఏం చేయలేదు కాల్ వస్తే రోహిణని అనుమానించానని మనోజ్, లేట్‌గా వచ్చినందుకు తనను శ్రుతి అనుమానించిందని రవి చెబుతారు. అనుమానం కాదు, అవమానం. నన్ను చవటను చేయాలని చూస్తోంది. మీనా ఏది చెబితే అది చేయాలనంటుందని బాలు అంటాడు. మంచిది అని సత్యం అన్నం తింటాడు. మా మీద జాలి చూపించరా అని మనోజ్ అంటాడు.

30 ఏళ్లుగా నా మీద మీరు జాలి చూపించారా. ఒక్క బాలు గాడు తప్పా పట్టించుకున్నారా అని తినేసి వెళ్లిపోతాడు సత్యం. తర్వాత అన్నదమ్ములు అందరూ డాబాపై పడుకునేందుకు దిండులు వేస్తారు. బాలు ఎందుకు తాగాడో చెబుతాడు. శ్రుతితో జరిగిన గొడవ గురించి రవి చెబుతాడు. అనవసరంగా తొందరపడి పెళ్లి చేసుకున్నాను అనిపిస్తుందని రవి అంటాడు. మనోజ్‌ది తనది సారీ గొడవ అని అంటాడు.

సత్యం ప్రభావతి గొడవ

తన తప్పు చేసి నన్ను క్షమించమంటుంది అని మనోజ్ అంటాడు. కొడుకులు, కోడళ్ల సమస్యల గురించి సత్యంతో చెప్పుకుని ప్రభావతి బాధపడుతుంది. టెన్షన్‌గా ఉందంటుంది. అది వాళ్ల పర్సనల్ విషయం, వాళ్లే చూసుకుంటారు. ప్రతిదాంట్లో మనం తలదూర్చకూడదు అని సత్యం అంటాడు. మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారని ప్రభావతి అంటుంది. నేను లేను. కానీ, ఇంట్లో ఎవరో ఒకరు ప్రశాంతంగా ఉండాలి. లేకుంటే ఆ ఇల్లు యుద్ధభూమి అవుతుంది అని సత్యం అంటాడు.

అయినా వినకుండా ప్రభావతి వాదిస్తుంది. నువ్వు ఇవాళ నన్ను పడుకోనిచ్చేలా లేవు. నేను వెళ్లి పైన పడుకుంటాను. నీ ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది అని ప్రభావతితో గొడవ పడి సత్యం వెళ్లిపోతాడు. కొడుకుల దగ్గరికే సత్యం వస్తాడు. దాంతో వాళ్లు షాక్ అవుతారు. నిన్ను కూడా అమ్మావతి గెంటేసిందా అని బాలు అడిగితే.. అది పెట్టే నస భరించలేక వచ్చానని సత్యం అంటాడు. ఎలాగైతేనేం నువ్వు కూడా మా పార్టీలో చేరావని బాలు అంటాడు.

మనం పార్టీ పెడదామా అని బాలు అంటే.. ఇంటి మేడ మీద రెండు రూమ్‌లు కడతానని చెప్పి ఇంతవరకు చేయలేదని ఎద్దేవా చేస్తాడు సత్యం. మనలాంటి భర్తలందరిని పోగేసే హక్కుల కోసం పురుషుల సంఘం అని పెడదాం. దానికి నాన్ను ప్రెసిడెంట్‌ను చేస్తే ఎలా ఉంటుందని బాలు అంటాడు. ఊళ్లో అందరితో నన్ను తిట్టించాలని చూస్తున్నావా అని తిడతాడు సత్యం. మానేస్తానని చెప్పి ఎన్నిసార్లు తాగుతావ్ అని బాలును తిడతాడు సత్యం.

బ్యాచిలర్స్‌గా కోడళ్లు, అత్త

రవి, మనోజ్‌ను కూడా అంటాడు సత్యం. ముందు వాళ్ల కోపం ఎలా తగ్గించాలో ఆలోచించండి అని చెప్పేసి కిందకు వెళ్లిపోతాడు సత్యం. మరోవైపు తినుకుంటూ రవిని తిట్టుకుంటుంది శ్రుతి. అక్కడికి మీనా వస్తుంది. బాలు మీద కోపంతో అన్నం తినలేదంటుంది మీనా. తర్వాత రోహిణి వస్తుంది. ముగ్గురు కలిసి తింటారు. వాళ్లు తిన్నారా అని రోహిణి అడుగుతుంది. రెస్టారెంట్‌లో తింటూ గుండ్రాయిలా అవుతున్నాడు. ఒక్కపూట తినకుంటే ఏం కాదని రవిని శ్రుతి అంటుంది.

మా ఆయన ముగ్గురు బిర్యానీలు ఒక్కడే తింటాడు పందిలాగా అని మనోజ్‌ను అంటుంది రోహిణి. పీపాల కొద్ది తాగుతాడు. మళ్లీ మొదలుపెట్టాడు అని బాలును అంటుంది మీనా. తర్వాత మీనా డోర్ వేస్తుంది. కానీ, డోర్ కొట్టినట్లు సౌండ్ వస్తుంది. డోర్ తీస్తే ప్రభావతి ఉంటుంది. దాంతో కోడళ్లు షాక్ అవుతారు. మీ కోసం మా ఆయనతో గొడవ పడ్డాను. ఆయన చాప దిండు తీసుకుని పైకి వెళ్లారని ప్రభావతి అంటుంది.

అయితే, ఇవాళ నలుగురు బ్యాచిలర్స్ అయ్యారు అని శ్రుతి అంటుంది. అత్తకోడళ్లు ఒకరి బాధలు మరొకరు చెప్పుకుంటూ మాట్లాడుకుంటారు. మరుసటి రోజు ఉదయం కారుకు మీనా, తన గ్యాంగ్ డెకరేట్ చేస్తుంటారు. బాలుతో మళ్లీ మీనా పెళ్లి చేస్తామని, ఇదే కారులో ఊరేగిస్తామని తన ఫ్రెండ్స్ అంటారు. అక్కడికి చింతామణి వస్తుంది. దీంతో పోటీ ముచ్చటగా ఉంది. మండపమే కాదు ఈ వృత్తినే వదిలేసి వెళ్లేలా చేస్తాను అని చింతామణి అంటుంది.

చింతామణి ప్లాన్ ఫెయిల్

ఏం చేద్దామని అసిస్టెంట్ అంటే.. ఓ ప్లాన్ చెబుతుంది చింతామణి. మీనా దగ్గరికి పెళ్లి కూతురు కారు డిజైన్ చూడమన్నారని ఇద్దరు రౌడీలు వస్తారు. ఆ కారు డిజైన్ బాగా లేదని వాళ్లు అంటారు. ముందు పెళ్లికూతురును చూడమనండి. ఆవిడ చెబితేనే ఇలా చేశానని మీనా అంటుంది. మేము చెబుతున్నాం కదా అని కారుకు చేసిన డెకరేషన్ అంతా పీకి పడేస్తారు రౌడీలు. నీకు రూపాయి ఇవ్వం. దిక్కున్న చోట చెప్పుకో అని వెళ్లిపోతారు రౌడీలు.

ఆ పడేసిన డెకరేషన్ చూసి మీనా ఏడుస్తుంటుంది. అది చూసి చింతామణి నవ్వుతుంది. అయితే, అదంతా చింతామణి కల కంటుంది. మీరు చెప్పిందే చేయమంటారా అని అసిస్టెంట్ వెళ్తాడు. కారుకు చేసిన డెకరేషన్‌తో మీనా ఫొటో దిగుతుంది. చింతామణి ప్లాన్ ప్రకారం ఇద్దరు రౌడీలు వచ్చి డిజైన్ చాలా చెండాలంగా ఉంది. మొత్తం తీసి పారేసి మరోటి చేయమంటారు. ఇది బాలేదా. కళ్లు కనిపించట్లేదా అని మీనా ఫ్రెండ్స్ అంటారు.

ఈ డిజైన్ పెళ్లి కూతురు చేయమంటేనే చేశాం. ఆవిడ వచ్చి చెబితేనే తీస్తామని మీనా అంటుంది. పెళ్లిపీటలపై నుంచి వచ్చి చెబుతుందా. మేమే తీస్తామని రౌడీలు అంటారు. ఏంటీ తీస్తారా. చేయి వేయిరా.. వేయిరా అని రౌడీల మీదకు వెళ్తుంది మీనా. దాంతో రౌడీలు వెనక్కి వెళ్లిపోతారు. అలా రౌడీలను బెదరగొట్టి పోయేలా చేస్తుంది మీనా. తర్వాత సీరియల్ నటుడు కిరణ్ వచ్చి డెకరేషన్ చాలా బాగుందని చెబుతాడు.

మెచ్చుకున్న కిరణ్

ఇలాగే మెయింటేన్ చేస్తే మంచి పొజిషన్‌లోకి వెళ్తారని కిరణ్ అంటాడు. మీరు అవకాశం ఇవ్వకుంటే మా పని బయటకొచ్చేది కాదు కదా అని మీనా అంటుంది. వీళ్లకు అడిగిన దానికంటే ఎక్కువగా దు వేలు ఇచ్చి పంపించు అని అసిస్టెంట్‌తో కిరణ్ చెబుతాడు. దాంతో మీనా వాళ్లు చాలా సంతోషిస్తారు. చింతామణి వచ్చి వాళ్లు చేసిన డెకరేషన్ గురించి అడుగుతుంది.

తెలుగింటి పెళ్లిలో ఇంగ్లీష్ వాసన వచ్చిందంటాడు కిరణ్. మీరు హైబ్రీడ్ పూలు వాడారు. అవి ఫొటోలకు బాగుంటుంది కానీ మనసుకు హాయినివ్వవు. మీరు చాలా నిరాశపరిచారు. వీరికి చెప్పినదానికంటే ఐదు వేలు తక్కువ ఇవ్వమని కిరణ్ అంటాడు. దాంతో చింతామణి షాక్ అవుతుంది. అక్కడ ఐదు వేలు పెంచి ఇక్కడ ఐదు వేలు తగ్గించడం నాకు చాలా అవమానంగా ఉఁదని చింతామణి అంటుంది.

నేను పనితోపాటు రెస్పెక్ట్ కూడా చూస్తాను అని కిరణ్ అనేసి వెళ్లిపోతాడు. డెకరేషన్ పాడు చేయడానికి వచ్చినవాళ్లు నీ మనుషులు అని నాకు తెలుసు. ఆ విషయం చెబితే కిరణ్ గారు పూర్తి అమౌంట్ కూడా ఇచ్చేవారు కాదు అని మీనా అంటుంది. ఈ ఒక్క విషయంలోనే గెలుచావనుకో. పండగ చేసుకో. నేను విదిలించిన పూలతో పూల పల్లెకి ఎక్కు అని చింతామణి అంటుంది.

ఎదుటివాళ్లను కిందకు లాగుతారు అంతే

నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు కష్టపడి ఇక్కడికి రాలేదు. ఎదుటివాళ్లను కిందకి లాగడానికి కష్టపడతారు అని మీనా అంటుంది. ఏమన్నావ్ అని చింతామణి అసిస్టెంట్ మీదకు వస్తే లాగిపెట్టి కొడుతుంది మీనా. దాంతో అతనికి సౌండ్ ఏం వినిపించదు. నీ వెనుక ఇలాంటి చెంచాలు ఉన్నారు. నా వెనుక భర్త ఉన్నాడు. అందుకే నాకు ధైర్యం ఎక్కువ. మనతోపాటు ఇతరులు కూడా బతకాలని అనుకోవాలని వార్నింగ్ ఇస్తుంది మీనా.

ఈ కొటేషన్ నీ భర్త కారు వెనుకాల రాసుకో అని వెళ్లిపోతుంది చింతామణి. మరోవైపు గుడికి మనోజ్, రోహిణి కారులో వస్తారు. పార్వతి వెళ్లి పలకరిస్తుంది. అర్చన కోసం వచ్చారా పూలు ఇవ్వమంటారా అని సుమతిని పిలుస్తుంది పార్వతి. అర్చన కోసమే, పూజ కోసమో రాలేదని, వేరే పని ఉందని రూడ్‌గా మాట్లాడి మీనా తల్లి పార్వతిని అవమానిస్తుంది రోహిణి. తర్వాత పోలీసులు వస్తారు.

వాళ్లకు అవసరం ఉంటే అడుగుతారు కదా. అవసరమా నీకు అని పార్వతిని అంటుంది సుమతి. అది సరే కానీ పోలీసులు వచ్చారు ఎందుకే అని పార్వతి అంటుంది. ఏదోటి చేసి హెల్ప్ చేయమని పోలీసులతో మనోజ్, రోహిణి అంటారు. తర్వాత టెంపుల్ ఇంఛార్జ్ వచ్చి గుడి సీసీ టీవీ ఫుటేజ్ ఉన్న పెండ్రైవ్ ఇస్తాడు. ఆ పెండ్రైవ్ తనకు కూడా ఇవ్వమని పోలీసులను అడుగుతాడు మనోజ్.

పోలీసులకు సీసీ టీవీ ఫుటేజ్

ఆన్‌లైన్‌లో వీడియో పెట్టి ట్యాగ్ చేస్తే వాళ్లు దొరుకుతారని మనోజ్ అంటాడు. అది ఆ ఫ్రాడ్ చేసినవాళ్లు చూస్తే జాగ్రత్తపడరా. ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలో నాకు నువ్వు చెబుతున్నావా అని కానిస్టేబుల్ కోప్పడుతాడు. దాంతో రోహిణి క్షమించమంటుంది.

క్లూ దొరికితే చెబుతాం. ఎక్సా‌ట్రాలు చేయకండని పోలీసులు వెళ్లిపోతారు. అదంతా సుమతి, పార్వతి చూస్తారు. మీనాకు కాల్ చేసి గుడిలో జరిగింది చెబుతుంది సుమతి. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More